డిస్కోరాజా: జనవరి 24, 2020
సంక్రాంతి సందడి ఇలా ఉంటే.. సంక్రాంతి తరువాత బరిలో దిగుతున్నాడు. ‘మాస్ మహారాజా’ రవితేజ. ‘డిస్కో రాజా’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సైన్స్ అండ్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్తో రూపొందిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’గా అలరించిన రవితేజ, మళ్లీ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన సరసన పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తుండగా, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ సింహా ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఆనంద్ ఈ చిత్ర దర్శకుడు. మాస్ పల్స్ తెలిసిన నటుడిగా పేరున్న రవితేజ ఈ చిత్రంపై ఫ్యాన్స్కు భారీ అంచనాలే ఉన్నాయి.
శర్వానంద్-సమంత: జనవరి 26, 2020
శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కుతోన్న చిత్రం జనవరి 26న విడుదల కానున్నట్టు సమాచారం. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం తమిళంలో సూపర్డూపర్ హిట్టయిన ‘96’ సినిమాకు రీమేక్. ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. సి.ప్రేమ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అశ్వథ్థామ: జనవరి 26, 2020
నాగశౌర్య హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది ‘అశ్వథ్థామ’. రమణతేజ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా మెహరీన్ అలరించనుంది.
ఫైటర్: జనవరి 24, 2020
విజయ్ దేవరకొండ ‘ఫైటర్’గా సవాల్ విసురుతున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడంతో పాటు నటి చార్మితో కలిసి నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నారు. తెలుగు తెరపై కొత్త వేవ్ సృష్టించిన విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఫైటర్పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికితోడు దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఇంతకుమునుపు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్హిట్ కావడంతో ‘ఫైటర్’ సైతం అంచనాలను పెంచుతోంది.
నిశ్శబ్దం: జనవరి 31, 2020
అగ్రతార అనుష్క ఏ సినిమాలో ఏ పాత్ర వేసినా సంచలనమే. అరుంధతి, బాహుబలి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ఈ నటి మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న హర్రర్ మూవీ నిశ్శబ్దంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు, ఇందులో ఆమె మూగ పాత్రలో కనిపించ నుందని ఫిల్మ్నగర్ టాక్. ఇంకా ప్రధాన పాత్రల్లో మాధవన్, మైఖేల్ మాడ్సన్, అంజలి, శాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Review సంక్రాంతి తరువాతా సందడే.