సామెతలో కద

అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి కానీ.. దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్లేదు. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా మనకు మంచి చేసేవాళ్లకు మాత్రమే ప్రాధాన్యమివ్వాలి. వారికే పెద్దపీట వేయాలి. అల్ప పదాలతోటి అనల్పార్థాలను సాధించడమే సామెతల ప్రత్యేకత. మూరెడు పొంగటం ఎందుకు? బారెడు కుంగటం ఎందుకు? ఈ ఆరు పదాల్లో ఎంత వ్యక్తిత్వ వికాస పాఠం ఉందో గమనించారు కదా! ప్రతి మనిషికీ, ప్రతి సందర్భానికీ ప్రతి చిత్త ప్రవృత్తికి అతికినట్టు సరిపోయే సామెతలు

కాణిపాక వినాయకుడూ- ప్రమాణాల దేవుడూ

ఆ బావిలోని రాయి వినాయకుని ఆకారంలో కనిపించింది. వెంటనే ప్రజలు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు. అలా కొబ్బరికాయలు కొట్టగా కొట్టగా.. వాటి నుంచి వచ్చిన నీళ్లు బావి నుంచి పొంగిపొరలాయి. అలా ఆ నీటితో ఒకటిన్నర ఎకరాల నేల తడిచింది. అప్పట్లో.. అంటే దాదాపు వెయ్యేళ్ల క్రితం ఒకటిన్నర ఎకరా నేలను ‘కాణి’ అని పిలిచే వారు. కొబ్బరినీరు పారిన ప్రాంతం కాబట్టి ‘కాణిపాకం’ అయ్యింది. అప్పటి

నల్లకుబేరులపై మోడీ ఖడ్గం

మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెట్టాయి. సర్జికల్‍ దాడులతో పాక్‍ నోరు మూయించిన మోడీ.. తాజాగా కరెన్సీ రద్దు నిర్ణయంతో ప్రపంచాన్ని మొత్తం తనవైపునకు తిప్పుకున్నారు. నవంబర్‍ 8... యావత్‍ భారతదేశాన్ని కుదిపేసిన రోజు..నల్లదొరలపై భారత ప్రధాని నరేంద్రమోడీ ఖడ్గమెత్తిన రోజు..బ్లాక్‍మనీ ఆటకట్టించేందుకు ఆరునెలలు పడ్డ కష్టానికి ఓ రూపు వచ్చిన రోజు..500, 1000 నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో

శ్వేతసౌధం ట్రంప్

ప్రపంచ రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలు విడుదలయ్యే వేళకి అందరి అంచనాలు తప్పాయి. సర్వేలన్నీ తారుమారయ్యాయి. ఎగ్జిట్‍పోల్స్, మీడియా విజయం ఖాయమన్న డెమొక్రటిక్‍ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍ అనూహ్యంగా ఓటమి చవిచూడగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విధంగా రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‍ విజయకేతనం ఎగురవేశారు. 45వ అమెరికా అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో పాగా వేశారు.

ఔషధాలకు పుట్టినిల్లు తెలుగు లోగిళు

తరతరాల వారసత్వ సంపద.. ‘తెలుగు వైద్యం’. చిట్కా వైద్యంగా, వంటింటి కిటుకులుగా ఈనాటికీ గ్రామీణ జీవితానికి ప్రాణం పోస్తోందీ వైద్యం. ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని దీనికి మేళవిస్తే ఇది మరింత వన్నెసంతరించుకుంటుంది. మన పాటలు, ఆటలు అన్నింటా తరచి చూస్తే ఎన్నో వైద్య రహస్యాలు కనిపిస్తాయి. మన తెలుగు వారికి వైద్యం అనేది అరచేతిలో ఉసిరికాయ వంటిది. తరతరాలుగా తెలుగునాట జరుగుతున్న ఉత్సవాలు, పండుగలు, పబ్బాలు.. అన్నిటిలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉండటం

Top