ముగ్గు చూడు.. ముగ్గందం చూడు

సంక్రాంతి పండగ వేళ, పల్లెటూరి తెలుగింటి పడుచుల సృజనాత్మకత రంగుల హరివిల్లులా వెల్లివిరుస్తుంది. వాళ్ల మునివేళ్ల చివరి నుంచి ఒడిసిపట్టే ముగ్గులు ఎన్ని రకాలో ! శివుడి కళ్లు, పద్మాలు, గుంటల కోనేరు, పాముల బుట్ట, ఏనుగుల ముగ్గు, పతంగుల ముగ్గు, పన్నీరు బుడ్డి, గంధపు గిన్నె, మల్లె పందిరి, తాబేలు, కొబ్బరిబోండాలు, అడ్డబాస, విస్తరాకు, బాణం, తులసికోట, గుమ్మడికాయ, వరివెన్నులు, గాదె.. ఇలాంటి ముగ్గులను వరుస చుక్కలతో,

పందెం కోళ్లు

అసలే కొత్త సంవత్సరం ప్రారంభ నెల.. ఆపై మూడు రోజుల సంక్రాంతి పండుగ.. తెలుగు ఇండస్ట్రీ ఆ సందడి ఆనందాన్ని మరింత కిక్కెక్కించనుంది. ఈ సంక్రాంతికి వెండితెర అగ్ర సినీ తారల సినిమాల మెరుపులతో తళుకులీననుంది. మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో..’, రజినీకాంత్ ‘దర్బార్’, విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ ప్రధానంగా బరిలో ఉంటే.. మరో నాలుగైదు సినిమాలు సంక్రాంతి తరువాత విడుదల కానున్నాయి. సంక్రాంతికి

సంక్రాంతి తరువాతా సందడే

డిస్కోరాజా: జనవరి 24, 2020 సంక్రాంతి సందడి ఇలా ఉంటే.. సంక్రాంతి తరువాత బరిలో దిగుతున్నాడు. ‘మాస్ మహారాజా’ రవితేజ. ‘డిస్కో రాజా’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం సైన్స్ అండ్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్తో రూపొందిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చారు. ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’గా అలరించిన రవితేజ, మళ్లీ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన సరసన పాయల్ రాజ్పుత్

గోమాతను పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపాల నుంచి విముక్తి చెంద డానికి ఏదైనా మార్గాన్ని, తరుణోపాయాన్ని తెలపండి’ అని కోరిందట. గోమాతకు చేసిన పూజల వలన కలిగే ఫలితాల గురించి అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఈ విధంగా చెప్పాడట. ‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. గోవు పాదాల యందు పితృదేవతలు, కాళ్ల యందు సమస్త పర్వతములు, భ్రూ మధ్యమున గంధర్వులు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు,

అక్కడ మట్టి కూడా మహిమ చూపుతుంది.

మంత్రాలయం.. అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్రస్వామి ప్రత్యక్షంగా అవతరించి, వేంచేసిన దివ్య స్థలం మంత్రాలయం. ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీ తీరాన ఉంది. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి, ప్రతీతి. అవేమిటంటే.. పాదోదకం.. పావనం రోజూ రాఘవేంద్ర స్వామి మూల బృందావ నానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా

Top