వానలు కురవాలి వానదేవుడా

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే
బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు..
వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
బుర్రుపిట్ట
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది పడమటింటి కాపురము చేయనన్నది.అత్త తెచ్చిన కొత్త చీరకట్టనన్నదిమామ తెచ్చిన మల్లెమొగ్గ ముడవనన్నదిమగని చేతి మొట్టికాయ తింటానన్నది.
చిలకలు
చింతాచెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ ?
‘‘చిలకల్లార, చిలకల్లార
చీ! ఛీ! పొమ్మందీ’’
కొబ్బరిచెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ ?
‘‘చిలకల్లారా, చిలకల్లారా!
చీ! ఛీ! పొమ్మందీ’’
జామచెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ ?
‘‘చిలకల్లారా, చిలకల్లారా!
రండీ రండందీ’’
మామిడి చెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ
‘‘చిలకల్లారా, చిలకల్లారా!
రండీ రండందీ’’
నెమలి
ధగధగ మెరిసే కాంతినిచల్లే
కళ్ళు నెమలి కెవరిచ్చారో ?
పురివిప్పుతూ అది నాట్యమాడగా
తాండవకృష్ణుడు జ్ఞప్తికిరాడా ?
మేఘాలందం నీలాలందం
కాంతల కాటుక కన్నుల అందం
అందాలన్నీ జీవం దాల్చి
నీలో నాట్యం చేసేనే!
జ్ఞాపకముంటే చెప్పరాదటే
కృష్ణుని బాల్యక్రీడలు మాతో
కృష్ణుని వేణికి నీవా అందం
నీకే అందం ఆ వేణా ?
నిన్ను బాలకులు నిత్యంకోరుతు
నీతో ఆటలు ఆడేవేళల
వారు కృష్ణులను భావము పుట్టును
నిజమంటావా! కాదా! చెప్పవె.

Review వానలు కురవాలి వానదేవుడా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top