ఉత్తరాయణం

క్రేగ్‍కు నివాళి విదేశీగడ్డపై పుట్టి.. భారతీయ సంస్క•తీ సంప్రదాయాలను గౌరవించి, వాటిని తన గడ్డపై లోకానికి ఎలుగెత్తి చాటిన క్రెగ్‍ దంపతులు ఎంతైనా అభినందనీయులు. తన అలుపెరగని ఆధ్యాత్మిక సాధనలో, సత్యాన్వేషణలో క్రెగ్‍ తుది శ్వాస విడిచారని తెలిసి గుండెలు బరువెక్కాయి. ఆయన ఆస్టిన్‍లో నిర్మించిన షిర్డీ సాయి మందిరం, బాలాజీ ఆలయం ఈ భువిలో వెల సిన అద్భుతాలు. వాటిని చూస్తే క్రెగ్‍ రూపం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎంతో సేవాతత్ప

ఉత్తరాయణం

నవ్వుల పువ్వులు తెలుగు పత్రిక మే మాసం సంచిక విశేషంగా చదివించింది. ముఖ్యంగా నవ్వుల దినోత్సవం గురించి అందించిన ముఖపత్ర కథనం చాలా బాగుంది. నవ్వు అనేది నేడు మనుషుల ముఖాల నుంచి ఎలా మాయమైపోతోందో, దాన్ని పొదివి పట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి బాగా వివరించారు. నవ్వుల దినోత్సవానికి భారతీయుడే ఆద్యుడని తెలిసి ఆనందం అనిపించింది. అలాగే, మాసం - విశేషం ఇతర శీర్షికలు బాగుంటు న్నాయి. - సర్వేశ్‍, వర్మ,

ఉత్తరాయణం

తెలుగు వికాసం విదేశాల్లో ఉన్న తెలుగు వారి కోసం తెలుగు పత్రిక వివిధ శీర్షికల ద్వారా చేస్తున్న ప్రయత్నం బాగుంది. విదేశాల్లో ఉన్న వారిలో తెలుగు వికాసానికి ఆయా శీర్షికలు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను విపులంగా అందిస్తున్నారు. ఇది అందరూ చదవదగిన పత్రిక. మరిన్ని, మరింత విలువైన సమాచారాన్ని అందిస్తూ అందరి మనసులు చూరగొనాలని కోరుకుంటున్నాం. -రవికిరణ్, కిషోర్, రాంప్రసాద్- హైదరాబాద్,

ఉత్తరాయణ

ఉగాది విశేషాలు తెలుగు పత్రిక మార్చి సంచికలో అందించిన సంవత్సరాది విశేషాలు, ఈ పర్వం వెనుక ఉన్న నేపథ్యం గురించి విపులంగా వివరించారు. ఉగాది నాడు ఆచరించాల్సిన విధుల గురించి అందించిన విశేషాలు చాలా బాగున్నాయి. నిజంగా ఈ రోజుల్లో ఇంతటి సమాచారం మరే పత్రికలోనూ ఇంత వివరంగా అందుబాటులో లేదంటే అతిశయోక్తి కాదు. ఆయా పండుగలు, పర్వాల గురించి ఇస్తున్న ఇటువంటి సమాచారం అభినందనీయం. - విశేష్‍.కె.- అట్లాంటా,

ఉత్తరాయణ

ఆధ్యాత్మిక వల్లరి తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో అందించిన శివరాత్రి మహోత్సవం, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, మేడారం మహా జాతరల గురించిన వివరాలు బాగున్నాయి. సమయానుగుణంగా ఆయా పర్వాలు, వేడుకల గురించి వివరిస్తున్న తీరు బాగుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారికి ఈ వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. -సీహెచ్‍.రవికిరణ్‍- న్యూయార్క్, ఆన్‍లైన్‍ పాఠకుడు, ఆర్‍కే ప్రత్యూష- హైదరాబాద్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు వికాస తరంగిణి ‘తెలుగు పత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక సంచికలో

Top