ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో జరిగే ఉగాది ఆస్థానం గురించి తెలుగుపత్రిక 2026, మార్చి సంచిక ముఖచిత్ర కథనాన్ని చదివిన తరువాతే తెలుసుకున్నాం. శ్రీనివాసుడు తన సన్నిధిలో జరుపుకునే ఈ సంవత్సరాది పర్వపు ఆచారాలను, విశేషాలను ఎంతో బాగా కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆ వేడుకను కనులారా తిలకించే భాగ్యం లేకపోయినా.. ఆ వేడుక జరిగే విధానాన్ని నేత్రపర్వం చేస్తూ మంచి కథనాన్ని అందించారు.
-వెంకటరమణ-హైదరాబాద్, కిశోర్‍కుమార్- విశాఖపట్నం, సి.కవిత, ఫణికుమార్, టి.ప్రభాకర్, కిరణ్‍చంద్ర, ఆర్.రాజేశ్వరరావు
మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
గర్భ నవరాతుల్రు
వసంత నవరాత్రులనే గర్భనవరాత్రులని కూడా అంటారనే విషయాన్ని ధర్మసందేహం శీర్షిక చదివిన తరువాతే తెలిసింది. ఇంకా ఈ శీర్షికన అందిస్తున్న విశేషాలు చాలా బాగుంటున్నాయి. తెలియని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతున్నాం.
– వెంకటకృష్ణ- విజయవాడ, నీలేంద్రకుమార్- రాజమండ్రి
తిథి పత్య్రేకం
మార్చి సంచికలో నెలలో వచ్చే 16 తిథులు.. వాటి ప్రత్యేకతల గురించి బాగా విశ్లేషించారు. ఏ తిథి ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకున్నాం.
– రాజశేఖర్-హైదరాబాద్
















































































Review ఉత్తరాయణం.