ఉత్తరాయణం

అమ్మవారి పేర్లు
తెలుగు పత్రిక అక్టోబరు సంచికలో దసరా సందర్భంగా సమస్త జగత్తునూ పాలించే శక్తిస్వరూపిణికి గల వివిధ నామాలు, ఆ నామ మహాత్మ్యం గురించి వివరించడం బాగుంది. ఏ రోజు ఏ నామం గల అమ్మవారిని పూజించాలనే వివరాలు చదివించాయి. అమ్మవారిని అలంకరించే ఆయా రూపాల్లోని ప్రత్యేకతల గురించి అందించిన వివరాలు బాగున్నాయి.
– ఆర్‍.కృష్ణప్రసాద్‍, అనిల్‍కుమార్‍, రాజా రవితేజ, టి.వెంకట్‍, పి.శ్రీనివాసరావు, వరప్రసాద్‍, కౌసల్య, నందకుమారి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

మాస విశేషం
తెలుగు మాసపత్రికలో ప్రతి మాసం ‘మాస విశేషం’ ప్రచురించడం ఎంతో ఆనంద దాయకంగా వుంది. ప్రత్యేక మాసాలలో వచ్చే పండుగలు, పబ్బాలు అందరికీ తెలిసినవే కానీ 12 తెలుగు మాసాలలో ఎన్నో ప్రత్యేక రోజులు, చేయదగిన పూజలు గురించి వివరించి.. వీటిని ఆచరించే వారికి ఉపయోగకరంగా వుండేలా ఈ శీర్షికను అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.
– రంగనాథ్‍- హైదరాబాద్‍,
పి.రాజీవ్‍-విశాఖపట్నం

తిరుమల సమాచారం
తెలుగు పత్రికలో ప్రతి నెలా సంక్షిప్తంగానైనా అందిస్తున్న తిరుమల సమాచారం ద్వారా సమకాలీన సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాం.
– రాజ్‍.పి., అట్లాంటా

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top