ఉత్తరాయణ

ఆధ్యాత్మిక వల్లరి తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో అందించిన శివరాత్రి మహోత్సవం, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, మేడారం మహా జాతరల గురించిన వివరాలు బాగున్నాయి. సమయానుగుణంగా ఆయా పర్వాలు, వేడుకల గురించి వివరిస్తున్న తీరు బాగుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారికి ఈ వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. -సీహెచ్‍.రవికిరణ్‍- న్యూయార్క్, ఆన్‍లైన్‍ పాఠకుడు, ఆర్‍కే ప్రత్యూష- హైదరాబాద్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు వికాస తరంగిణి ‘తెలుగు పత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక సంచికలో

ఉత్తరాయణ

సం‘క్రాంతులు’.. తెలుగు పత్రికలో జనవరి సంచికలో ఇచ్చిన సంక్రాంతి పండుగ విశేషాలు చదివించాయి. తెలుగు నాట ఏ తిథీ లేకుండా వచ్చే పండుగ ఇదేనన్న విషయం ఈ పత్రికలో చదివిన తరువాతే తెలిసింది. తెలియని విషయాలను తెలియ చెబుతూ మన ప్రాచీన ఆచార సంప్రదాయాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ‘తెలుగు పత్రిక’కు అభినందనలు. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని కావాలి. సంక్రాంతికి సంబంధించిన మొత్తం ఆసాంతం చదివాం. చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఇచ్చిన

ఉత్తరాయణ

‘ప్రత్యేకం’ బాగుంది.. మన తెలుగు పత్రిక గత రెండు సంచికల నుంచి ఇస్తున్న ‘ప్రత్యేకం’ బాగుంటోంది. బాలల గురించి, తెలుగింటి వంటల గురించి ఇచ్చిన ప్రత్యేక ఇష్యూస్‍ మళ్లీ మళ్లీ చదివించాయి. ప్రతి సంచిక భద్రపరుచుకునేలా మెటీరియల్‍ అందిస్తున్నారు. నిజంగా ఇటువంటి ప్రయత్నం అభినంద నీయం. ముఖ్యంగా నేటితరం పిల్లలకు, విదేశాల్లో ఉండే తెలుగు సంతతికి ఉపయోగపడే రీతిలో, ప్రయోజనం కలిగించే రీతిలో అందించిన తెలుగు వర్ణమాల, ఇతర వివరాలు నిజంగా

ఉత్తరాయణం

విధ్వంసానికి అడ్డుకట్ట వేద్దాం! మన కళ్లెదుటే.. మనకు తెలియకుండానే అతి పెద్ద విధ్వంసం చోటుచేసుకుంటోంది. అయినా, మనం చూసీ చూడనట్టు వదిలేస్తున్నాం. ఆ విధ్వంసం పేరు- తెలుగు భాష, సంస్క•తి, సంప్రదాయాల విధ్వంసం. ఇవి నాశనమైపోయాయంటే, మనం ఉండీ తెలుగు వారమని చెప్పుకోవడం వృథా ప్రయాసే. అవి నశించిపోయాయంటే, మనం నిర్జీవులమై బతుకుతున్నట్టు లెక్క. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై

ఉత్తరాయణం

సామెతల వెనుక ఇంత కథా? తెలుగు పత్రికలో అందిస్తున్న వివిధ శీర్షికలు బాగున్నాయి. గత అక్టోబరు సంచికలో ఇచ్చిన సామెత కథ చాలా బాగుంది. ‘నందుడే రాజు కావచ్చేమో’ మళ్లీ మళ్లీ చదివించింది. సామెతలను మన నిత్య వ్యావహారికంలో వాడటమే కాదు, వాటి వెనుక ఎంతో మానసిక వికాసం కూడా దాగి ఉందని తెలియ చెప్పిందీ సామెత కథ. ప్రతి మాసం ఇటువంటి విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు అభినందనలు. చిన్న చిన్న

Top