ఉత్తరాయణ

శ్రావణ విశేషాలు ఆగస్టులో వచ్చే వివిధ పండుగలు, పర్వాల గురించి, శ్రావణ మాస విశేషాలతో వెలువడిన తెలుగు పత్రిక ఎంతో బాగుంది. తిథులతో సహా ఆయా రోజుల ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను వివరించడం మంచి ప్రయత్నం. పరోక్షంగా ఆ తిథి నాడు ఆచరించాల్సిన విధులను కూడా చెప్పడం విశేషం. ఈ కాలంలో ఈ విశేషాలు, వివరాలు ఎవరికీ తెలియవు. నేటి తరానికి ఆయా తిథుల, పండుగల, పర్వాల విశేషాలను, వాటి వెనుక ఉన్న

ఉత్తరాయణ

భలేగా రా‘సినారె’... కవి, జ్ఞానపీఠ్‍ అవార్డు గ్రహీత డాక్టర్‍ సి.నారాయణరెడ్డి గారి గురించి చాలా మంచి విషయాలు తెలియ చెప్పారు. ‘రాజు మరణిస్తే విగ్రహాలు పెడతారు. కానీ, కవి పరమపదిస్తే అతను జనం నాలుకలపైనే ఉంటాడు’ అనే నానుడి సినారె విషయంలో నూటికి నూరుపాళ్లు అక్షర సత్యం. ఆయన తెలుగు వారు గర్వించదగిన సాహితీద్రష్ట. అత్యంత జనాదరణ పొందిన ఆయా సినిమా పాటలు.. ఆయన రాసినవే అని తెలిసి ఆశ్చర్యం కలిగింది.

ఉత్తరాయణ

సామెతల వెనుక ఇంత కథా? నిత్య జీవితంలో మనం ఎన్నో సామెతలను, పద ప్రయోగాలను వాడేస్తుంటాం. ఏదో ఆ సందర్భానికి వాటిని వాడేయడమే కానీ, నిజంగా వాటి వెనుక ఎంత విషయం ఉంది? అవెలా పుట్టాయి? అనే వివరాలు తెలుసుకుంటుంటే భలే ఆసక్తిగా అనిపిస్తోంది. ప్రతి నెలా ‘తెలుగు పత్రిక’లో అందిస్తున్న ‘సామెత కథ’ చాలా చాలా బాగుంటోంది. ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను, విషయాలను మరిన్ని అందించాలని కోరుకుంటూ.. తెలుగు పత్రికకు

ఉత్తరాయణ

చెప్పలేనంత సంతోషం కలిగింది... ఎడిటర్‍ గారికి నమస్తే.. నా పేరు యోగితా సరస్వతి. మేము అట్లాంటాలో ఉంటాము. ఈ నెల ఇండియన్గ్రోసరీ స్టోర్‍ లో మీ(మన తెలుగు) పత్రికను మొదటి సారి చూసేసరికి చెప్పలేనంత సంతోషం కలిగింది. చాలా మంచి విషయాలు ప్రచురిస్తున్నారు. అందులో శ్రీరాం గారి అసమానతలో సమానత్వం శీర్షిక చాలా నచ్చింది. అద •ష్టవశాత్తు మేము చెన్నైలో ఉన్నప్పుడు స్వామీజీ ఆశ్రమంలో దేవాలయంకి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్వామీజీ దర్శనం కలిగింది.

ఉత్తరాయణం

ఇంకా చాలా కావాలి. ‘తెలుగు పత్రిక’లో చాలా వివరాలు అందిస్తున్నారు. సంతోషం. అయితే, ఇంకా చాలా కావాలని అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా ప్రముఖ పర్యాటక ప్రాంతం, ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రం, మానసిక వికాసం కలిగించే శీర్షికలను కూడా ప్రవేశపెట్టండి. పాఠకుల యాత్రానుభవాలకు చోటివ్వండి. కథలు కూడా ఉంటే మంచిది. పురాణేతిహాస కథలు, ఇతరత్రా ఆధ్యాత్మిక సమాచారానికి, భాషా సంబంధమైన అంశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే విశేషాలు అందించండి. - రామకృష్ణ.కె., ఆస్టిన్‍, అమెరికా

Top