నిలివేతు పతాకం మన జాతీయ పతాకం మన దేశ ఔన్నత్యానికి ప్రతీక.. అది నిండుగా ఎగిరితే చూసే గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగుతాయి. దేశభక్తి ఉరకలెత్తుతుంది. ఈ క్రమంలోనే మన దేశ ఔన్నత్యాన్ని చాటేలా పొడవైన జెండా స్తంభాన్ని ఏర్పాటు చేసింది అమ•త్‍సర్ ఇంప్రూవ్‍మెంట్ ట్రస్టు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని అట్టారీ వద్ద ఏర్పాటైన ఈ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాకిస్థాన్‍లోని లాహ•ర్• నుంచి కూడా ఈ
సృష్టిగా మారిన సృష్టి కర్త
దేవుడు చేసిన లోకాన్ని ప్రేమిద్దాం దేవుడు చేసిన మనుషులుగా జీవిద్దాం ఆస్తికుల గురించి, నాస్తికులు గురించి, వారు చేసిన అనేక తర్కాలు, సిద్థాంతాల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆస్తికులైనవారు కూడా చాలామంది ఎందుకో జీవితాన్ని విషాదంగా గుడపుతూ ఉంటారు. దైవాన్ని నమ్మినవాళ్లకు భయమంటూ ఉండకూడదు కదా! కానీ వీళ్లెందుకు భయపడతారు? అసలు భయంతోనే దేవుణ్ణి నమ్ముతారు. దేవునిపై విశ్వాసం కంటే భయమే ఎక్కువ వీరికి. విశ్వాసమున్నచోట భయానికి తావు లేదు. భయమున్న చోట
కాన్క-కోవెల
మీ జీవితధ్యేయమేమిటి? అని అడిగితే మోక్షం పొందటం, లేదా తిరిగి దైవసన్నిధికి చేరడం అనే జవాబు సాధారణంగా చెబుతాం. ఎంతో ప్రేమను, మేధస్సును నింపి ఇంత అందమైన ఆనందమయమైన, ఆయన ప్రసాదించిన జీవితాన్ని దైవప్రసాదంగా అనుభూతి పొందుతూ, జీవితాన్ని అనుభవించి, ఆనందానుభూతిని పొందితే జీవితమంతా దైవసాన్నిధ్యాన్ని అనుభవించినట్లే. భగవంతుడు అనుగ్రహించిన అతి విలువైన కాన్క ఈ జీవితం. ఈ కాన్కలో కాపురమున్న ఆయనకనూ, కాన్కనూ అనుభవించడం ద్వారా, ఆనంద
పల్లె వెలుగుల ‘అరవిందం’
అరవింద పిల్లలమర్రి.. ఈ పేరు పల్లె జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అమెరికాలోని మేరీల్యాండ్‍లో స్థిరపడిన ఈ తెలుగు మహిళ ‘ఎయిడ్’ పేరుతో అందిస్తున్న సాయం ఎన్నో కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ‘అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్‍మెంట్’ (ఎయిడ్) ప్రపంచ సమన్వయకర్తే అరవింద. మహిళా రైతులకు ఆర్థిక సహకారాన్ని అందించడం, చిరుధాన్యాల సేద్యాన్ని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాల ద్వారా ‘ఎయిడ్’ ఇప్పటి వరకు దాదాపు 20 వేల మందికి సేవలందించింది. తెలుగు
అమెరికాలో భారత ధ్రువతార
అమెరికాలో ‘రైజింగ్‍స్టార్’గా పేరొందిన నిక్కీహేలీని విశిష్ట పదవి వరించింది. దీని ద్వారా భారత్ ఖ్యాతి అంతర్జాతీయ సమాజంలో మరింత ఇనుమడించింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయభారిగా ఆమె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె దక్షిణ కరొలినా గవర్నర్‍గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనేక అంశాలపై స్పష్టంగా మాట్లాడగల చాతుర్యం నిక్కీహేలీ సొంతం. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆమె భారత్‍లోని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. నిక్కీ 1972, జనవరి
