‘పేట్రియాట్’ పేరుతో చేతులు కలిపారు మలయాళ అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‌లాల్. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. మహేశ్ నారాయణన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది చిత్ర బృందం. దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దినట్టు టీజర్‌తో స్పష్టమవుతోంది. ‘ఒకానొక సమయంలో వాళ్లిద్దరూ దేశాన్ని కంట్రోల్ చేసేవారని నాకు మా నాన్న చెప్పడం ఇంకా గుర్తుంది. ఏళ్లు గడిచే కొద్దీ వాళ్లు అభిమానులను మాత్రమే కాదు.. వారి నమ్మకాలను గెలుచుకున్నారు’ అని టీజర్లో ఓ యువకుడు చెప్పడం ఆసక్తి రేపుతోంది. ‘మళ్లీ వాళ్లిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా.. బ్లాస్ట్’ లాంటి సంభాషణలతో ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి కనిపిస్తూ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నయనతార, ఫహాద్ ఫాజిల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా, ఇటీవలే మోహన్‌లాల్‌కు భారత ప్రభుత్వం సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసిన విషయం తెలిసిందే.






















































































































































































































































Review వాళ్లిద్దరూ కలిస్తే.. బ్లాస్ట్.