మిస్ మ్యాచ్

‘‘ఇద్దరు గొడవ పడితే ఎవరో ఒక్కరే గెలుస్తారు. అదే ఇద్దరూ రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు’’
ఇది కథానాయకుడి సిద్ధాంతం.
‘‘బరిలోకి దిగితే చావోరేవో తేల్చుకోవడమే..’’ ఇదీ కథానాయిక మనస్తత్వం.
ఇలా రెండు భిన్న మనస్తత్వాల మధ్య చిగురించిన ప్రేమ.. దరిమిలా తలెత్తిన కుటుంబ సమస్యలతో కూడిన ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమే ‘మిస్‍ మ్యాచ్‍’. డిసెంబరు 6న విడుద•లైన ఈ చిత్రం తొలి ఆ

హీరో హీరోయిన్ల పాత్రలు నేటి యువతకు ప్రతీకగా నిలుస్తాయని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.
భిన్న నేపథ్యాలు, భిన్న మనస్తత్వాలు గల ఆ ఇద్దరి కథ చివరికి ఏమైందన్నది సినిమా మొదటి నుంచి ఉత్కంఠ కలిగించేలా దర్శకుడు తెరకెక్కిం చారని ప్రేక్షకులు అంటున్నారు.
తొలి సినిమా ‘ఆటగదరా శివ’తో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న వర్థమాన నటుడు ఉదయ్‍శంకర్‍ నటించిన రెండో సినిమా ఇది. తొలి సినిమాతో పోలిస్తే.. ‘మిస్‍మ్యాచ్‍’లో అతని నటనలో మరింత పరిణితి కనిపించిందని, భావోద్వేగాలను బాగా పండించాడని అభి మానులు, సినీ ప్రముఖులు కాంప్లిమెంట్లు ఇస్తు న్నారు. అతని సరసన ఈ సినిమాలో హీరోయిన్‍గా నటించిన ఐశ్వర్య రాజేశ్‍.. బాక్సర్‍గా రక్తి కట్టిం చింది.
ఇక, పవన్‍కల్యాణ్‍ ‘తొలిప్రేమ’లోని ‘ఈ మనసే..’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ పాట వచ్చిన సందర్భంలో అభి మానులు, ప్రేక్షకులు థియేటర్లలో కేరింతలు కొడు తున్నారు.
‘‘నీకు గొడవ పడటం కూడా తెలుసా..?’’
‘ఏదైనా, ఎన్నయినా గుర్తుంటాయి.. ఒక్కసారి చూస్తే చాలు.. అదీ వాడి పవర్‍’’
‘‘ఆటకి, గొడవకి తేడా తెలియని మనుషులు. ఎంత చదువుకుంటే మాత్రం ఏంటి లాభం?’’
‘‘నీ లైఫ్‍లో చివరి వరకు ఉండేది కుస్తీ మాత్రమే.. సిద్ధూ ఉండడు’’
‘‘ఈ దంగల్‍ బ్యాచ్‍కి, మన పొంగల్‍ బ్యాచ్‍కి ఏమైనా సెట్‍ అవుతుందేంట్రా..’’
సినిమాలో వచ్చే ఈ డైలాగ్స్కు ప్రేక్షకులు ఈలలు వేస్తున్నారు.
హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను యూత్‍ బాగా ఎంజాయ్‍ చేస్తోంది. అలాగే కుటుంబ నేపథ్య సన్నివేశాలు, పాత్రల భావో ద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయని సినిమాకు వస్తున్న రిపోర్టులను బట్టి తెలుస్తోంది.
కుస్తీ క్రీడాకారిణిగా ఐశ్వర్య రాజేశ్‍ మంచి నటన కనబర్చింది. ఉదయ్‍శంకర్‍ ఈ సినిమాలో సిద్ధూ పాత్రలో కనిపించి.. అభిమానులను అలరించాడు. తమిళ దర్శకుడు ఎన్‍వీ నిర్మల్‍కుమార్‍ తెలుగులో తొలి సినిమాతోనే మంచి హిట్‍ అందుకున్నారు.
భూపతిరాజు చాలా రోజుల తరువాత నేరుగా ఓ తెలుగు చిత్రానికి అందించిన కథ చిత్ర యూనిట్‍ ప్రయత్నంతో విజయవంత మైందని నిర్మాతలు జి.శ్రీరామ్‍రాజు, భరత్‍రామ్‍ అన్నారు.
ముఖ్యంగా ఉదయ్‍, ఐశ్వర్య మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. భూపతిరాజా కథ చిత్రానికి ప్రధానం బలంగా నిలిచింది. చక్కని ప్రేమకథతో పాటు కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి’ అని రిపోర్టస్ వస్తున్నట్టు చిత్ర బృందం ఆనందాన్ని పంచుకుంటోంది.
‘మంచి కథ, కథనాలు ఉన్న చిత్రమిది. కథ విన్నప్పుడే సక్సెస్‍ను ఊహించా. తప్పకుండా ప్రేక్ష కుల మనసుల్ని గెలుస్తుందని నమ్మా. సినిమా రిలీజయ్యాక అది నిజమేనని ప్రేక్షకులు నిరూ పించారు’ అని ఆనందం వ్యక్తం చేశారు వర్ధమాన హీరో ఉదయ్‍శంకర్‍.
సినిమా చూసిన పలువురు ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు సురేందర్‍రెడ్డి మాట్లాడుతూ ‘టైటిల్‍తోనే ఈ సినిమా సగం సక్సెస్‍ను సొంతం చేసుకుంది. మిగతా సగం సినిమా రిలీజయ్యాక సొంతం చేసుకుంది’ అని చిత్ర బృందాన్ని అభినందించారు.

Review మిస్ మ్యాచ్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top