కార్తీకం..ఆహార విధులు

కార్తీకం..ఆహార విధులు
కార్తీక మాసంతో చలి ఆరంభమవుతుంది. అందరి శరీరాలు నజ్జు నజ్జుగా ఉంటాయి. ఈ కాలంలో శరీరంలో వేడి పుట్టించే ఆహారం తీసుకోవాలి. కార్తీకంలో ఆచరించే వివిధ వ్రతాలు, పూజల సందర్భంగా మన పెద్దలు సరిగ్గా అటువంటి ఆహార నియమాలనే విధించారు. అవేమిటో తెలుసుకోండి.

` నరక చతుర్దశి నాడు నువ్వులతో వండిన పిండివంటలను తప్పక తినాలి. అలాగే మినుములతో చేసిన పదార్థాలను, అప్పాలు, కూరలు బాగా తినాలని నియమం.
` దీపావళి నాడు మినప ఆకులు (మాష పత్రాలు) పూజలందుకుంటాయి. అలాగే, మినుములతో చేసిన సున్నుండలు, ఇతర పదార్థాలను ఈనాడు తినాలి.
` కార్తీక మాసంలో భాస్కర కృచ్ఛ వ్రతం అని ఒకటి ఉంది. ఇది సూర్యభగవానుడికి సంబంధించినది. ఇది కార్తీక శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈ వ్రతానికి ముందు నాటి ఐదు రోజుల పాటు అన్నం, తరువాత ఐదు రోజుల పాటు పెరుగు అన్నం మాత్రమే తినాలి. ఇలా చేసిన ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి.
` కార్తీక శుద్ధ విదియ తిథి భగినీ హస్త భోజన పర్వం. ఈనాడు మినుములు, నువ్వులతో చేసిన పిండివంటలను ఎక్కువగా వాడాలి.
` నాగుల చవితి నాడు పాములకు నైవేద్యంగా చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేసినది), అరటిపండ్లు, తాటి బుర్ర గుజ్జు, తేగలు వంటివి పెడతారు. వాటినే మనమూ ప్రసాదంగా తీసుకోవాలి.
` కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తీసుకోకూడదు. ఆ కాలంలో లభించే ఫలాలను మాత్రమే తినాలి.
` కార్తీక బహుళ చవితి నాడు గణపతికి పది రకాల పిండివంటలను నివేదించాలి. వాటినే ప్రసాదంగా తీసుకోవాలి.
` కార్తీక బహుళ సప్తమి నాడు పైతా మహా కృచ్ఛ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం చేసే వారు సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తినాలి. ఇలా చేసి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి.
` కార్తీక మాసంలో తప్పక తినాల్సినది` ఉసిరి. ఇందులో మంచి ఔషధ గుణాలున్నాయి. కార్తీకంలో ఉసిరికాయతో చేసిన వివిధ పదార్థాలను తింటే శరీరారోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది.
` ఉసిరి శీతగుణం కలిగి ఉంటుంది. చలికాలంలో శరీరాలు తక్కువ జీర్ణశక్తిని కలిగి ఉంటాయి. అయితే` తీపి, పులుపు, కారం, చేదు, వగరు వంటి రుచులు కలిగిన ఈ ఫలం . తీపి, పులుపు, కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని పోగొడుతుంది. కండ్ల మంటలు, పాదాల మంటలు తగ్గుతాయి. అరుచిని పోగొడుతుంది. దాహం తగ్గుతుంది.
` కార్తీక మాసం పొడవునా ఉసిరికాయను ఏదో ఒక రూపంలో రోజూ ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
` కార్తీక మాసంలో పచ్చనిని ప్రకృబుూతి ఒడిలో వన భోజనాలు చేసే సంప్రదాయం ఉంది. ఉసిరిచెట్టు నీడన, తులసి మొక్క గాలి తగిలేలా వన భోజనాలు చేయడం వల్ల ఆరోగ్యానికి ఎనలేని మేలు కలుగుతుంది.

అన్నం రోజుకు రెండుసార్లే
ఆయుర్వేదంలో భోజన విధి గురించి ఇలా చెప్పారు`
సాయం ప్రాత: మనుష్యాణాం
అశనం శృతి చోదితమ్‌
నాంతరా భోజనం కుర్యాత్‌
అగ్నిహోత్ర సమ: విధి
ఉదయం, సాయంకాలం.. ఈ రెండు సమయాల్లో మాత్రమే భోజనం చేయాలి. మధ్య మధ్యలో భోజనం చేయకూడదు. భోజనం చేయడం అనేది అగ్నిహోత్రం వంటిది. అంటే, అంతటి పవిత్రమైన కార్యం. అంత విధిగానూ భోజనవిధిని పాటించాలి.

Review కార్తీకం..ఆహార విధులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top