ఆధ్యాత్మిక స్ఫూర్తి ఆరోగ్య దీప్తి

సన్మార్గానికి తోవ చూపే అయ్యప్ప స్వామి దీక్ష ఏటా కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్షల సందడి మొదలవుతుంది. మార్గశిర-పుష్య మాసాల వరకు ఈ దీక్షాధారణలు కొనసాగుతాయి. మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో దీక్షను ముగిస్తారు. ఆరోగ్య దీప్తి.. సామూహిక సామాజిక స్ఫూర్తి.. సత్యం వైపు నడిపించే జ్యోతి మార్గం.. అయ్యప్ప దీక్ష. మోక్షాన్ని పొందడమే మానవ జన్మ పరమార్థం. ఆ మోక్షసాధనకు మనిషి చేసే ఆధ్యాత్మిక

అనసూయాత్రి సంభూత..అవధూత

దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి. ఆయన పుట్టిన వారం బుధవారం. తిథి మార్గశిర శుక్ల చతుర్దశి. నక్షత్రం కృత్తిక. దత్తాత్రేయ దేవాలయాల్లో ఈనాడు కీర్తనలు సాగుతాయి. దత్తాత్రయుడు ఉగ్ర దేవత అని గర్గ సంహిత చెబుతోంది. ఆయన ఉగ్ర దేవత కాబట్టే దేశంలో ఆయన ఆలయాలు తక్కువగా ఉన్నాయని అంటారు. ఈయన పుట్టినది బుధవారమైనా గురువారమే ప్రియమైనదని అంటారు. మార్గశిర పౌర్ణమి నాటికి యమదంష్ట్రలనే కష్టదినాలు తుదముట్టినందుకు సంతోష సూచకంగా ఉగ్రదైవమైన దత్తాత్రేయుడికి ఈనాడు పూజలు ఆచారంలోకి వచ్చి

అంగిరస మహర్షి

బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన వాడు అంగిరస మహర్షి. బ్రహ్మ మానసపుత్రులని అంటూంటారు కదా! అలాంటి మానస పుత్రులలో మూడవ వాడు అంగిరస మహర్షి. అంగిరస మహర్షి వేదమంత్రాలు నేర్చుకుని తపస్సు చేసి గొప్ప విజ్ఞానాన్ని, వివేకాన్ని పొంది గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్నాడు. కర్దమ ప్రజాపతి అనే ఆయన పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసి తొమ్మిది మంది కుమార్తెలను పొందాడు. అందులో శ్రద్ధ అనే పేరు గల అమ్మాయిని అంగిరస మహర్షికి

శూర్పణఖ

లోకంలో వలచిన వనిత కోసం పేరుకెక్కిన పురుషులు ఉన్నట్టే, మనసు పడిన మగవాని కోసం చరిత్ర సృష్టించిన స్త్రీలూ ఉన్నారు. మహోన్నత త్యాగాలతో, మరపురాని సాహసాలతో కొందరు పేరు పొందితే, మితిమీరిన స్వార్థాలతో, దారుణ దుర్మార్గాలతో మరికొందరు చరిత్రకెక్కారు. రామాయణంలో శూర్పణఖ ఈ రెండవ కోవకు చెందిన స్త్రీ పాత్ర. ఆమె ఏ ముహూర్తంలో రాముడిని చూసి మోహించిందో కానీ, ఆమె మోహం ఆ సీతారాముల దాంపత్యాన్ని చిందరవందర చేసింది. రావణుడి

అత్తగారు – కొత్త కోడలు

అనగనగా ఒక ఊళ్లో ఒక పెద్దమ్మ ఉండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. అతడికి యుక్త వయసు రాగానే మంచి అందమైన పిల్లను చూసి పెళ్లి చేసింది. కొంతకాలం పోయిన తరువాత కోడలు కాపరానికి వచ్చింది. అప్పుడు కోడలు అత్తతో అన్నది గదా- ‘అత్తా! అత్తా! నీ కోడలు కాపరానికి వచ్చింది గదా! ఇక నువ్వు చచ్చిపో అత్తా. ఇంటి పనులన్నీ నీ కోడలినైన నేను చూసుకుంటానులే’ అని. అప్పుడు అత్త, ‘ఓసే! నీ కడుపున

Top