‘రామ’ నామ మహిమ
‘రామ’ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ ‘శ్రీరాముని’ కనుగొనుచుండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అంటూ విష్ణు సహస్ర నామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు ‘ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!’ అంటూ ఈ కింది శ్లోకంతో




