భరతజాతి మనది. నిండుగ వెలుగుజాతి మనది

‘తెలుగుపత్రిక’తో డాక్టర్‍ దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్‍ మాటామంతి

‘మానవజన్మ దేవుడిచ్చిన వరం’ అని చెప్పే ఆయన ఆ విలువైన వరాన్ని నిజం చేసుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. నిలువెత్తు భారతీయతకు ప్రతిబింబంలా కనిపించే ఆయన.. సంస్క•తీ సంప్రదాయాలకు ప్రాణమిస్తారు. ఆధ్యాత్మిక సిద్ధాంతాల అనుభవసారంతో, నీతి నిజాయితీల ఆదర్శ భావంతో విదేశీగడ్డపై భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను చాటుతున్న ఆయన.. దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్‍. ఆంధప్రదేశ్‍లోని క•ష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించిన ఆయన వైద్యునిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేశారు. వైద్యవ•త్తిలో కొనసాగుతూనే ప్రవ•త్తిగా ఆధ్యాత్మిక భావజాల వ్యాప్తికి క•షి చేస్తున్న ఆయన మెంఫిస్‍లో శ్రీ వేంకటేశ్వరాలయాన్ని నిర్మించే విషయంలో ‘పునాదిరాయి’గా నిలిచారు. ఈ ఆలయ నిర్మాణ విషయంలో డాక్టర్‍ దుగ్గిరాల పోషించిన పాత్ర ఎనలేనిది. అయితే, ఆయన మాత్రం తాను ‘దేవుడి చేతిలోని పనిముట్టు’ను మాత్రమే అంటారు. ప్రస్తుతం మెంఫిస్‍ వేంకటేశ్వర ఆలయం వార్షికోత్సవాలకు ముస్తాబవుతున్న సందర్భంలో ఆయన తన అంతరంగాన్ని ‘తెలుగు పత్రిక’ ప్రతినిధితో పంచుకున్నారు. డాక్టర్‍ కమ్‍ ఆధ్యాత్మిక సాధకుని విజయ ప్రస్థానంలోకి ఒకసారి తొంగి చూస్తే.

అంగలూరు టు అమెరికా

దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్‍ 1948, జనవరి 27న శివాజీరావు, సరోజినీదేవి దంపతులకు జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్ద. క•ష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన ఈయన గుడ్లవల్లేరులో తన అమ్మమ్మ గారి చెల్లెలు వద్ద పెరిగారు. హైస్కూలు విద్య అంతా అక్కడే జరిగింది. విజయవాడ లయోలాలో పీయూసీ చేశారు. 1963-69 మధ్య కాలంలో కర్నూలులో ఎంబీబీఎస్‍ పూర్తి చేశారు. 1969లో విజయలక్ష్మితో వివాహమైంది. ఎంబీబీఎస్‍ చేసేటపుడే ఆమె పరిచయం.. ఆమె కూడా అక్కడే మెడిసిన్‍ చేశారు. అప్పట్లో ఈయన పెళ్లి ఖర్చు రూ.200. గాంధేయ మార్గంలో సింపుల్‍గా వివాహం చేసుకున్నానని ఇప్పటికీ ఆయన సరదాగా చెబుతారు. 1970లో అమెరికా వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన 1972లో ఆ కలను సాకారం చేసుకున్నారు. అమెరికా వెళ్లిన వెంటనే 1972 నుంచి 80 వరకు న్యూయార్క్ వర్సిటీలో రెసిడెన్సీ చేశారు. అదే సమయంలో ఆయన సతీమణి అదే వర్సిటీలో అనస్థీషియా చేశారు. దుగ్గిరాల 2006 వరకు దాదాపు 26 ఏళ్ల పాటు జనరల్‍ సర్జన్‍గా చేశారు.

వైద్య వ•త్తి గురించి..

డాక్టర్‍ దుగ్గిరాల పనిచేసే క్లినిక్‍ను ఒకసారి విలేజ్‍కు మార్చారు. అచ్చం మన పల్లెటూళ్ల మాదిరిగానే అక్కడి మనుషుల మధ్య ఎంతో అనురాగం, ఆప్యాయత ఉట్టిపడేవి. వారి మధ్య పనిచేయడాన్ని తాను ఎన్నటికీ మరిచిపోలేనని దుగ్గిరాల చెబుతుంటారు. ఇక, ఒకసారి ఒక శ్వేతజాతీయుడు కడుపునొప్పితో ఈయన పనిచేసే ఆస్పత్రికి వచ్చాడు. అయితే నల్ల జాతీయులనే చులకన భావంతో ఆపరేషన్‍కు నిరాకరించాడు. చివరికి ఎలాగో ఒప్పించి శస్త్రచికిత్స అయిందనిపించారు. ఆ తరువాత శ్వేత జాతీయుడు మనసు మార్చుకున్నాడు. మనుషుల మధ్య ద్వేష భావం కూడదనే తన మాటల పట్ల అతను ఆ సమయంలో చూపిన క•తజ్ఞత తన జీవితంలో ఇప్పటికీ మరువలేనని డాక్టర్‍ దుగ్గిరాల చెబుతారు.

ఐసీసీటీ ఏర్పాటు గురించి..

డాక్టర్‍ దుగ్గిరాల చాలా కలివిడి మనిషి. అందరితో చాలా తేలిగ్గా కలిసిపోతారు. ఈయన ఉండేచోట దాదాపు 200 వరకు భారతీయ కుటుంబాలు ఉండేవి. వారందరి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది. ఈ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినదే.. ఇండియా కల్చరల్‍ సెంటర్‍ అండ్‍ టెంపుల్‍ (ఐసీసీటీ). 1985లో రూ.50 వేలతో కొంత భూమి కొన్నారు. అనంతరం అందులోనే సెంటర్‍ నిర్మాణాన్ని ప్రారంభించారు. 1992 నాటికి నిర్మాణం పూర్తయ్యింది. 1994లో వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇంకా ఈ ఆలయ ఆవరణలోనే శివుడు, రాముడు, రాధాక•ష్ణులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠాపన సమయంలో పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశీర్వచనాలు అందుకున్నారు. డాక్టర్‍ దుగ్గిరాలతో పాటు ఆయన సతీమణి కొంతకాలం ఈ ఆలయానికి ప్రెసిడెంట్‍గా బాధ్యతలు నిర్వర్తించారు.

భారతీయత మన ఆస్తి

ప్రస్తుతం మన భారతీయ సంస్క •తీ సంప్రదాయాలపై డాక్టర్‍ దుగ్గిరాల ఒకింత అసంత •ప్తినే వ్యక్తం చేస్తారు. పేరులో మాత్రమే ‘భారత్‍’ను ఉంచుకున్న మన మనుషులు.. మచ్చుకైనా ‘భారతీయత’ను కలిగి లేరని అంటారు. నైతిక విలువలు, సంప్రదాయాలు మారిపోతున్నాయని, ప్రపంచమంతా భారత్‍ ఆచార వ్యవహారాలను ఆసక్తిగా చూస్తోంటే.. మనం మాత్రం పాశ్చాత్య దేశాలను అనుసరించడానికి ప్రయత్నిస్తు న్నామని ఆయన అసంత•ప్తి వ్యక్తం చేస్తారు. మన మూలాలను మరిచిపోయి పాశ్చాత్య ధోరణికి ఎగబడటం మంచిది కాదని హితవు చెబుతారు. ఆధునికత పేరుతో ఆధ్యాత్మికతను మరిచిపోవడం తగదని అంటారు. భారతీయ సంస్క •తి ఇంతగా చిన్నబోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని చెప్పే ఆయన.. ఇందుకు ప్రధానంగా ప్రచార, ప్రసార సాధనాలకే బాధ్యత అని అంటారు. ఇవి ప్రసారం చేస్తున్న కథలు, కథనాలు, సీరియల్స్ మన సంప్రదాయాలను, ఆచారాలను భ్రష్టు పట్టిస్తున్నాయని అంటారు.

అనుకరణ కాదు.. ఆచరణ ముఖ్యం

‘ఈ ప్రపంచంలో ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చినా చోటిచ్చే దేశం అమెరికా.. ఇది అవకాశాల స్వర్గధామం. అయితే ఇక్కడకు వచ్చే భారతీయులు ఎవరూ భారతీయతను మరిచిపోవద్దు. ఇదే నా విన్నపం’ అంటారు డాక్టర్‍ దుగ్గిరాల. దేశం కాని దేశం వెళ్లినా మన మూలాలు మాత్రం మరిచిపోకూడదనేది డాక్టర్‍ దుగ్గిరాల నిశ్చితాభిప్రాయం. అమెరికా లేదా మరే పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుసరించడం కూడదనేది ఆయన తరచూ చెప్పే మాట. ‘నిజానికి ఉదారభావం, విశాలత్వం, దానశీలత అమెరికన్ల సహజ లక్షణాలు. కానీ, మనం వారిని డ్రెస్సింగ్‍, ఇతరత్రా విషయాల్లో అను కరిస్తూ.. వారి స్వాభావిక సుగుణాలను, లక్షణాలను మాత్రం విస్మరిస్తున్నాం. మంచి డ్రెస్సింగ్‍ వేసుకున్నంత మాత్రాన ఆధునికల మైపోం. వారిలోని మంచి లక్షణాలను ఆచరించి, అనుసరిస్తేనే మనుషులుగా మిగులుతాం. కాబట్టి పాశ్చాత్యతను అనుసరించే వారంతా మన భారతీయతను మరిచిపోవద్దనేదే నా అభిలాష’ అనేది డాక్టర్‍ దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్‍ స్థిరాభిప్రాయం.

మారాలి.. మనల్ని మనం గౌరవించుకోవాలి

మనిషి మానవత్వంతో బతికిన నాడే ఒకరిపై ఒకరికి గౌరవ భావం ఏర్పడతాయని డాక్టర్‍ దుగ్గిరాల అంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మన భారతీయ మూలాలు, అందులోని విశిష్టతల గురించి నూరిపోయాలని చెప్పే ఆయన.. ఏ దేశంలో ఉన్నా మన సంస్క•తిలోని గొప్పదనాన్ని మరిచిపోకూడదని చెబుతారు. ప్రస్తుతం మన భారతీయత ఎలా ఉందనే విషయంలో ఆయన ఒక ఉదాహరణ చెబుతారు. అదేమిటంటే.. చెడ చూడండి. అది దేనినైనా పట్టిందంటే లోలోపల తినేస్తుంది. చెదపట్టిన వస్తువు మాత్రం పైకి మామూలుగానే కనిపిస్తుంది. కానీ, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ చెదపట్టిన వస్తువు కుప్పకూలిపోతుంది. ప్రస్తుతం మన పరిస్థితి ఇలాగే ఉందనిపిస్తోంది అని ఆయన అంటారు. చెన్నైవాసులు తమ మాత •భాష అంటే ప్రాణమిస్తారని, వారి ప్రముఖ కట్టడాలు, ప్రభుత్వ భవనాలకు తమిళంలోనే పేర్లు ఉంటాయని, తమిళ ప్రముఖుల పేర్లే వాటికి పెడతారని చెప్పే ఆయన.. ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల వారు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అంటారు. మనవన్నీ అరువు, ఎరువు తెచ్చుకున్న పేర్లేనని, మనల్ని మనం గౌరవించుకోకపోవడం, మనపై మనకు గౌరవ భావం లేకపోవడం ఈ ధోరణికి కారణమని ఆయన విశ్లేషిస్తారు. ప్రతి ఒక్కరూ ‘నాకేంటి?’ అని కాకుండా, ‘నేనేంటి? ఈ దేశం కోసం నేనేం చేయగలను?’ అని ఆలోచిస్తే మార్పు సాధ్యమేనని ఘంటాపథంగా ఒక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఉన్న బొరియలో ఒక ఎలుక ఉంది. ఆ పెద్ద మర్రి చెట్టు పైన ఒక పిల్లి ఉంది. ఆ చెట్టు దగ్గరికి సాయం సమయంలో రోజూ ఒక వేటగాడు వచ్చి ఆ చెట్టు దగ్గరిలో తిరిగే జంతువులను పట్టడానికి వలపన్ని వెళ్లి.. పొద్దున్నే మళ్లీ వస్తాడు. ఒకరోజు పిల్లి ఆహారం కోసం చెట్టు దిగి పొరపాటున ఆ వలలో చిక్కుకుంది. అప్పుడే ఆహారం కోసం కన్నంలో నుంచి బయటికొచ్చిన ఎలుక అక్కడ తిరుగుతున్న గుడ్లగూబని, ముంగిసను చూసి భయపడిపోయింది. ఆ రెండింటి నుంచి తప్పించుకుని ధైర్యంగా ఉండాలని అనుకుంది. మరోవైపు నుంచి ఆ వల దగ్గరకెళ్లింది. పిల్లిని చూసింది ఎలుక.

‘పిల్లీ! నేను నీ వల తాళ్లు కొరికి నీకు సాయం చేయగలను. కానీ ప్రస్తుతం గుడ్లగూబ, ముంగిస ఈ దగ్గరలోనే ఉన్నాయి. ముందు నీ ఒళ్లోకి నన్ను తీసుకో. నా భయం తీరుతుంది’ అంది ఎలుక.

‘నువ్వు శరణుకోరి వస్తున్నావు కనుక నిన్ను తప్పక రక్షిస్తాను. భయం విడిచి నా దగ్గరకు రా. నన్ను చూసి గుడ్లగూబ, ముంగిస నీ దగ్గరకు కూడా రావు. కనుక, నా దగ్గరే ఇప్పుడు రక్షణ నీకు. నిన్ను నేను తినను’ అంది ఎంతో ప్రేమగా పిల్లి.

ఎలుకకు ధైర్యం వచ్చింది. ‘అందుకే కదా! నీ దగ్గరకు వచ్చి నీ శరణు కోరాను. నిన్ను కూడా ఈ వల నుంచి రక్షిస్తాను’ అంటూ వలలో దూరి పిల్లి ఒడిలో ఎలుక దాక్కుంది.

ఎంత విచిత్రం? పిల్లి ఒడిలో ఎలుక తలదాచుకోవడం!

ఇది చూసి భయపడి గుడ్లగూబ, ముంగిస అక్కడి నుంచి పారిపోయాయి. ఎలుకకు ధైర్యం వచ్చింది. ‘అవి పారిపోయాయి. ఇక వల కొరికి నన్ను రక్షించు’ అని పిల్లి ఎలుకను కోరింది.

ఎలుక కొంచెం గొంతు తగ్గించి- ‘వల కొరికాక నువ్వు ఏమి ఆలోచిస్తావో ఎవరికి తెలుసు? శత్రుత్వం ఉన్న చోట సంధి చేసుకున్నా పూర్తిగా నమ్మడానికి వీలుకాదని నీతిమంతులు చెబుతారు’ అంది.

నేను నీకు కీడు చేయను. నన్ను నమ్మి నా వల తాళ్లు కొరుకు. వేగంగా ఈ పనిచేయి’ అని పిల్లి ఎలుకను బతిమాలింది.
అలా పిల్లి, ఎలుక మాట్లాడు కుంటూ ఉండగా తెల్లారిపోయింది.

‘అయ్యో! ఇంకా ఏం చేస్తున్నావు? యముడిలాగా వేటగాడు రానే వచ్చాడు. త్వరగా తాళ్లు కొరుకు’ అని పిల్లి కంగారుపెట్టింది.
‘భయపడకు. వచ్చేస్తున్నా’ అంటూ ఎలుక గబగబా వల తాళ్లు కొరికింది. పిల్లి వేగంగా చెట్టుపైకెక్కింది.

ఎలుక గబుక్కున కన్నంలో దూరిపోయింది. వేటగాడు అక్కడకు వచ్చాడు. వల కొరికి, తాళ్లన్నీ ఊడిపోయి కనిపించాయి. అంతా వృథా ప్రయత్నమైందని విచారిస్తూ వెళ్లిపోయాడు.

చెట్టుపై ఉన్న పిల్లి కన్నంలో ఉన్న ఎలుకతో- ‘మనిద్దరం స్నేహితులం. ఆపదలో ఒకరినొకరు కాపాడుకున్నాం. ఇద్దరం కలిసి సుఖంగా ఉందాం రా’ అంది ప్రేమగా పిల్లి.

‘నీ మనసు ఎప్పుడెలా మారుతుందో నీకే తెలియదు. కనుక ఇలాగే దూరంగానే ఉందాం’ అంది ఎలుక.
‘అయ్యో! అలా అనడం ధర్మమా? నా ప్రాణ రక్షణ చేసిన నిన్ను శత్రువుగా ఎప్పుడైనా చూస్తానా?’ అంది పిల్లి.

‘ఇంతకన్నా నీకు దగ్గరగా నేను రాను. ఎందుకంటే నేను నీకు ఆహారం కదా! బలవంతుడైన శత్రువు వలన ప్రయోజనం కలిగినా, అది అయిపోయిన తరువాత ఆ స్నేహం వదిలేయాలి. లేకపోతే కీడు కలుగుతుంది. నమ్మదగిన వారిని నమ్మాలి. నీలాంటి వారిని నమ్మకుండా నేను బతుకుతాను. వేటగాడు లాంటి వాడిని నమ్మకుండా నువ్వు బతుకు’ అని కచ్చితంగా చెప్పింది ఎలుక.

పిల్లి సిగ్గుపడింది. నిజమే. ఎలుక తనకు ఆహారం. ఏ సమయంలో బుద్ధి ఎలా పుడుతుందో గదా! అనుకుంటూ పిల్లి మెల్లగా చెట్టు పైకి వెళ్లిపోయింది. ఎలుక వేరొక చెట్టు దగ్గర ఉన్న కన్నంలోకి వెళ్లిపోయింది.

నీతి: ఈ కథలోని నీతి.. శత్రువుకి అవసరమొస్తే సహాయం చేయొచ్చు. కానీ శత్రువును పూర్తిగా నమ్మకూడదు.

Review భరతజాతి మనది. నిండుగ వెలుగుజాతి మనది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top