మన తెలుగు.. మన వెలుగు

పఠనం.. పాఠవం.. ఇటీవల పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయింది. అంతర్జాలం మాయాజాలంలో పడి జనం ‘చదువు’ అనేదే మరిచిపోయారు. జర్మన్‍ కవి గోథె- ‘ప్రతి రోజూ ఉదయాన్నే ఒక మంచి పుస్తకంలోని వాఖ్యాలు చదవాలి. ఒక మంచి పాట వినాలి. ఒక అందమైన చిత్తరువును చూసి ఆనందించాలి. వీలైతే కొన్ని మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి’ అంటారు. కానీ, నేడు మనం అలా చేయగలుగుతున్నామా? మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిది.

‘ట్రంప్‍’ కు బాసటగా తెలుగు వెలుగులు

శ్రీనివాస్‍ నిమ్మగడ ఏ దేశమేగినా..ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమన్నా..పొగడరా నీ తల్లి భూమి భారతిని..నిలుపురా నీ జాతి నిండు గౌరవమును.. అన్నట్లు భారతీయులు ఎక్కడకు వెళ్లినా తమ ప్రతిభను చాటుకుంటారు. భారతీయులను తలెత్తుకునేలా చేస్తారు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అమెరికా రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడమనేది చిన్న విషయం కాదు..అలాంటి వారిలో ఓ అరుదైన భారతీయుడు, తెలుగుతేజం నిమ్మగడ్డ శ్రీనివాస్‍ ఒకరు. భారతీయులు తమ శక్తి సామార్థ్యాలను

చిరు @ 151

ఖైదీ నంబర్‍ 150 సినిమా షూటింగ్‍లో పాల్గంటూనే తీరిక చేసుకుని 151వ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో పాల్గంటున్నారని, ఎన్నో కథలు వింటున్నారని సమాచారం. కథ కుదిరితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమేనని ఇటీవల జరిగిన ‘సరైనోడు’ వేడుకలో చిరంజీవి సభా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి 151వ సినిమాకు దర్శకత్వం వహించే వారి పేర్లలో బోయపాటి శ్రీను పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు

తెలుగు ‘తెర’ మరుగు

వెండితెరపై తెలుగు వెలవెలబోతోంది. కళామతల్లి మాతృ భాషకు నోచుకోలేక పరభాషా పరాయణత్వంతో ఖిన్నురాలవుతోంది. ఆంగ్ల పదాలే నేరుగా సినిమా టైటిల్స్గా తెరకెక్కుతున్నాయి. ఇక, పాటలైతే చెప్పనవసరం లేదు. మనం వినేది తెలుగా.. ఆంగ్లమా..? అనేది తెలియనంతగా గీతాల్లో తెలుగు ఖూనీ అవుతోంది. ఒకప్పుడు అచ్చతెలుగు టైటిల్స్తో కనువిందుచేసిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు తెలుగునెలా విస్మరిస్తుందో ఒక్కసారి పరిశీలించండి. తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగ వేస్తే మొదట గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి.. గూడవల్లి

కసరత్తు మంచిదేగా

మనలో చాలా మందికి వ్యాయామం అంటే కొన్ని అపోహలు ఉన్నాయి. లావుగా ఉన్న వాళ్ళే వ్యాయామం చెయ్యాలని లేదా లావుగా ఉన్న వాళ్ళు గంటల తరబడి వ్యాయామం చెయ్యకూడదని, లేదా చెయ్యాలని, సన్నగా ఉన్న వాళ్లు అసలు వ్యాయామం జోలికి పోకూడదని.. ఇలా రకరకాల అపోహలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. మన శరీర నిర్మాణాన్ని, ఫిజియాలజీని అనుసరించి మాత్రమే మనం వ్యాయామాన్ని

Top