ఉత్తరాయణం

‘భక్తుల అహంభావాన్ని పోగొట్టి వారికి నా పాదాల
వద్ద ఆశ్రయమిస్తాను. నిరహంకారంతో వ్యవహరించే వారికెప్పుడూ నా సంపూర్ణ సహాయం అందిస్తాను. ఇంటా, బయటా సర్వ విధాలా వారికి తోడుగా నిలుస్తాను’.

– శ్రీ షిర్డీసాయిబాబా

వైకుంఠపాళీ
తెలుగు పత్రిక సెప్టెంబరు 2023 సంచికలో ముఖచిత్ర కథనం కింద అందించిన ‘పరమపద సోపాన ‘పాఠము’ అద్భుతంగా ఉంది. వైకుంఠపాళీగా పిలిచే ఈ ఆటను నేటి తరంలో దాదాపు అందరూ మరిచిపోయారు లేదా ఈ ఆటకు దూరమయ్యారు. పిల్లలు, పెద్దలు అందరినీ అలరించే ఇలాంటి ఆధ్యాత్మిక ఆట గురించి వివరించిన తీరు, పాము, నిచ్చెనలను ఉత్థాన పతనాలతో పోలుస్తూ ఇచ్చిన విశ్లేషణ చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో మేం చదివిన మంచి ఆర్టికల్స్లో ఇదొకటని చెప్పవచ్చు.

– కిరణ్‍కుమార్‍, బాలస్వామి, బి.సురేశ్‍, ఉమాకాంతరావు, ఆర్‍.రాజశేఖర్‍రెడ్డి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

వంటలు బాగున్నాయ్‍
కేరళలో మామిడిపచ్చడి తయారీ విధానం బాగుంది. ఇది మేం కూడా ట్రై చేశాం. అలాగే, ‘ఆహా’రం శీర్షికన అందిస్తున్న వివిధ వంటకాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. మన ప్రాచీన వంటలను మరోసారి అందరికీ గుర్తుచేస్తున్నందుకు అభినందనలు.

– ఆర్‍.లావణ్య, గౌతమి- హైదరాబాద్‍, పి.చంద్రకళ- తిరుపతి, శశి- విజయవాడ

పురాణ పాత్రలు
మన పురాణాల్లోని ఆయా ముఖ్య పాత్రల గురించి వివరిస్తున్న తీరు బాగుంది. అలాగే మహర్షుల చరిత్రలు కూడా చదివిస్తున్నాయి.
– శ్రీకాంత్‍, విజయవాడ

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top