ప్రతి సంచిక అపురూపం
తెలుగు పత్రిక ప్రతి మాసం దాచుకోదగిన విలువైన సమాచారంతో అపురూపంగా ప్రచురితమవుతోంది. వెలకట్టలేని తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గురించి, ఆచార వ్యవహారాలను గురించి, భాషా విశేషాల గురించి అత్యద్భుతంగా సమాచారాన్ని అందిస్తున్నారు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే వారసత్వపు ఆస్తి వంటింది. ఈ కాలంలో ఇంతటి విలువైన సమాచారంతో, అదీ తెలుగులో వస్తున్న పత్రికలు లేవనే చెప్పాలి.
– కె.కాశీనాథ్, ఆదిలాబాద్, రామ్.పి- ఎన్‍ఆర్‍ఐ, విశ్వ- టెక్సాస్,
మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
శుభప్రదం
‘తెలుగుపత్రిక’ సెప్టెంబరు సంచిక భాద్రపద మాస విశేషాలతో వచ్చి అలరించింది. మరిచిపోయిన మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అందరికీ గుర్తు చేస్తూ, వాటిని పరిరక్షించుకోవడంలో మనందరి బాధ్యతను తెలుపుతూ తెలుగుపత్రిక మేలుకొలుపు పాడుతోంది. ఇది అందరూ తప్పకుండా చదవాల్సిన పత్రిక. తెలుగు భాషకు సంబంధించిన విశేషాలు, సామెతలు, నానుడి వంటి వాటి గురించి తెలియ చెప్పే వారు ఈ కాలంలో ఎవరూ లేరు. అసలు వాటి గురించి తెలిసిన వారు ఈ రోజుల్లో లేరంటే సబబుగా ఉంటుందేమో. అటువంటి మహత్తర పద, భాషా సంపదను చక్కగా ఏర్చికూర్చి అందిస్తున్న తెలుగు పత్రిక యాజమాన్యానికి అభినందనలు.
– రాజీవ్- హైదరాబాద్, ఓంప్రకాశ్, సాత్విక్, కిరణ్, పి.రాజేష్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
చిట్టిపొట్టి కథల్లో అనంతమైన నీతి
నసీరుద్దీన్, మర్యాదరామన్న వంటి చిన్న చిన్న కథల్లో ఎంతో నీతి దాగి ఉంది. వేల ఏళ్ల క్రితమే మన పెద్దల సంఘ జీవనానికి, సామాజిక నైతిక ప్రవర్తనకు ఈ కథలు నిలువుటద్దంగా నిలుస్తాయి. అటువంటి కథలను ఈ తరం జనరేషన్‍కు తెలియ చెప్పాలనే తెలుగు పత్రిక ఆలోచన, ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఇంకా, పిల్లల పొడుపు కథలు, ఆటపాటల పాటలు బాగుంటున్నాయి. ఆధ్యాత్మిక వికాసం ద్వారా ఎంతో సరళంగా నీతిని బోధించే ప్రయత్నం జరుగుతోంది. మరిన్ని విభిన్నమైన శీర్షికలను ప్రవేశపెట్టి అందించడానికి ప్రయత్నించండి.
– రాజిరెడ్డి- హైదరాబాద్, కె.నిత్యానంద్- అట్లాంటా,
వసంత్.కె.- కాలిఫోర్నియా, రఘు, సత్యనారాయణ.ఎస్.,
రామశంకర్, వెంకట్ సోమదేవర, రాజ్‍వంశీ,
ఇంకొందరు ఆన్‍లైన్ పాఠకులు
Review ఉత్తరాయణం.