తెలుగు తల్లికి ముక్త కంఠంతో ‘త్రిగళార్చన’
మన తెలుగు సాహితీ క్షేత్రం అద్భుతమైన భాషా ప్రయోగాలకు వేదిక. ప్రపంచంలో సంస్క•తం వంటి మహోన్నత భాష సరసన కూర్చోగల అర్హత ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. మన తెలుగు స్వచ్ఛమైన భాష. ఈ భాషలో ఉన్న శిల్ప సౌందర్యమే దానిని అజరామరంగా నిలుపుతోంది. తెలుగు భాషా సాహిత్యంలో ఎన్నెన్నో పక్రియలు ఉన్నాయి. వాటిలో అవధాన పక్రియ ఒకటి. ఈ అవధానంలోనూ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం,




