‘రామభద్ర’ పేరు ఏనాటిది?

మహిళలు బహిష్టు సమయంలో ఇంట్లో పూజ చేయకూడదా? పూజలో పాల్గొనకూడదా? అలాగే, ఆడవారు వెలుపల ఉన్న సమయంలో ఇంట్లో దీపం వెలిగించకూడదా? వీటికి ఏవైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవ డానికి అభ్యంతరం అనే ప్రశ్న ఎక్కడా లేదు. ఎందుకని అంటే, పూజ అనేది ఎవరు చేయాలంటే ఇంటి యజమాని చేయాలి. ధర్నపత్నీ సమేతస్య అని పూజార్చన మంత్రాల్లో ఉంది కానీ, ధర్మపతీ సమేతస్య అని ఎక్కడా లేదు సంకల్పంలో. అంటే దీని అర్థం- యజమాని తన భార్యతో కలిసి పూజ చేయాలని. యజమాని తాను పూజ చేసిన కారణం చేత నా భార్యబిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఇల్లాలు బయట ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆవిడ వెలుపల ఉంది, చేసుకోవడం కష్టం అంటే, లఘువుగా చేసుకుని ఈశ్వరా ఈ పూజను పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అని వేడుకుంటే ఏ దోషము రాదు. ఇక, ఆవిడ వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? పూజయే చేయవచ్చన్నప్పుడు దీపానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం ఏమీ లేదు. పూజకు సంబంధించి మీకు ఆవిడ సహకారం లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిర్వహించలేక పోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుందీ అంటే లఘువుగా చేసి వెళ్లిపోవచ్చు. అయిదు ఉప చారాలు ‘ఉమామహేశ్వరాభ్యాం నమ:- అర్ఘ్యం, దీపం, పాద్యం, చందనం, నైవేద్యం సమాప్తం’. లేదా పూలు పెట్టి అక్షింతలు వేసి నైవేద్యం పెట్టి హారతి ఇస్తే చాలు పూజ పూర్తయిపోయినట్టే. పూర్తిగా మాత్రం మానకూడదు. ఆవిడ లేకపోయినా ఇంట దీపం పెట్టడానికి అభ్యంతరం ఎప్పుడూ లేదు.
దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంపై ఎలా నిలపాలి?
అద్దంలో ప్రతిబింబం చూసుకున్నప్పుడు మనకు ఆ అద్దంపై ధ్యాస ఉండదు. అద్దాన్నే చూడాలనుకున్నప్పుడు అందుకు మన ప్రతిబింబం అడ్డేమీ కాదు. ప్రతిబింబంపై ఉంచిన ధ్యాసను అద్దంపైకి తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే, ప్రస్తుతం దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంగా ఉన్న ‘అసలు నేనెవరు?’ అనే విచారణలోకి రావాలి. కేవలం మంత్ర జపం చేస్తూ పోతే ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉండదు. మన లోపలి నుంచి ఆ జపాన్ని చేసేదెవరో గమనిస్తేనే సత్యం తెలుస్తుంది. అంటే మనసుకు మూలంగా ఉన్న చైతన్యం తెలుస్తుంది. ఇక్కడ గమనించడం అంటే మనసు చేసే మంత్రాన్ని, ఆ మనసే వినేంత శ్రద్ధగా చేయడం అన్నమాట.
శ్రీరాముడికి రామభద్రుడనే పేరు ఎలా వచ్చింది? ఈ పిలుపు ఈనాటిదేనా? ప్రాచీనందా?
‘రామభద్రా’ అనే పిలుపు ఈనాటిది కాదు. ‘శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష’ అనే నానుడి మనకు తెలిసిందే. అంటే మనకు రక్షణ, భద్రత కల్పించే వాడు రాముడు. రాముడు జనరంజక పాల కుడు. ఆయన పాలనలో ప్రజలెంతో భద్రంగా జీవించారు. ఆ క్రమంలోనే అయోధ్యవాసులు ఆయనను ‘రామభద్రా’ అని ఆప్యాయంగా పిలుచుకునే వారు. ఈ పిలుపు ఈనాటిది కాదు. తేత్రాయుగం నాటిది. ‘భద్రశ్చ అసౌ రామ: రామభద్ర’. భద్రత అంటే శుభాలను కలిగించి, ప్రసాదించే రాముడు రామభద్రుడు అని వాల్మీకి రామాయణం చెబుతోంది. దృష్టి, జయంతుడు, విజయుడు, అశోకుడు, సిద్ధార్థుడు, అర్థసాధ కుడు, మంత్రపాలుడు, సుమంతుడు అనే ఎనిమిది మంది అయోధ్యలో ఆనాటి మంత్రులు. వీరంతా రాముడిని రామభద్రా అని పిలిచేవారని చెబు తారు. అదే వాడుకలోకి వచ్చిందని త్రేతాయుగం నాటి సంగతులు చెబుతున్నాయి.

Review ‘రామభద్ర’ పేరు ఏనాటిది?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top