ఉత్తరాయణం

శావణ మాస విశేషాలు శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వ్రత విశేషాలతో వచ్చిన ఆగస్టు మాసపు ‘తెలుగు పత్రిక’ ఎంతగానో అలరించింది. నేడు వస్తున్న పత్రికలలో మన తెలుగు సంస్క•తీ సంప్రదాయాల గురించి ఇంత విపులంగా వివరణలు, విశ్లేషణలతో వస్తున్న పత్రిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి పత్రికను పదిలంగా భద్రపరుచుకోవాలన్నంతగా విషయం ఉంటోంది. ఇంకా మన సంప్రదాయాలు, ఆచారాల గురించి తగినంతగా సమాచారం అందిం చండి. ఇది

ఉత్తరాయణం

తిరుమల సమాచారం.. మన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు వేంచేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ‘తెలుగు పత్రిక’లో రెగ్యులర్‍గా కొంత సమాచారం ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దేశం కాని దేశంలో ఉన్న వారంతా దాదాపు ఆ శ్రీనివాసుని భక్తులే. వారంతా ఆ స్వామి వారి విశేషాల గురించి తెలుసు కోవాలని అనుకోవడం సహజం. కాబట్టి స్వామికి సంబంధించి ఏయే ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? స్వచ్ఛంద సేవలు అందించేందుకు

ఉత్తరాయణం

క్రేగ్‍కు నివాళి విదేశీగడ్డపై పుట్టి.. భారతీయ సంస్క•తీ సంప్రదాయాలను గౌరవించి, వాటిని తన గడ్డపై లోకానికి ఎలుగెత్తి చాటిన క్రెగ్‍ దంపతులు ఎంతైనా అభినందనీయులు. తన అలుపెరగని ఆధ్యాత్మిక సాధనలో, సత్యాన్వేషణలో క్రెగ్‍ తుది శ్వాస విడిచారని తెలిసి గుండెలు బరువెక్కాయి. ఆయన ఆస్టిన్‍లో నిర్మించిన షిర్డీ సాయి మందిరం, బాలాజీ ఆలయం ఈ భువిలో వెల సిన అద్భుతాలు. వాటిని చూస్తే క్రెగ్‍ రూపం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎంతో సేవాతత్ప

ఉత్తరాయణం

నవ్వుల పువ్వులు తెలుగు పత్రిక మే మాసం సంచిక విశేషంగా చదివించింది. ముఖ్యంగా నవ్వుల దినోత్సవం గురించి అందించిన ముఖపత్ర కథనం చాలా బాగుంది. నవ్వు అనేది నేడు మనుషుల ముఖాల నుంచి ఎలా మాయమైపోతోందో, దాన్ని పొదివి పట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి బాగా వివరించారు. నవ్వుల దినోత్సవానికి భారతీయుడే ఆద్యుడని తెలిసి ఆనందం అనిపించింది. అలాగే, మాసం - విశేషం ఇతర శీర్షికలు బాగుంటు న్నాయి. - సర్వేశ్‍, వర్మ,

ఉత్తరాయణం

తెలుగు వికాసం విదేశాల్లో ఉన్న తెలుగు వారి కోసం తెలుగు పత్రిక వివిధ శీర్షికల ద్వారా చేస్తున్న ప్రయత్నం బాగుంది. విదేశాల్లో ఉన్న వారిలో తెలుగు వికాసానికి ఆయా శీర్షికలు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను విపులంగా అందిస్తున్నారు. ఇది అందరూ చదవదగిన పత్రిక. మరిన్ని, మరింత విలువైన సమాచారాన్ని అందిస్తూ అందరి మనసులు చూరగొనాలని కోరుకుంటున్నాం. -రవికిరణ్, కిషోర్, రాంప్రసాద్- హైదరాబాద్,

Top