సామెతల వెనుక ఇంత కథా?
తెలుగు పత్రికలో అందిస్తున్న వివిధ శీర్షికలు బాగున్నాయి. గత అక్టోబరు సంచికలో ఇచ్చిన సామెత కథ చాలా బాగుంది. ‘నందుడే రాజు కావచ్చేమో’ మళ్లీ మళ్లీ చదివించింది. సామెతలను మన నిత్య వ్యావహారికంలో వాడటమే కాదు, వాటి వెనుక ఎంతో మానసిక వికాసం కూడా దాగి ఉందని తెలియ చెప్పిందీ సామెత కథ. ప్రతి మాసం ఇటువంటి విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు అభినందనలు. చిన్న చిన్న పదాల్లో, సామెతల్లో ఇంతటి మానవ స్వభావాన్ని ఇమిడ్చి విడమరిచి వివరించడం బాగుంది.
-ఎన్.నరేశ్- హైదరాబాద్, సత్యవతి.ఎస్., కారుణ్య,
కమల్, విశేష్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
విశిష్ట శీర్షికలు
‘తెలుగుపత్రిక’ విశిష్ట శీర్షికలతో అలరిస్తోంది. ప్రతి శీర్షిక చదివిస్తోంది. భాష, సంస్క•తి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశేషాలపై మరిన్ని విశేషాలు అందించడానికి ప్రయత్నించండి. ఇప్పటికే ఇస్తున్నారు. మరిన్ని శీర్షికలు ఈ అంశాలపై పెంచితే బాగుంటుందేమోనని మనవి. విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వారు తప్పక కొని చదవాల్సిన పత్రిక ఇది. మాతృభూమి గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారికి గుర్తు చేస్తున్న పత్రిక యాజమాన్యానికి అభినందనలు. సామెతలు, నానుడిలు, పిల్లల పాటలు వంటివి హైలైట్‍గా నిలుస్తున్నాయి. మరిన్ని మంచి శీర్షికలు అందించే ప్రయత్నం చేయండి. అలాగే, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విశేషాలు ఉన్నాయి. వాటన్నిటినీ దశల వారీగా అందించండి.
– కె.రాజేశ్వరరావు- వరంగల్, పి.నందిని- హైదరాబాద్, సతీష్, చరణ్, పి.బాబూరావు, మిత్ర.ఎన్- టెక్సాస్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
ఆధ్యాత్మిక వికాసం
ఆధ్యాత్మికతకు కొత్త అర్థం చెబుతూ ఆధ్యాత్మిక వికాసం శీర్షికన అందిస్తున్న మానసిక వికాస కథనం బాగుంటోంది. ఈ శీర్షిక వికాసం ద్వారా ఎన్నో మంచి విషయాలను సరళంగా తెలియ చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే, చిన్నపిల్లల కథల్లోనూ పెద్దలు నేర్చుకోదగిన నీతి ఉంటోంది.
-వెంకట సత్యప్రసాద్, పి,చైతన్య, ఆర్.నగేష్, జి.రాజు మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
మాసం.. విశేషం
మాసం- విశేషం శీర్షికలో ప్రతి నెలా వచ్చే ముఖ్య పుణ్య తిథులు, ఆ రోజుల్లో ఆచరించే సంప్రదాయాల గురించి వివరిస్తున్న తీరు అద్భుతం. ఒక నెలలో వచ్చే తిథులను, ఆ తిథులతో కూడిన పర్వాలను, ఆ పర్వదినాల్లో ఆచరించే పక్రియల గురించి ఈ రోజుల్లో ఇంత విపులంగా వివరించే పత్రిక మరొకటి లేదు. ఈ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నం బాగుంది. ఇదే విధంగా మునుముందు కూడా అందించండి. ఇంకా సామెత కథ, నానుడి, తెలుసుకొందాం, పూజాఫలం వంటి శీర్షికలు బాగుంటున్నాయి. భాషా వికాసానికి సంబంధించిన విశేషాలు కూడా చదివిస్తున్నాయి.
– ఆర్.ప్రశాంత్, విజయవాడ, నళిని.హెచ్.- టెక్సాస్
Review ఉత్తరాయణం.