ఉత్తరాయణ

శ్రావణ విశేషాలు
ఆగస్టులో వచ్చే వివిధ పండుగలు, పర్వాల గురించి, శ్రావణ మాస విశేషాలతో వెలువడిన తెలుగు పత్రిక ఎంతో బాగుంది. తిథులతో సహా ఆయా రోజుల ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను వివరించడం మంచి ప్రయత్నం. పరోక్షంగా ఆ తిథి నాడు ఆచరించాల్సిన విధులను కూడా చెప్పడం విశేషం. ఈ కాలంలో ఈ విశేషాలు, వివరాలు ఎవరికీ తెలియవు. నేటి తరానికి ఆయా తిథుల, పండుగల, పర్వాల విశేషాలను, వాటి వెనుక ఉన్న నేపథ్యాలను సవివరంగా తెలియ చెబుతున్నందుకు తెలుగు పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఈ కాలంలో ఇంతటి సమాచారంతో వస్తున్న పత్రిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇలాగే ప్రతి మాసంలో వచ్చే పండుగలు, పర్వాల గురించి వివరించండి.
-కె.సీతారామయ్య- హైదరాబాద్‍, వినోద్‍- ఎన్‍ఆర్‍ఐ, మాధవీశ్రీలత, మల్లేశ్వరి, రంజని, నరసింహ- ఆన్‍లైన్‍ పాఠకులు
అందరూ చదవాలి..
‘తెలుగుపత్రిక’ అందరూ చదవాల్సిన పత్రిక. ముఖ్యంగా విదేశాల్లో ఉండే నేటి తరానికి ఇదో పాఠ్యగ్రంథం వంటిది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు అయిపోయాక మంచీచెడూ, పండుగలు పర్వాలు, సంస్క•తీ సంప్రదాయాల గొప్పదనం గురించి చెప్పే పెద్దదిక్కు లేకుండాపోయింది. తెలుగు పత్రిక అటువంటి బృహత్తర బాధ్యతను తీసుకుంది.
– ఆర్‍.ఉమాశంకర్‍, పి.రాంప్రసాద్‍, రఘురాం, బీహెచ్‍.అమర్‍నాథ్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
సామెత కథలు
సామెత కథలు, ఆధ్యాత్మిక కథ, పిల్లల కథలు వంటివి చదివిస్తున్నాయి. మనం నిత్య జీవితంలో యథాలాపంగా వాడే సామెతల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలియ చెప్పే ప్రయత్నం బాగుంది. మునుముందు కూడా ఇటువంటి ప్రయత్నాలను కొనసాగించండి. శ్రావణ మాసం విశేషాల గురించి బాగా వివరించారు. పిల్లలను, పెద్దలను ఏకకాలంలో చదివించేలా మంచి విలువైన శీర్షికలు అందిస్తున్నందుకు తెలుగుపత్రిక యాజమాన్యానికి అభినందనలు.
– రామ్‍ వి., అట్లాంటా, యూఎస్‍ఏ
విలువలను నేర్పుతున్నారు
నేడు ఏది మంచి? ఏది చెడు? అనేది విచక్షణతో ఆలోచించే తీరిక, ఓపిక ఎవరికీ లేకుండా పోతున్నాయి. పోటీ వాతావరణంలో పడి మనిషి నైతికతను మరిచిపోతున్నాడు. అటువంటి వారు ఒక్కసారి తెలుగు పత్రిక చదివితే ఎంతో నేర్చుకోగల అవకాశం లభిస్తుంది.
– శ్రీహరిరావు- హైదరాబాద్‍, టి.కమలాకర్‍- ఆన్‍లైన్‍ పాఠకు.

Review ఉత్తరాయణ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top