అగ్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డప్పుకు మెగా పవర్‍స్టార్ రామ్‍చరణ్ అదిరిపోయే స్టెప్పులు తోడైతే.. ఇక చెప్పేదేముంది? బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా కోసం మైసూర్‍లో వెయ్యి మంది డ్యాన్సర్లతో కథానాయకుడి పరిచయ గీతాన్ని తెరకెక్కించారు. వినాయక చవితి నాడు ప్రారంభమైన ఈ గీత చిత్రీకరణ దృశ్యాలను చిత్ర బృందం విడుదల చేసింది. ‘రెహమాన్ డప్పు.. రామ్‍చరణ్ స్టెప్పు’ అదిరిపోతాయంటూ బుచ్చిబాబు ఓ పోస్ట్ విడుదల చేశారు. జానీ నృత్య దర్శకత్వంలో ఈ పాటను తెరకెక్కించారు. కన్నడ అగ్రనటుడు శివరాజ్‍కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్‍చరణ్ సరసన కథానాయికగా చేస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఆర్.రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. క్రీడా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‍టైనర్‍గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‍చరణ్ క్రీడాకారుడిగా నటిస్తున్నారు.























































































































































































































































Review మైసూర్‍లో ‘పెద్ది’ పండుగ.