‘ఊ’.. కొడతారా?
పిల్లలకు కథలు చెప్పడం వారిని ‘దారి’లో పెట్టడానికే. ఊ కొట్టించి, కేవలం నిద్రపుచ్చడానికి మాత్రమే కాదు.. వారిని వాళ్లదైన ఊహాలోకంలోకి తీసుకెళ్లి వాళ్లలో నిద్రాణంగా ఉండే సృజనాత్మక శక్తిని పెంచడానికి కూడా!. అందుకే కథలంటే చిన్నారులు చెవికోసుకుంటారు. వాళ్లని వికాస సంపన్నులను చేయడానికి తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు కథలనే చెప్పాలి. కథలనే చదివించాలి. చిన్నారుల్లో క్రమంగా ఆలోచనా పరిధిని పెంచడానికి కథలే మార్గం. పైగా వారిని తేలికపరచడానికి ఉపకరించేవి కూడా