వీరుల త్యాగ ఫలం…స్వాతంత్రం

స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరికాదోయీ,
సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయీ
ఆగకోయి భారతీయుడా! కదిలి సాగవోయి ప్రగతి దారులా!
ఇది స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాకవి శ్రీశ్రీ రాసిన విజయగీతిక. దీనిని మనం ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడే కాదు.. ప్రతి భారతీయుడు ప్రతి రోజూ గుర్తుంచుకుని, మననం చేసుకోవా ల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఎందరో వీరుల త్యాగ ఫలం.. నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్ర దినం. దీనిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడిపై ఉంది

•ండు వందల సంవత్సరాల ఆంగ్ల పరి పాలనలో తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, జవసత్వా లనూ కోల్పోయిన భారతీయులంతా తమ శరీరాల్లోని ప్రతి అణువునూ ఒక చెవిగా చేసుకుని ఒక శుభవార్త కోసం ఎదురుచూశారు. ఎడతెగని తుఫాను తాకిడికి నేలవాలిన మహా వృక్షపు శిథిల శేషాల నుంచే సరికొత్త చిగుళ్లు మొలకెత్తినట్టుగా ఒక కొత్త భారత జాతి జీవం పోసుకుంది. పందొమ్మిది వందల నలభై ఏడు, ఆగస్టు పద్నాలు గవ తేదీ నాటి అర్థరాత్రి, తెల్లవారితే ఆగస్టు పదిహేను అనగా, మన భారతావని స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.

ఆనందం.. విషాదం

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశం పుట్టిన రోజుగా ఆగస్టు 15వ తేదీ చరిత్రలో గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. లక్షలాది దేశ భక్తుల త్యాగాల ఫలితంగా లభించిన ఈ వరాన్ని దేశ ప్రజలంతా హర్షాతిరేకంతో స్వాగతించారు. అంతటి ఆనందానికి, కొండంత ఆ దనను జోడిస్తూ అఖండ భారతదేశం రెండు ముక్కలైంది. హిందూ ముస్లిం అల్లర్లలో లక్షలాది మంది అమాయకుల మాన ప్రాణాలు, ఆస్తులు, ఇళ్లూ వాకిళ్లూ తమకు అలవాటైన పరిసరాలనూ కోల్పోయారు

ఉద్యమానికి నాంది.. సిపాయిల తిరుగుబాటు

ఈ స్వాతంత్య్ర దినోత్సవాన ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే.. భారత స్వాతంత్య్ర సంగ్రామం 1857 సంవత్సరంలో మీరట్‍లో జరిగిన సిపాయిల తిరుగుబాటుతో మొదలైనట్టు కనిపిస్తుంది. అప్పటి దాకా తిరుగుబాటును ఎరుగని బానిసల్లా, తమ చైతన్యాన్ని, స్వేచ్ఛా ప్రియత్వాన్ని మరిచిపోయి బతికిన భార తీయుల్లో ఒక్కసారిగా మార్పు తెచ్చిన సంఘ టన- సిపాయిల తిరుగుబాటు ఉద్యమం అనవచ్చు. బ్రిటిష్‍ వారి నిరంకుశ పరిపాలనపై దేశ ప్రజల్లో ఏర్పడిన నిరసన భావం 1885లో ఇండియన్‍ నేషనల్‍ కాంగ్రెస్‍ పార్టీ స్థాపనకు దారితీసింది. 1907 సంవత్సరంలో కాంగ్రెస్‍ పార్టీలో బాలగంగాధర తిలక్‍, లాలా లజపతి రాయ్‍, బిపిన్‍ చంద్రపాల్‍.. ఈ లాల్‍, బాల్‍, పాల్‍ త్రయం విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు నిచ్చారు. స్వదేశీ ఉద్యమాన్ని లేవనెత్తారు.

వందేమాతరం ఉద్యమం..

భారత స్వతంత్ర పోరాటంలో మొట్ట మొదటి ప్రజా ఉద్యమం 1905 సంవత్సరంలో ప్రజ్వ రిల్లిన వందేమాతరం ఉద్యమం. 1906లో జరి గిన కాంగ్రెస్‍ సమావేశానికి అధ్యక్షత వహించిన దాదాబాయ్‍ నౌరోజీ స్వరాజ్యం కోసం పిలుపు నిచ్చారు. అహింసా మార్గంలో సహాయ నిరాకర ణోద్యమం ద్వారా అప్పటికే దక్షిణాఫ్రికాలో భార తీయుల సమాన హక్కుల కోసం పోరాడి గెలిచిన న్యాయవాది గాంధీజీ మాతృదేశం పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం 1914లో భారతదేశానికి తిరిగి వచ్చారు.

జలియన్‍ వాలాబాగ్‍ దురంతం

జలియన్‍ వాలాబాగ్‍ దురంత•ం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన. అమృత్‍ సర్‍ పట్టణంలో జలియన్‍ వాలాబాగ్‍ తోటలో రౌలట్‍ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశమైన నిరా యుధ స్త్రీ, పురుషులు, పిల్లలపైన బ్రిటిష్‍ సైని కులు జనరల్‍ డయ్యర్‍ సారథ్యంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. పది నిమిషాల పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో అధికారిక ప్రకటన వేరుగా ఉన్నా, వాస్తవానికి వెయ్యి మందికి పైగా మరణించారని, రెండు వేల మందికి పైగా గాయ పడ్డారని అంచనా. ఈ సంఘటనకు నిరసనగా విశ్వకవి రవీంద్రనాథ్‍ ఠాకూర్‍, బ్రిటిష్‍ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘సర్‍’ బిరుదును తిరిగి ఇచ్చి వేశారు.

సహాయ నిరాకరణోద్యమం..

క్విట్‍ ఇండియా.. ఉప్పు సత్యాగ్రహం

జలియన్‍ వాలాబాగ్‍ సంఘటన 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. అనంతరం జరిగిన ఉప్పు సత్యా గ్రహం, క్విట్‍ ఇండియా ఉద్యమాలు స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో చేపట్టన ఉప్పు సత్యాగ్రహం, బ్రిటిష్‍ వారు భారత దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్‍ చేస్తూ 1942లో తలపెట్టిన క్విట్‍ ఇండియా ఉద్యమాలలో గాంధీజీ నిర్దేశించిన మార్గంలో భారత జాతి ఏకతాటిపై నడిచింది. అప్పటి వరకు స్వతంత్ర భారతదేశం కోసం ప్రతిభావంతమైన ప్రణాళిక లేక అస్తవ్యస్తంగా నడిచిన భారత ప్రజలను గాంధీజీ ఒక్కతాటిపై నడిపించారు. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం, ఆవేశం స్థానంలో అహింసను ఆయు ధాలుగా గాంధీజీ మలచిన తీరు ప్రపంచ దేశా లను ఆశ్చర్యాలకు గురి చేసింది.

గాంధేయవాదులూ.. విప్లవ వీరులూ..

లాలా లజపతి రాయ్‍, సరోజినీ దేవి, సర్దార్‍ వల్లభాయ్‍ పటేల్‍, లాల్‍ బహదూర్‍ శాస్త్రి, పండిట్‍ జవహర్‍లాల్‍ నెహ్రూ, బాబూ రాజేందప్రసాద్‍, గోపాలకృష్ణ గోఖలే, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్వేపల్లి రాధాకృష్ణన్‍, చక్రవర్తుల రాజగోపాలచారి వంటి గాంధేయవాధులూ, రాజ్‍గురు, సుఖ్‍దేవ్‍, ఖుదీరామ్‍ బోస్‍, మదన్‍లాల్‍ ధింగ్రా, చంద్రశేఖర ఆజాద్‍, సుభాష్‍చంద్ర బోస్‍ వంటి విప్లవయోధులూ, అకుంఠిత దీక్షతో, లక్ష్య సాధనే ధ్యేయంగా స్వాతంత్య్ర సంగ్రామంలో అనితర సాధ్యమైన పాత్రలను పోషించారు. లాఠీ దెబ్బలకూ, కఠినమైన జైలు జీవితానికీ వెరవ కుండా తమ ఆస్తిపాస్తులనూ, కుటుంబ జీవన సౌఖ్యాన్ని త్యజించి, మాతృభూమి దాస్య విమోచన కోసం ఆత్మార్పణ చేశారు.

స్వతంత్య్ర భారతావని ఆవిర్భావం..

రెండో ప్రపంచ యుద్ధం తరువాత భారత దేశాన్ని ఇంకా పట్టి ఉంచగలిగే శక్తి తమకు లేదని ఆంగ్లేయులు గ్రహించారు. భారతదేశంలో పోటె త్తుతున్న స్వాతంత్య్ర పోరాటపు ఉధృతి, ఇక ఆ దేశంపై పరాయి పాలన సాగదని వారికి తెలియ చెప్పింది. 1947 ఆగస్టు 15వ తేదీన భారత దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. అఖండ భారతం రెండు దేశాలుగా విడిపోయింది. ఢిల్లీ రాజధానిగా భారత్‍, కరాచీ రాజధానిగా పాకిస్థాన్‍ ఏర్పడ్డాయి. మహ్మద్‍ అలి జిన్నా ముస్లిం దేశమైన పాకిస్థాన్‍కు గవర్నర్‍ జనరల్‍గా కరాచీలోనూ, స్వతంత్ర భారత దేశానికి తొలి ప్రధాన మంత్రిగా పండిట్‍ జవహర్‍ లాల్‍ నెహ్రూ ఢిల్లీలోనూ ప్రమాణ స్వీకారం చేశారు.
మిన్నంటే ఉత్సవ సంబరాల మధ్య జాతిపిత మహాత్మాగాంధీ కోసం ప్రజలంతా ఎలుగెత్తి పిలిచారు. ప్రార్థనలు చేశారు. కానీ, మహాత్ముడు ఈ ఉత్సవానికి దూరంగా కలకత్తాలో ఉండి, దేశ విభజన, తదనంతరం చెలరేగిన మత కలహాల వల్ల దు:ఖితుడై, 24 గంటలు ఉపవాస దీక్షలో మునిగి హిందూ ముస్లిం సఖ్యతను, శాంతిని కోరుతూ ప్రసంగించారు. లార్డ్ మౌంట్‍ బాటన్‍ గవర్నర్‍ జనరల్‍గా మరో పది నెలల పాటు స్వతంత్ర పరిపాలనకు తోడ్పాటును అందించారు. ఆ తర్వాత గవర్నర్‍ జనరల్‍గా పదవీ బాధ్యతలు చేపట్టిన చక్రవర్తుల రాజగోపాలచారి, ప్రధాని పండిట్‍ జవహర్‍లాల్‍ నెహ్రూ సారథ్యంలో స్వతంత్ర భారతదేశం మనుగడ సాధించింది.

మన జాతీయ పండుగలు..

మన జాతీయ పండుగల్లో ప్రధానమైనవి మూడు. వీటిలో మొదటిదే స్వాతంత్య్ర దినోత్స వమే. మిగిలినవి- రిపబ్లిక్‍ డే, మహాత్మాగాంధీ జయంతి. భావి తరాల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తమ ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు మనమంతా నివాళులర్పించే రోజే స్వాతంత్య్ర దినోత్సవం (ఇండిపెండెన్స్ డే). ఈ సందర్భంగా పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, ఆకాశవాణి, దూరదర్శన్‍ వంటి ప్రచార మాధ్యమాల్లోనూ అనేక రకాల పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలూ నిర్వ హిస్తారు. యావత్తు భారతావని అంతటా మువ్వ న్నెల జెండా రెపరెపలాడుతుంది. ఆగస్టు 15 నాడు భారత ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతా కాన్ని ఎగురవేస్తారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాల రాజధాని నగ రాల్లోనూ పతాకావిష్కరణలు, సాంస్క•తిక కార్య క్రమాలూ ఘనంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను, సందర్శనీయ ప్రాంతా లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంక రిస్తారు. ముఖ్య కూడలి ప్రాంతాలు, జాతీయ నాయకుల విగ్రహాలు, ఇతర ముఖ్య ప్రాంతాలలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగురు తుంటుంది. విదేశాల్లోని కొన్ని దేశాలలో ఆగస్టు 15వ తేదీని ‘ఇండియా డే’గా జరుపుకునే సంప్రదాయం కూడా అమల్లో ఉండటం విశేషం.

భిన్నత్వంలో ఏకత్వం..

స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు మన దేశం మరే ఇతర దేశం పైనా దండెత్తిన దాఖలాలు లేవు. దాడికి దిగిన సందర్భాలు లేవు. మన దేశం కళల కాణాచి. అతిథులెవరైనా సరే సాదరంగా ఆదరించడమే మనకు తెలుసు. స్నేహానికి చిరునామా అంటూ ఉంటే అది కచ్చితంగా భారతదేశమే అవుతుంది. పదహారు వందలకు పైగా గుర్తించిన భాషలు, అనేక మతాలు, సంస్క•తులు మిళితమైన మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.

‘‘చాలా కాలం క్రితం మన భవితవ్యాన్ని మనమే నిర్ణయించుకునేందుకు సన్నద్ధులమయ్యాం. ఇప్పుడా సమయం వచ్చింది. ప్రపంచం యావత్తూ నిద్రలో మునిగినపుడు, అర్ధరాత్రి పన్నెండు కొట్టగానే స్వతంత్ర భారతి చేతన పొంది మేల్కొంటుంది. పాత నుంచి కొత్తలోని మనం అడుగు పెట్టే క్షణం, ఒక యుగం అంతమై, ఎంతో కాలంగా అణచివేయబడిన ఒక దేశపు ఆత్మ గొంతు పెగల్చుకుని తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఇటువంటి క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది. మనమంతా భారతదేశం కోసం, దేశ ప్రజల కోసం, అంతకు మించి మానవ జాతి కోసం అంకితమవుతామనే ప్రతిజ్ఞ పూనుకునేందుకు సరైన సమయం ఈ పవిత్ర క్షణమే’’

– పండిట్‍ జవహర్‍లాల్‍ నెహ్రూ (ప్రసిద్ధమైన ‘‘ట్రిస్ట్ విత్‍ డెస్టినీ’’ ప్రసంగం నుంచి

భారతదేశం ఎంతో గొప్పది

‘‘నేను భారతదేశం నలు చెరగులా తిరిగాను. కానీ, ఒక్క బిచ్చగాడిని కానీ, ఒక్క దొంగను కానీ చూడలేకపోయాను. అంతటి సంపద, అంతటి నైతిక విలువలు, సామర్థ్యమూ ఉన్న ప్రజలను చూశాక ఇలాంటి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఈ దేశపు వెన్నెముకను విరిస్తే కానీ సాధ్యం కాదని నాకు అర్థమైంది. ఈ దేశం బలమంతా వీరి ఆధ్యాత్మిక, సాంస్క•తిక వారసత్వంలోనే ఉంది. వీరి ప్రాచీన విద్యా విధానాన్ని, సంస్క•తిని తొలగించి, ఆంగ్ల భాషా, సంస్క•తులే గొప్పవని వారనుకునేలా చేయగలిగితే, భారతీయులు వారి ఆత్మగౌరవాన్ని, తమదైన సంస్క•తినీ కోల్పోయి మనకు వశమవుతారు’’.

– లార్డ్ మెకాలే (1835వ సంవత్సరం, ఫిబ్రవరి రెండవ తేదీన బ్రిటిష్‍ పార్లమెంటులో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ చేసిన ప్రసంగంలోని మాటలు

జాతీయ పతాకం ఉండాలిలా..

జాతీయ పతాకాన్ని ఎగురవేయడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మన జాతీయ పతాకం ఎలా ఉండాలి అనే విషయమై పాటించాల్సిన పద్ధతులు, నియమాలను కేంద్ర ప్రభుత్వం ‘ఫ్ల్లాగ్‍ కోడ్‍ ఇండియా’ పేరిట రూపొందించింది. ఈ కోడ్‍ ప్రకారం..

  • జాతీయ పతాకంలో ఆకుపచ్చ, తెలుపు, నారింజ రంగుల్లో కనిపించే అడ్డ పట్టీలు ఒకే వెడల్పులో ఉండాలి.
  • మధ్యలో ఉన్న తెలుపు రంగు పట్టీపై నావిక నీలి ధర్మచక్రంలో 24 (ఇరవై నాలుగు) గీతలు ఉండాలి.
  • ఇరవై నాలుగు గీతల మధ్య సమాన దూరం ఉండాలి.
  • జాతీయ పతాకానికి వాడే వస్త్రం చేనేత వస్త్రమై ఉండాలి.
  • జాతీయ పతాకంలో కాషాయ రంగు ఎల్లప్పుడూ అగ్ర భాగాన ఉండాలి.
  • పతాకాన్ని ఏవిధమైన ప్రకటనలకు ఉపయోగించరాదు.
  • జాతీయ పతాకం వాడుకలో ‘ఫ్లాగ్‍ కోడ్‍
    ఇండియా’లోని నియమాలన్నీ
    తు.చ. తప్పకుండా
    పాటించాలి

Review వీరుల త్యాగ ఫలం…స్వాతంత్రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top