పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షి చిట్టి పాప చిన్న మా అమ్మాయి శ్రీ ముఖము చూసి సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటే పనసపండని జనులు పరుగులెత్తేరు దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే దోసపండని జనులు దోసిలొగ్గేరు నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు నిత్యమూ అమ్మాయి నీళ్లాడు




