టైటానిక్ న్యూస్

వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్‍ ఓడను చూడాలని అనుకునే వారికి ఓ ప్రైవేట్‍ సంస్థ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వచ్చే ఏడాది మేలో చేపట్టనున్న ఈ సాహసయాత్ర ద్వారా పర్యాటకులను అట్లాంటిక్‍ మహాసముద్రంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది బ్లూ మార్బుల్‍ అనే సంస్థ. 2018 మే నెలలో చేపట్టే ఈ సాహస యాత్రలో పర్యాటకులను సుమారు 4వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్‍ ఓడ వద్దకు తీసుకెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే టికెట్లను

ఇండియన్ సంస్థలపై విషం జిమ్మిన ఎంపీ

భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికన్‍ ఎంపీ డారెల్‍ ఇసా విషం చిమ్మాడు. హెచ్‍ 1 బీ వీసాల సిస్టంతో అవి ఆటలాడుతున్నాయని, ఈ పోగ్రాంలోని లోపాలను తమకు అనువుగా వినియోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్‍లో అట్లాంటిక్‍ కౌన్సిల్‍ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ వ్యవహారానికి సంబంధించి తాను ప్రతిపాదించిన బిల్లుకు తమ దేశ అధ్యక్షుడు ట్రంప్‍ సపోర్ట్నిస్తే సెనేట్‍లో మనకు గట్టి బలం ఉంటుందని అన్నారు. భారతీయ సంస్థలు

కలయో వైష్ణవ మాయో..

దేవాలయాలు మన సంస్క•తీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు. అవి మనకు సంస్కారాన్ని నేర్పే పాఠశాలలు. జీవితంలో శృతి... లయ సమంగా ఉండేలా చూసే ఆధ్యాత్మిక సంగీత సాగరాలు. దేశం కాని దేశం... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా రాష్ట్రం. ఎక్కడా మన ఆనవాళ్లు లేవు. మన సంస్క•తి, సంప్రదాయాలను ప్రతిఫలించే గుర్తులే లేవు. చిన్న గుడి ఉంటే బాగుంటుంది కదా ?......అనే ఆలోచన అక్కడ ఉంటున్న మన తెలుగు వారికి అనిపించింది. సరిగ్గా

బతకొద్దు.. జీవిద్దాం!

ఒక చిన్న కుర్రాడు ఒకరోజు దిగులు ముఖంతో ఇంటికి వచ్చాడు. తల్లి.. ‘ఎందుకురా అలా ఉన్నావు?’ అని ప్రశ్నించింది. ‘మా స్కూల్లో డ్రామా వేస్తున్నారు. నా మిత్రులందరికీ రాజు, మంత్రి, సేనాధిపతి వంటి మంచి వేషాలు ఇచ్చారు. నాకు మాత్రం భటుడి వేషం ఇచ్చారు’ అని కంటతడి పెడుతూ చెప్పాడు ఆ పసివాడు. ‘పిచ్చి కన్నా.. ఆ నాటకంలో రాజు పాత్ర ఎంత ముఖ్యమో భటుడి పాత్ర కూడా అంతే కీలకమైనది. నాటకం అన్నాక

ఉత్తరాయణం

ఇంకా చాలా కావాలి. ‘తెలుగు పత్రిక’లో చాలా వివరాలు అందిస్తున్నారు. సంతోషం. అయితే, ఇంకా చాలా కావాలని అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా ప్రముఖ పర్యాటక ప్రాంతం, ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రం, మానసిక వికాసం కలిగించే శీర్షికలను కూడా ప్రవేశపెట్టండి. పాఠకుల యాత్రానుభవాలకు చోటివ్వండి. కథలు కూడా ఉంటే మంచిది. పురాణేతిహాస కథలు, ఇతరత్రా ఆధ్యాత్మిక సమాచారానికి, భాషా సంబంధమైన అంశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే విశేషాలు అందించండి. - రామకృష్ణ.కె., ఆస్టిన్‍, అమెరికా

Top