కార్మిక జీవనం మనది
ఈ లోకంలో ఉన్నంతకాలం పని చేస్తూనే ఉండాలి!. లేదంటే మనుగడ లేదు. మనిషిగా పుట్టింది..తనకు విధించిన కర్మలను, బాధ్యతలను నిరంతరం నిర్వర్తించడానికే. అంతేతప్ప.. మానవజన్మ ఎత్తింది, హాయిగా ప్రకృతి ఒడిలో సేదదీరుతూ అందాలను ఆస్వాదించడానికి కాదు. పని చేస్తూ విశ్రాంతి పొందాలి తప్ప.. విశ్రాంతి పొందడానికి, ఉన్నవి అనుభవించడానికి కాదు. అందుకే మానవజన్మను ‘కార్మిక జీవనం’గా అభివర్ణిం చారు. అంటే, కర్మలను ఆచరిస్తూ, కర్మలను చేస్తూ గడపాల్సిన జన్మ




