ఉత్తరాయణం

ఆరోగ్య ‘జ్యోతి’ అటు ఆరోగ్యాన్ని కలిగిస్తూ.. ఇటు సామాజిక స్ఫూర్తిని రగిలిస్తూ.. సత్యం వైపు నడిపించే అయ్యప్ప స్వామి దీక్షాధారణ గురించి డిసెంబరు తెలుగుపత్రిక సంచికలో అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ముఖ్యంగా యాత్ర సాగే విధానం, అక్కడి విశేషాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది రకాల భావాలకు ప్రతీక అని ఈ ముఖచిత్ర కథనం చదివిన తరువాతే తెలుసుకున్నాం. - బాలాజీ నాయక్‍, జి.సోమసుందర్‍, కె.పి.కిశోర్‍, లలితకుమారి,

శుభాలకు నాంది

కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్తగా ఏం చేయాలా? అని ఆలోచించే సందర్భం.. కొత్త ఏడాది ముంగిట్లోకి కొంగొత్త ఆశలతో అడుగుపెడదాం. పోయినేడాది కాలమంతా ఎలా గడిపామో.. ఏ క్షణాన్ని ఎలా ఖర్చు పెట్టామో తెలియదు. లెక్క చూసుకుంటే.. వృథాగా కొన్ని.. సద్వినియోగం చేసుకున్న రోజులు మరికొన్ని.. గతం గత: కొన్ని ఆలోచనలు ఆగిపోతాయి.. కొన్ని నడకలు అలసిపోతాయి.. కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే విరమించుకుంటాయి.. ఇవన్నీ అందరి జీవితంలో ఉండేవే.. మంచో.. చెడో.., కష్టమో.. సుఖమో.., ఆనందమో.. బాధో.., లాభమో..

కవర్‍ స్టోరీ

దేవదేవుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూలోకానికి వేంచేశాడు. వస్తూ వస్తూ వైకుంఠంలో ఉండే కొండలనూ, కోనలనూ, తీర్థాలనూ వెంట తెచ్చుకున్నాడు. తన దేవేరులైన శ్రీదేవి, భూదేవితో పాటు సేవకులైన గరుత్మంతుడు ఇతర పరివారమంతా ఆయన వెంటే ఉన్నారు. ఆ దేవదేవుడు నేరుగా సప్తగిరులలో అడుగిడాడు. అదిగో! అదే శ్రీహరివాసమైంది. ఆ స్వామి ఈ భూలోకంలో ఏరికోరి.. అదీ తెలుగింటి నేలపై ఇల్లు (ఆలయం) గుడి కట్టుకుని.. తెలుగువారి ఇంటింటి ఇలవేల్పుగా

క్లైమాక్స్ అదిరేలా..

క్యాలెండర్‍లో చివరి నెల దగ్గర పడుతోంది. తెలుగు సినీ పరిశ్రమకూ సంవత్సరాంతం కీలకమే. ముగింపు ఘనంగా ఉండాలని కోరుకునే నిర్మాతలు డిసెంబర్‍లో తమ సినిమాల విడుదలకు ప్లాన్‍ చేస్తున్నారు. స్ట్రెయిట్‍, డబ్బింగ్‍ కలిపి దాదాపు 15 వరకు సినిమాలు డిసెంబర్‍లో విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఆయా సినిమాల వివరాలు.. ఈ డిసెంబర్‍లో విడుదలయ్యే సినిమాల్లో అందరి దృష్టి బాలకృష్ణ ‘అఖండ2: తాండవం’పైనే ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై

విరులు సమర్పించి.. కోరి వరించి..

ధనుర్మాసం ప్రారంభం కాగానే వినిపించే పేర్లు- గోదాదేవి, తిరుప్పావై పాశురాలు..శ్రీరంగనాథుడు. ఆ విశేషాల నేపథ్యమేమిటంటే.. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతంలోని తులసి వనంలో గోదాదేవి అయోనిజగా దర్శనమిచ్చింది. విష్ణుచిత్తుడనే భక్తుడు ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేస్తాడు. గోదాదేవి బాల్యం నుంచీ శ్రీరంగనాథుడిని పవిత్రంగా కొలుస్తుండేది. క్రమేణా ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించుకుంటూ ఆ పరమాత్ముడిని పొందడం కోసం నిత్యం ఇంటిని శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులూ, పూలతో వాకిలిని అందంగా

Top