వీరుల త్యాగ ఫలం…స్వాతంత్రం

స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరికాదోయీ, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయీ ఆగకోయి భారతీయుడా! కదిలి సాగవోయి ప్రగతి దారులా! ఇది స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాకవి శ్రీశ్రీ రాసిన విజయగీతిక. దీనిని మనం ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడే కాదు.. ప్రతి భారతీయుడు ప్రతి రోజూ గుర్తుంచుకుని, మననం చేసుకోవా ల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఎందరో వీరుల త్యాగ ఫలం.. నేడు మనం అనుభవిస్తున్న

ఆనందో బ్రహ్మ

చిత్రకారుడు రోదిస్తూ బొమ్మలు గీయడు. శిల్పి దుఃఖిస్తూ శిల్పాన్ని చెక్కడు. నృత్యకారుడు విలపిస్తూ నాట్యం చేయడు. గాయకుడు బాధపడుతూ గీతాన్ని ఆలపించడు. సంగీతకారుడు కుమిలిపోతూ సంగీతాన్ని వినిపించడు. కవి బరువెక్కిన గుండెలతో కాదు.. తేలికైన హృదయంతోనే తన రచనలకు రూపునిస్తాడు. ఇంకా ఎందరో.. తమ కళలు, వృత్తి పనుల్లో నిమగ్నమైన వారు ఆనందంతోనే ఆయా పనులను ఆవిష్కరిస్తారు. ఎందుకంటే ఏదైనా పనిలో ఉన్నవారు ఆ పనిలో నిమగ్నమవుతారు. అది బ్రహ్మానంద క్షేత్రం. అందులో ఉండేది కేవలం ఆనందమే. ఆ ఆనందంలో

ఉత్తరాయణం

సమకాలీన అంశాలపై.. ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో అన్ని విషయాలను చర్చిస్తున్నారు. ముఖ్యంగా సంస్క•తీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తెలుగు భాష విశేషాల గురించి విశేష రీతిలో వివరాలు అందిస్తున్నారు. సంతోషం. ఎంతైనా అభినందనీయం. అలాగే, సమకాలీన, వర్తమాన అంశాలను కూడా క్లుప్తంగానైనా టచ్‍ చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. అటు తెలుగు రాష్ట్రాలలో, ఇటు విదేశాలలో చోటుచేసుకుంటున్న ముఖ్య పరిణామాలపై విశ్లేషణ మాదిరి అందిస్తే ఎంతైనా బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ అందరినీ

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకి, కాలక్షేపానికి మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక పిల్లల్లారా.. పాపల్లారా పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరు ల్లారా పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా ।।పిల్లల్లారా।। మీ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు, ఉన్నాడు పొంచుకున్నాడు మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు, ఉన్నాడు

నిగ్రహ శక్తి

మానవ జన్మ లభించడం ఒక వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. ‘తింటున్నాం. సరదాలతో, సుఖాలతో హాయిగా కాలం గడిపేస్తున్నాం.’ అనుకుంటారు చాలామంది. ఏదో ఒక రోజు ఈ బొందిలో ప్రాణం కాస్తా ఎగిరిపోతుంది. అశాశ్వతమైన జీవితం కోసం మనిషి తాపత్రయపడుతున్నాడు. ఇంద్రియ సుఖాల కోసం అదేపనిగా వెంపర్లాడుతున్నాడు. అతడు నిగ్రహం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం అజ్ఞానమే అవుతుంది. ఇతర ప్రాణుల కంటే మిన్న అయిన ఈ మానవ

Top