వహ్వా.. హాండ్వో

శీతాకాలం సాయంత్రం వేడి వేడి పకోడీలో.. మిర్చి బజ్జీలో తినాలనిపించడం సహజం. అయితే, ఈసారి వాటికి బదులు కాస్త వెరైటీగా కూరగాయలతో స్నాక్స్ చేసేయండి. నాలుకకు రుచీ.. ఆరోగ్యానికి పోషకాలు.. ఇంకెందుకు ఆలస్యం.. ట్రై చేయండిలా.. కావాల్సినవి: ఇడ్లీపిండి: 2 కప్పులు, సొరకాయ తురుము: పావు కప్పు, పాలకూర తురుము: పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు: 2 టేబుల్‍స్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‍స్పూన్లు, క్యారెట్‍ తురుము: 2 టేబుల్‍స్పూన్లు, పచ్చిమిర్చి

విశేషాల బైబిల్‍

బైబిల్‍.. క్రీస్తు నడిచిన దారిని కళ్లకు కడుతుంది. జీవిత పాఠాలను బోధిస్తుంది. అందుకే క్రైస్తవులకు క్రీస్తు అంటే బైబిల్‍.. బైబిల్‍ అంటే క్రీస్తు. ‘డిసెంబరు 25: క్రిస్ట్మస్‍’ సందర్భంగా జీసస్‍ బోధనలను ప్రపంచం నలుమూలలకూ వ్యాపింపచేసిన ఆ పరిశుద్ధ గ్రంథం వెనుక ఆసక్తికరమైన అంశాలేమిటో తెలుసుకుందాం.. చరిత్రలో అత్యధికంలో 500 కోట్ల ప్రతులు అమ్ముడుపోయిన పుస్తకం బైబిల్‍ ఒక్కటే. ఇప్పటికీ ప్రతి సంవత్సరం పది కోట్ల బైబిల్‍ ప్రతులను క్రైస్తవులు కొంటున్నారట. ప్రపంచంలో

నందలూరు సౌమ్యనాథుడు

ఆంధప్రదేశ్‍లోని అన్నమయ్య జిల్లా నందలూరులో బహుదా నదీ తీరాన కొలువుదీరాడు సౌమ్యనాథస్వామి. ఇది అతి పురాతన ఆలయం. గర్భాలయంలో స్వామి వారి విగ్రహం ఏడడుగుల ఎత్తున ఉంటుంది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య ఇక్కడే కొంతకాలం ఉండి పలు సంకీర్తనలు రచించినట్టు చరిత్ర చెబుతోంది. చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గాలి గోపురం నిర్మించాడు. అనంతరం పాండ్య రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారని వివిధ శాసనాల ద్వారా

నీ పనే నీ దైవం!

లక్ష్యం లేదు.. ఏ దారిన వెళ్లాలో కానరాదు.. మంచిచెడులను బేరీజు వేసుకోగల విచక్షణ లేదు.. జీవన పరమార్థం ఏమిటో అసలే తెలియదు.. ఇదీ ఆధునిక మానవుడి దారీతెన్నూ లేని జీవన పయనం.. అర్జునుడు చేతిలోని ధనస్సును జారవిడిచాడు.. మనం మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాదాన్ని వదిలేస్తున్నాం.. ఎదురుగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి పార్థుడు కంగారెత్తాడు.. శత్రువులను చంపడానికి చేతులు రాక దిక్కులు చూశాడు.. మనం భ్రమల బందిఖానాలో చిక్కుకుంటున్నాం.. భయాల ఊబిలో దిగబడిపోతున్నాం.. అది కురుక్షేత్ర సంగ్రామం.. ఇది హృదయక్షేత్ర సమరం.. హృదయమే వాటిక.. మనోయజ్ఞమే యజ్ఞ సంకల్పం.. మనిషిలా

దత్తాత్రేయుడికి ప్రియమైన మేడిచెట్టు ప్రత్యేకతలేమిటి?

దత్తాత్రేయుడు మేడిచెట్టు కిందే ఎందుకు ఉంటాడు? మేడిచెట్టు ప్రత్యేకతలేమిటి?. ఔదుంబర వృక్షమంటే మేడిచెట్టేనా? ఔదుంబర వృక్షమంటే మేడిచెట్టుకు గల మరో పేరు. దీనినే అత్తి చెట్టు అని కూడా అంటారు. ఈ వృక్షం మొదట్లో కొలువుండటానికి దత్తాత్రేయుడు ఇష్టపడతాడని అంటారు. ఆయన ఉండే చిత్రాలలో ఆవుతో పాటు నాలుగు శునకాలు ఉంటాయి. ఆయన వెనుక ఉండే వృక్షం మేడిచెట్టే. దత్తాత్రేయుడు

Top