వ్రతాలకు నెలవు సకల శుభాలకు శ్రవణ స్వాగతం
శావణ మాసపు శుభవేళ ప్రతి ఇల్లు ఒక కోవెలను తలపిస్తుంది. నెల రోజుల ఈ శుభ మాసం సర్వ శుభాలకు ‘నెల’వవుతుంది. ముప్పయికి ముప్పై రోజులూ శ్రావణ మాసంలో పవిత్రమైనవే. పూజలు, నోములు, పండుగలు, పర్వాలు.. అటు ఇళ్లలో ఇటు దేవాలయాల్లో పండుగ సందడి నెలకొంటుంది. ముత్తయిదువులదే ఈ నెలంతా సందడి. శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన




