కాలం పుట్టిన రోజు ఉగాది

ఉగస్యః ఆది ఉగాది. ఉగ అంటే నక్షత్రపు నడక అని అర్థం. ఆనాడే మనకు కొత్త ఏడాది ఆరంభమవుతుంది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. దీని ప్రకారం మనకు 60 సంవత్సరాలున్నాయి. ఈ అరవై సంవత్సరాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. చైత్రమాసం, శుక్ల పక్షంలో ప్రథమ తిధి అయిన పాడ్యమి నాడు కొత్త ఏడాది మొదలవుతుంది. ఆ రోజును మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. స•ష్టి ఆరంభానికి బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తమే ఉగాది అని ఆనాడే ఆయన కాల విభజన పక్రియ చేపట్టాడని పురాణాలు చెబుతున్నాయి.

స•ష్టికర్త కాల విభజనను అనుసరించి ఆనాటి నుంచి కొత్త ఏడాది మొదలైంది కాబట్టి మనం ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. వనవాసానంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి చైత్ర శుక్ల పాడ్యమినాడు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడని ఆ కారణం వల్ల కూడా ఉగాదిని పర్వదినంగా జరుపుకోవడం సాంప్రదాయమైందని పెద్దలమాట. ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, తరువాత మార్గశిర శుద్ధపాడ్యమి, ఆ తర్వాత చైత్రశుద్ధ పాడ్యమి… ఈ మూడింటినీ ఉగాదిగా జరుపుకునేవారని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు రాష్ట్రాలవారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చేసే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారమే. కొత్త ఏడాదిని మనం ఏ విధంగా ఆహ్వానించాలో, ఏయే సంప్రదాయాలు, పద్ధతులు పాటించాలనే విషయమై మన ప్రాచీనులు కొన్ని విధి విధానాలను తెలియజేశారు. అవేమిటో చూద్దాం.

తైలాభ్యంగన స్నానం

ఈనాడు త్వరగా నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో తైలాభ్యంగన స్నానం చేయాలి. ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. కాబట్టి మామూలు రోజులో ఎలా స్నానం చేసినా, దానిని కాస్త పక్కనపెట్టి ఉగాదినాడు పొద్దున్నే లేచి ఇంట్లోని పెద్దవారితో తలపై నువ్వులనూనె పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకుని అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జ్యేష్టాదేవి బాధనుంచి విముక్తి పొందవచ్చనేది పెద్దల మాట. అనంతరం కొత్త బట్టలు వీలైతే కొత్తనగలు ధరించాలి. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని మంగళస్నానం చేసి దేవునికి నమస్కరించి నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు ధరించడం పండుగ కళతో బాటు మనకు, మనసుకూ ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన అనంతరం బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి. ఈరోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం.

ఉగాది సంప్రదాయం

ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి ఆకులు లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలను పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి.

ఈ పండుగలో దాగి ఉన్న విశేషాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.

మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉగాది. అందుకే దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. గత సంవత్సరం విళంబి కాగా ఈ ఉగాది నుంచి వికారి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రైతులు, రాజకీయనాయకులు, ఉపాధ్యాయులు, కళలు, సాంస్క•తిక రంగాలవారు, సినీనటులు, వివిధ రకాల వ•త్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు లేదా నామనక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటారు.

పంచాంగం అంటే …

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివ•త్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొంద వచ్చు. కాబట్టి చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించే వారం దరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ తప్పక పంచాంగం చూడాలి.

ఆరు రుచులలో అనేక అర్థాలు
ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రక•తి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రక•తి అసంపూర్ణం. కాబట్టి జీవునికి అంటే… మానవునికి, ప్రక•తికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. సరికొత్త ప్రక•తి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి.

ఆనాటి నుంచి ఈనాటి దాకా!

ప్రపంచంలో ఎక్కువ పూలు వికసించేది, పండ్లలో రాజయిన మామిడిపండు విరివిగా లభించేదీ, పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కుందపుష్పాలు అంటే మల్లెపూలు పూసేదీ, ఆమని పాడేదీ వసంత రుతువులోనే! అందుకనే ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు వసంత ఋతువర్ణన చేయని కవులు, రచయితలు లేనే లేరంటే అతిశయోక్తి కాదు.

సంప్రదాయమే శ్రేష్ఠం

పాశ్చాత్య సంస్క•తి మనదేశంలో ప్రవేశించిన తర్వాత తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితోనే ఆరంభమవుతుందన్న విషయాన్ని మరచి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో తప్పేమీ లేకపోయినప్పటికీ, మన మూలాలను మరవడం మాత్రం క్షంతవ్యం కాదు. కాబట్టి వేడుకలు, కవి సమ్మేళనాలు చేసుకోకపోయినా, ఉగాది సంప్రదాయం మేరకు పాత కక్షలు కార్పణ్యాలు మరచి ఒకరితో ఒకరు అన్యోన్యంగా, సుఖసంతోషాలతో గడపాలి.

నూతనత్వానికి నాందిగా… ఉగాది

బ్రహ్మదేవుడు స•ష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తినపీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం.

ఉగాది పండుగకుస్వాగతం

మాసానాం మార్గ శీర్షోహం ఋతునాం కుసుమాకరః
అని భగవద్గీత విభూతి యోగంలో శ్రీక•ష్ణులు సెలవిచ్చారు
మన పండుగలన్నీ ఋతువులపైనే ఆధార పడి ఉన్నాయి. ఉగాది వసంత ఋతువులో వస్తుంది. ఈ రోజులలో ప్రక•తి అత్యంత రమణీయంగా ఉంటుంది.తరు శాఖలు కొత్త చిగురులతో కళగా ఉంటాయి.కోకిలలు మామిడి చిగుళ్ళను ఆస్వాదిస్తూ పంచమ స్వరాన్ని ఆలపిస్తూ ఉంటాయి. సర్వత్రా పక్షుల కిలకిలారావాలతో మారుమ్రోగు తుండగా ఉగాది కోలాహలంగా మన ముందుకొస్తుంది.
భారతీయ కాల గణన ప్రకారం ఉగాది ముహూర్తం అన్ని శుభ కార్యాలను ప్రారంభించడానికి సరైనది.
బ్రహ్మ స•ష్టి ఆరంభించిన అధ్యాయాన్ని బ్రహ్మ కల్పమని,కల్ప ప్రారం భాన్ని కల్పాది అని ప్రతి కల్పంలో మొదట వచ్చే యుగ ఆది సమయమే ఉగాది అయ్యింది. అలాగే క్రీ.శ 79వ సం.లో శాలివాహన చక్రవర్తి ఉగాది నాడే పట్టాభిషిక్తుడయ్యాడు,అందుకే శాలివాహన శకంగా పేర్కొంటున్నాం.
క•తయుగం 17,28,000
త్రేతాయుగం 12,96,000
ద్వాపరయుగం8,64,000
కలియుగం 4,32,000
ఒక మహాయుగం43,20.000
71 మహాయుగాలు ఒక మన్వంతరం
శ్రీరాముని పట్టాభిషేకం ఉగాది.శ్రీరామ జన్మోత్సవాలు జరుపుకునే నవరాత్రులు ఉగాదితోనే ప్రారంభం.
ప్రపంచంలో ఎక్కువ పుష్పాలు వికసించేది వసంతంలోనే కాబట్టి విజ్ఞులు దీనిని మధుహావదం అన్నారు.ప్రక•తిని చూసి పరవసిస్తూ ఛైత్ర శుద్ధ పాడ్యమి గున్నమామిడి గుబుర్లు,మల్లెల ఘుమ, ఘుమలు,చిగురులెత్తే లేత కొమ్మలు, మలయ సమీరాలు వీటితో పుడమికి పచ్చని చీరను కట్టే చైత్రమాసం ఉగాదిని స్వాగతిస్తుంది.

స్నానం ప్రత్యేకం

ఉగాది నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన(తలంటు) స్నానం చేయాలి. ఒళ్ళంతా నువ్వుల నూనెతో మర్ధనా,సున్నిపిండితో రుద్దుకుని,కుంకుడు కాయ రసంతో తలంటు కోవాలి.
దైవానికి పుష్పార్చన,అర్ఘ్యం,ధూప దీపాదులను సమర్పించి వేప పచ్చ•
ని స్వీకరించాలి. పచ్చడి స్వీకరించే ముందు ఎలాంటి ఆహార పదార్ధాలను తినకూడదు.

పచ్చడి ప్రాధాన్యం

ఆరోగ్య పరంగా వేప క్రిమి సంహారిణి,కుష్ఠు, మధుమేహం,క్షయ,దగ్గు సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
మామిడి రసం గొంతు వ్యాధుల్ని,చిగుళ్ళ వాపు,నోటిపూత నాశనం చేస్తుంది.
చింతపండు వాత రోగాల్ని,మూత్ర పిండంలోని రాళ్ళను కరిగిస్తుంది.
బెల్లం ధాతువ•ద్ధిని అందిస్తుంది
పచ్చి మిరప వాతాన్ని దూరం చేస్తుంది.
ఉప్పు అజీర్ణాన్ని పోగొడుతుంది.
తాత్వికంగా ఆలోచిస్తే మానవుడు మంచి చెడులను రెండింటిని స్వీకరించాలి. బంధుమిత్రులతో కలసి భోజనం చేయాలి ఆనందంగా.

Review కాలం పుట్టిన రోజు ఉగాది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top