అవీ.. ఇవీ లక్ష్యం మారొద్దు!

కాళీ మాత ఆలయంలో ఒకరోజు భక్తులంతా కలిసి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారు.
అయితే, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు.. వాళ్లు తయారు చేస్తున్న లడ్డూలకు చీమలు పట్టడం మొదలైంది.
రామకృష్ణ పరమహంస చెప్పిన ప్రకారం జీవహింస చేయకూడదు. మరి, ఆ చీమలను ఎలా తొలగించాలనేది వారికి పెద్ద సమస్య అయ్యింది.
‘చీమలను చంపకుండా, వాటిని వదిలించడం ఎలా?’ అని వారంతా ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పాలని నేరుగా రామకృష్ణ పరమహంస వద్దకే వారంతా వెళ్లి అడిగారు.
అప్పుడాయన వారికి ఇలా సలహానిచ్చారు`
‘చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. దాంతో అవి దారి మళ్లి లడ్డూలను వదిలేస్తాయి’.
భక్తులు అలాగే, చేశారు. ఆయన చెప్పినట్టే చీమలన్నీ దారి మళ్లాయి. కొద్దిసేపట్లోనే ఇదంతా జరిగిపోయింది.
సమస్య కొలిక్కి వచ్చింది.
అప్పుడు మళ్లీ రామకృష్ణ పరమహంస వారితో ఇలా అన్నారు`
మనుషలూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే లక్ష్యం మరిచి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దానితొ సరిపెట్టుకుంటారు. అంతకుముందు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు. నిజానికి చీమలు లడ్డూలను ఆశ్రయించడం ద్వారా ఆకలి తీర్చుకోవాలని అనుకున్నాయి. కానీ, కాసింత చక్కెర పొడి చల్లగానే తమ లక్ష్యాన్ని వెను వెంటనే మార్చేసుకున్నాయి. తమ ఆహారం కోసం దారి వెతుక్కుంటూ వచ్చి లడ్డూను చేజిక్కించుకుని కూడా చక్కెర పలుకులకు ఆశపడి లడ్డూను వదిలేశాయి. మనం కూడా భగవంతుడే సర్వస్వం అనుకుని సాధన మొదలుపెడతాం. మధ్యలో ఎవరో ఏదో చెబితే దాని వద్దకు వెళ్లి మన సాధనను మరుస్తాం.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు’ అని పరమహంస వివరించే సరికి శిష్యులకు జ్ఞానోదయం అయ్యింది.

Review అవీ.. ఇవీ లక్ష్యం మారొద్దు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top