ఉత్తరాయణం

క్రేగ్‍కు నివాళి
విదేశీగడ్డపై పుట్టి.. భారతీయ సంస్క•తీ సంప్రదాయాలను గౌరవించి, వాటిని తన గడ్డపై లోకానికి ఎలుగెత్తి చాటిన క్రెగ్‍ దంపతులు ఎంతైనా అభినందనీయులు. తన అలుపెరగని ఆధ్యాత్మిక సాధనలో, సత్యాన్వేషణలో క్రెగ్‍ తుది శ్వాస విడిచారని తెలిసి గుండెలు బరువెక్కాయి. ఆయన ఆస్టిన్‍లో నిర్మించిన షిర్డీ సాయి మందిరం, బాలాజీ ఆలయం ఈ భువిలో వెల సిన అద్భుతాలు. వాటిని చూస్తే క్రెగ్‍ రూపం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎంతో సేవాతత్ప రత, నిరాడంబరత కలిగిన మంచి మనిషి ఆయన. ఆయనకు నివాళిగా జూన్‍ సంచిక తెలుగుపత్రికలో వచ్చిన ముఖచిత్ర కథనం మనసులను కదిలించింది. అటువంటి మనిషి మనల్ని విడిచి, మన మధ్య లేకపోవడం ఎన్నటికీ తీరని లోటు.
-రాంప్రసాద్‍.కె., వినీత.ఏ., కవితా ఆనంద్‍.పి. మరికొందరు ఆస్టిన్‍వాసులు, రచన, రాజేశ్‍, సందీప్‍- హైదరాబాద్‍, పి.పరమేశ్‍, చిట్టిబాటు, జయేశ్‍- మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

ఆధునిక వంటలు
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక జూన్‍ సంచికలో వంటల గురించిన శీర్షిక బాగుంది. ఆధునిక కాలానికి తగినట్టుగానే సంప్రదాయ వంటలను ఎలా మేళవించి చేసు కోవాలో చక్కగా వివరిస్తున్నారు. ఎవరైనా మాస్టర్‍ చెఫ్‍ చేత వంటలపై ఒక కాలమ్‍ నిర్వ హిస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. అలాగే, కొత్త కొత్త వం•కాలను ఇంట్లోనే ప్రయ త్నించే గృహిణులను కూడా ఈ శీర్షిక కింద పరి చయం చేసినా బాగుంటుంది. దానిని వారెలా తయారు చేశారు? ఏమేం పదార్థాలు వాడారు? అనే వివరాలు వారి చేతే చెప్పించాలి.
-హరినాథ్‍, హైదరాబాద్‍, కేదారేశ్వరి- వరంగల్‍, సాయికృష్ణ- విజయవాడ, రమ్య, పి.పుష్పలత, అనురాధ, కనకతార, మంజుల, నిర్మలారెడ్డి, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు•

వండర్‍ఫుల్‍ శీర్షికలు
‘ఆధ్యాత్మిక వికాసం’, ‘మాసం.. విశేషం’, ‘ఆరోగ్యభాగ్యం’ వంటి శీర్షికలు ఎంతో చది విస్తున్నాయి. ఇంకా నీతి కథలు, సామెత కథలు, జాతీయాల గురించి, తెలుగు సంస్క•తీ సంప్ర దాయాల గురించి ఎంతబాగానో వివరిస్తున్నారు. ఇంకా ప్రతి పేజీలోనూ విలువైన సమాచారమే. ఈ రోజుల్లో ఇటువంటి పత్రికలు అదురనే చెప్పాలి. ఇదే ఐడెంటినీ మునుముందు కూడా కొనసాగించండి. దేశవిదేశాల్లో తెలుగు వారి కీర్తిపతాకకు తెలుగుపత్రిక చిరునామాగా మారాలనేదే మా అందరి ఆకాంక్ష.
-కీర్తి, అజిత్‍, రాంవిలాస్‍- టెక్సాస్‍, ప్రణయ్‍, శ్రీథర్‍బాబు, నాగేశ్వర్‍- హైదరాబాద్‍•

మొదటి పేజీ నుంచి..
తెలుగు పత్రిక అంతర్జాతీయ మాసపత్రిక మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎంతగానో చదివిస్తుంది.. అలరిస్తుంది. పత్రికను ఇంత అద్భు తంగా తీసుకువస్తున్న యాజమాన్యానికి అభినందనలు.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top