ఉత్తరాయణం

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ప్రతి సంచిక కొని చదవడమే కాదు.. ప్రతి సంచికను భద్రపరుచుకోవాలనే విధంగా విభిన్నమైన శీర్షికలు, విశిష్టమైన వ్యాసాలతో ప్రతి నెలా తీర్చిదిద్దుతున్నారు. ‘తెలుగు పత్రిక’ చదవడం ద్వారా మరుగున పడి పోతున్న ఎన్నో విషయాలను, మన తెలుగు సంస్క•తీ సంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను, ముఖ్యంగా మన పండుగల యొక్క పరమార్థాన్ని విపులంగా తెలుసుకోగలుగుతున్నాం. ఈ ఒరవడిని ఇకముందు కూడా ఇలాగే కొనసాగించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
– వెంకట నారాయణ, సీహెచ్‍.వెంకటేశ్‍, మహేం దర్‍, హైదరాబాద్‍- కల్పన.పి., రమేశ్‍చంద్ర, ఆర్‍.రామిరెడ్డి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

అమ్మ వార్ల ప్రత్యేకం

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక అక్టోబరు సంచికలో అందించిన దసరా విశేషాలు చదివించాయి. ఆదిశక్తి ఆరాధనకు ఆశ్వయుజ మాసం ఎలా ఆలంబన అయ్యిందో చక్కగా వివరించారు. అలాగే ఈ మాసంలో పాటించాల్సిన ఆరోగ్య నియమాల గురించి ఇవ్వడం బాగుంది. ముఖ్యంగా దసరా విశేషాలు, పండుగ నేపథ్యం చదివించాయి. అలాగే, గోరింటాకు అలంకరణ, అందులో దాగి ఉన్న ఆయుర్వేద రహస్యాల గురించి వివరించిన తీరు బాగుంది. ప్రతి సంచికను ఆ మాసపు పండుగ, పర్వదినాల ప్రత్యేకంగా, విశేషమైన విశ్లేషణలతో తీసుకురావడం మంచి ప్రయత్నం. ప్రత్యేకించి ‘మాసం – విశేషం’ శీర్షిక మొత్తం పత్రికకే హైలైట్‍ అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
– మందడి వెంకటేశ్వర్లు, పి.ఫణికుమార్‍, అంజిబాబు- హైదరాబాద్‍, ప్రశాంత్‍కుమార్‍, రాజీవ్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

మొదటి పేజీ నుంచి..

‘తెలుగుపత్రిక’ సంపాదకీయం దగ్గరి నుంచి చివరి పేజీ వరకు ప్రతి పేజీ, ప్రతి శీర్షిక ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తోంది. సామెతలు, జాతీయాలు, ఆధ్యాత్మిక వికాసం, చిన్నపిల్లల కథలు, చిన్నపిల్లల ఆటపాటలు, కొత్త వంటకాలు, ఆరోగ్య భాగ్యం, ఆధ్యాత్మిక కథ, తెలుగు వెలుగులు వంటి ఇతర శీర్షికలు ఎంతో బాగుంటున్నాయి. ‘మాసం – విశేషం’ శీర్షిక కింద ఆ నెలలో వచ్చే ప్రతి పండుగ, పర్వం, దాని వెనుక ఉన్న విశేషాలు ఎంతో తెలుసుకోదగినవి. ప్రతి తెలుగు వారు తప్పనిసరిగా చదవవలసిన పత్రిక ఇది.
– అరుణ్‍కుమార్‍- విజయవాడ, రవికిరణ్‍, మంజుల- హైదరాబాద్‍

వ్రత కథలు

‘వ్రతకథలు’ శీర్షిక కింద అందిస్తున్న వివిధ వ్రత విధానాలు, నోములు నోచాల్సిన విధానం గురించిన వివరాలు బాగుంటున్నాయి. వీటిలో చాలా వరకు మన తెలుగు వారు మరిచిపోయారనడంలో సందేహం లేదు. మన ఆచారాలను, సంస్క•తీ సంప్రదాయాలను పది కాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ఆయా వ్రతాలు, నోములను, పూజా విధానాలను ఆచరించాల్సిందే. ఈ విషయంలో తెలుగు పత్రిక విశేషమైన.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top