ఉత్తరాయణం

అన్నీ ప్రత్యేకమే..
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ప్రతి సంచిక విశిష్ట శీర్షికలతో అలరిస్తోంది. ప్రతి పేజీ చదివిస్తోంది. ప్రత్యేకించి ఆయా నెలలలో వచ్చే ప్రధాన పండుగలు, వాటి అధి దేవతలు, తిథులు, ఆ తిథి వెనుక ఉన్న విశేషాల గురించి పరిపూర్ణంగా అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. వినాయక చవితి సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం విభిన్నంగా ఉంది. ఈ సంచికే కాదు తెలుగు పత్రిక ప్రతీ సంచికలో ముఖచిత్ర కథనం (కవర్‍స్టోరీ) అద్భుతంగా ఉంటోంది. ఈ టెంపోను ఇలాగే కొనసాగించండి.
– సత్యనారాయణ, హైదరాబాద్‍- రాజారవీంద్ర, విజయవాడ- కె.విశేష్‍, ఆర్‍.రవి, టి.ఆర్‍.సుందర్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

వినాయక విశేషాలు
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక సెప్టెంబరు సంచికలో అందించిన వినాయక చవితి విశేషాలు చదివించాయి. ఆయన 8, 16, 32 నామాలను తెలియ చెప్పడం మంచి ప్రయత్నం. సాధారణంగా వినాయక చవితి అనగానే పూజ ఎలా చేయాలి?, ప్రత కథ వంటి వివరాలను చాలామంది అందిస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా విఘ్నేశ్వరుడి గురించి తెలియని ఎన్నో విషయాలను తెలియ చెప్పేలా ముఖచిత్ర కథనాన్ని అందించారు. అలాగే, వినాయక చవితి నాడు ఆ దైవానికి సమర్పించే పత్రి.. వాటిలోని ఆరోగ్య, ఆయుర్వేద రహస్యాలను ‘ఆరోగ్య భాగ్యం’ శీర్షిక కింద అందించడం బాగుంది. ప్రతి సంచికనూ ఇదే మాదిరిగా పరిపూర్ణంగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ…
– రెడ్డి రవీందర్‍- కర్నూలు, జ్ఞాన ప్రసూన, పార్వతీకుమారి, పి.భ్రమరాంబ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

సామెతలు.. జాతీయాలు
‘తెలుగుపత్రిక’లో అందిస్తున్న సామెతలు, నానుడి శీర్షికలు చాలా బాగుంటున్నాయి. మరుగున పడిపోతున్న మన తెలుగు సామెతలు, జాతీయాల గురించి, వాటి వెనుక ఉన్న కథను గురించి తెలియచెబుతున్న తీరు బాగుంది. ఇవి ఎంతో విలువైన శీర్షికలు. వీటిని చదివి భద్రపర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ఆధ్యాత్మిక వికాసం, మాసం – విశేషం, ఆరోగ్య భాగ్యం, సూపర్‍ డిష్‍ వంటి శీర్షికలు అటు మన సంప్రదాయాలను తెలియచెబుతూనే మరోపక్క ఆధునిక శైలులనూ అందిస్తున్నాయి. మొత్తానికి ఎన్నో విలువైన శీర్షికలతో వస్తున్న ‘తెలుగు పత్రిక’ ఇంటిల్లిపాదినీ చదివిస్తోంది.
– ఎ.శ్రీనివాసరెడ్డి – టెక్సాస్‍, క్రాంతి.ఆర్‍. – అట్లాంటా, తులసీదాస్‍, హరీశ్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

ధర్మసందేహం
‘ధర్మసందేహం’ శీర్షిక కింద తీరుస్తున్న సందేహాలు బాగుంటున్నాయి. అలాగే, మన ఆచార సంప్రదాయాలను తెలిపే విషయాలను కూడా సందర్భానుసారం అందిస్తే బాగుంటుంది. చిన్న పిల్లల కథలు, ఆధ్యాత్మిక కథ, పిల్లల ఆటపాటలు వంటి శీర్షికలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top