తెలుగు తల్లికి ముక్త కంఠంతో ‘త్రిగళార్చన’

మన తెలుగు సాహితీ క్షేత్రం అద్భుతమైన భాషా ప్రయోగాలకు వేదిక. ప్రపంచంలో సంస్క•తం వంటి మహోన్నత భాష సరసన కూర్చోగల అర్హత ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. మన తెలుగు స్వచ్ఛమైన భాష. ఈ భాషలో ఉన్న శిల్ప సౌందర్యమే దానిని అజరామరంగా నిలుపుతోంది. తెలుగు భాషా సాహిత్యంలో ఎన్నెన్నో పక్రియలు ఉన్నాయి. వాటిలో అవధాన పక్రియ ఒకటి. ఈ అవధానంలోనూ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం.. ఇలా మరెన్నో పక్రియలు ఉన్నాయి. వీటిలో సాధారణంగా అష్టావధానం అంటే అందరికీ తెలిసిందే. కానీ, విదేశీ గడ్డపై మన తెలుగు భాషా వైశిష్ట్యాన్ని వైభవోపేతం చేస్తూ త్రిగళావధానం ఒకటి పురి విప్పింది. త్రిగళావధానం అంటే ఏమిటా? అని కళ్లు విప్పార్చుకుని ఆలోచిస్తున్నారా? అయితే అట్లాంటా వెళ్లాల్సిందే

అట్లాంటా తెలుగు సాహిత్య సంస్క•తి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన త్రిగళావధానం ప్రపంచ భాషా చరిత్రలోనే మొట్ట మొదటి ప్రయోగం. తెలుగు భాషామతల్లికి విదేశీగడ్డపై గల కొందరు తెలుగు భాషాభిమానాలు అత్యంత భక్తి ప్రపత్తులతో సమర్పించిన అవధాన నీరాజన మిది. ఈ సరికొత్త అవధాన పక్రియ ద్వారా తెలుగు భాష కీర్తిని దశ దిశలా చాలిన ఘనత అట్లాంటా తెలుగు సాహిత్య సంస్క•తి సంఘానికే దక్కుతుంది. త్రిగళావధానం.. తెలుగు భాష కీర్తి కిరీటంలో పొదిగిన మణి. ఇది మన తెలుగు వారందరికీ తలమానికం. ఈ అద్భుత సాహిత్య పక్రియ దాదాపు అయిదు గంటల పాటు అట్లాంటా వేదికగా నిర్వహించడం, దీనికి అక్కడి తెలుగు వారు పెద్దసంఖ్యలో విచ్చేసి ఆద్యంతం ఆనందించడం ఒక గొప్ప విశేషం.
త్రిగళావధానం అంటే..
అదేమిటి? అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం గురించి విన్నాం.. కన్నాం.. కానీ కొత్తగా త్రిగళావధాన మేమిటి? అనే సందేహం వచ్చిందా? మీరు చదివింది సరిగానే ఉంది. సహజంగా అవధానం పక్రియ చాలా సంక్లిష్టమైనది. మొత్తం తెలుగు సాహిత్య పక్రియల్లోనే అవధాన పక్రియ బాగా ప్రఖ్యాతి చెందింది. ఇందులో అష్టావధానం, సహస్రావధానం అంటూ రకరకాల పక్రియలతో పండిత గౌరవంతో కొనసాగుతోన్న సాహిత్య పరిమళమిది. ఇక, అందులోనూ త్రిగళావధాన మంటే మాటలు కాదు. ముగ్గురు అవధానులు మూడు భాషల్లో ఒకే వేదికపై అవధానం నిర్వ హించడమే త్రిగళావధానం. సాహితీ ప్రపంచం లోనే ఇది తొట్ట తొలి ప్రయోగమని.. ఈ ప్రయో గాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలుగు సాహితీ సంస్క•తి అధ్యక్షుడు వల్లూరి రమేశ్‍ అంటున్నారు. ఈ కార్యక్రమానికి ఆయనే నేతృత్వం వహించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇక త్రిగళావ ధానం విషయానికి వస్తే.. పాలడుగు చరణ్‍ సంస్క• తంలో, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‍ అచ్చ తెలుగులో, నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజుల తెలుగు – సంస్క•తం రెండూ కలిసిన ఆంధ్రంలో అవధానం చేశారు. ముగ్గురూ మూడు భాషల్లోని అక్షరాలను సంధిస్తే.. వాటిని నేర్పుగా పండిం చడమే ఈ అవధాన పక్రియలోని విశేషం. పృచ్చ •కులు (ప్రశ్న అడిగే వారు) తెలుగు, సంస్క•తం, తెలుగు-సంస్క•తంలో అక్షరాలను ఇస్తారు. ముగ్గురూ మూడు భాషల్లో వాటిని పూరిస్తారు. ఈ బృహత్‍ కార్యక్రమానికి ఏపీలోని రాజమండ్రికి చెందిన ప్రముఖ సాహిత్యకారులు, సహస్రాధిక వ్యాసకర్త యెరాప్రగడ రామకృష్ణ సంచాలకత్వం నిర్వహించారు. ఇదే వేదికపై కార్యక్రమం చివరిలో రచాలపల్లి దేవీదాసు రచించిన ‘అక్షరార్చన’ పుస్తకాన్ని అట్లాంటాలోని ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు బీకే మోహన్‍ ఆవిష్కరించారు.
తెలుగు భాషను కాపాడుకుందాం
భాషలోని అద్భుతమైన శిల్ప సౌందర్యమే మన తెలుగు భాషను ఈనాటికీ నిలిపి ఉంచుతోంది. అటువంటి అందాల తెలుగు, మహోన్నతమైన భాష నేడు నిర్లక్ష్యపు గాలికి రెపరెపలాడుతోంది. దానిని మనమంతా కలిసి చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాలని ఈ వేదికపై నుంచి అవధాన ప్రముఖులు పిలుపునిచ్చారు. అవధానాలు చేసే వారు చాలామంది ఉంటారని, కానీ, నేడు అట్లాం టాలో నిర్వహించిన త్రిగళావధానం మాత్రం తెలుగు భాష నుదుటున దిద్దిన తిలకం వంటిదని సాహితీ ప్రముఖులు అభివర్ణించారు.
నవ్వులు.. పువ్వులు..
త్రిగళావధానం వేదికపై ఆద్యంతం నవ్వులు పువ్వులై విరిశాయి.
‘ఇది ఒక చిక్కు ప్రశ్న’ అని ఒక పృచ్ఛకుడు అనగానే, ఒక అవధాని- ‘అడిగే వారికా? చెప్పే వారికా? అంటూ చమత్కరించడం సమయోచితంగా నవ్వులు పూయించింది. అలాగే, మరొకరు- ‘నిను వీడని నీడను నేనే.. ’ అని మిమ్మల్ని ఉద్దేశించి నేనంటే మీరేమంటారు?’ అని అడగగా, ‘ముందు ఈ కార్యక్రమంలో మీ భార్య కూడా ఉన్నా రేమో చూసుకోండి. ముందు ఆమె మిమ్మల్ని నీడలా వెంటాడకుండా చూసుకోండి’ అని అవధాని గారు బదులివ్వడంతో ప్రాంగణ మంతా గలగలలాడింది.
తొలి ప్రయోగం విజయవంతం
మన తెలుగు భాష దేశ విదేశాల్లో అజరామ రమై విలసిల్లుతోంది. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగు సాహితీ సంస్క•తి.. మన భాష సౌభాగ్యాన్ని అప్రతిహతంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఈ సంస్థ అధ్యక్షుడు వల్లూరి రమేశ్‍ పప్రథమంగా చేసిన త్రిగళావధాన పక్రియ జగద్విఖ్యాతమై విజయవంతమైంది. సాహితీపరు లంతా ఈ కార్యక్రమాన్ని వేనోళ్ల ప్రసంశించారు. తెలుగు సాహితీ క్షేత్రంలోనే త్రిగళావధానం ప్రథమ కీర్తిని పొందిన పక్రియ అని కొనియాడారు. అందరూ ముక్తకంఠంతో తెలుగు భాషామతల్లికి ‘త్రిగళార్చన’ చేశారు.

Review తెలుగు తల్లికి ముక్త కంఠంతో ‘త్రిగళార్చన’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top