ఉత్తరాయణ

చెప్పలేనంత సంతోషం కలిగింది... ఎడిటర్‍ గారికి నమస్తే.. నా పేరు యోగితా సరస్వతి. మేము అట్లాంటాలో ఉంటాము. ఈ నెల ఇండియన్గ్రోసరీ స్టోర్‍ లో మీ(మన తెలుగు) పత్రికను మొదటి సారి చూసేసరికి చెప్పలేనంత సంతోషం కలిగింది. చాలా మంచి విషయాలు ప్రచురిస్తున్నారు. అందులో శ్రీరాం గారి అసమానతలో సమానత్వం శీర్షిక చాలా నచ్చింది. అద •ష్టవశాత్తు మేము చెన్నైలో ఉన్నప్పుడు స్వామీజీ ఆశ్రమంలో దేవాలయంకి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్వామీజీ దర్శనం కలిగింది.

ఉత్తరాయణం

ఇంకా చాలా కావాలి. ‘తెలుగు పత్రిక’లో చాలా వివరాలు అందిస్తున్నారు. సంతోషం. అయితే, ఇంకా చాలా కావాలని అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా ప్రముఖ పర్యాటక ప్రాంతం, ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రం, మానసిక వికాసం కలిగించే శీర్షికలను కూడా ప్రవేశపెట్టండి. పాఠకుల యాత్రానుభవాలకు చోటివ్వండి. కథలు కూడా ఉంటే మంచిది. పురాణేతిహాస కథలు, ఇతరత్రా ఆధ్యాత్మిక సమాచారానికి, భాషా సంబంధమైన అంశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే విశేషాలు అందించండి. - రామకృష్ణ.కె., ఆస్టిన్‍, అమెరికా

ఉత్తరాయణ

తెలుగుకు అంతర్జాతీయ ఖ్యాతి వేగంగా కనుమరుగైపోతున్న భాషల్లో మన తెలుగు ఒకటి. దీనిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ, ఎలా? మన తెలుగు వారందరిలోనూ మాతృభాష క్షీణదశలో ఉందనే బాధ ఉంది. ఆవేదన ఉంది. కానీ, ఈ పోటీ ప్రపంచంలో, బతుకు పోరాటంలో పడి ఎవరికి వారే ఏమీ చేయలేని, కనీస సమయం కేటాయించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో బృహత్తర, గురుతర బాధ్యతను భుజాన వేసుకుంది ‘తెలుగు పత్రిక’. ఇది

Top