పుణ్యభూమి
ఎన్నో విశేషాలకు నెలవు పొత్తీశ్వరాలయం. ఈయననే పుట్టీశ్వరుడని కూడా పిలుస్తారు. ఈ శివలింగం దేవాలయం గర్భగుడిలో చాలా లోతులో ఉంటుంది. శివలింగాన్ని తాకితే పొట్ట భాగం (ఉదరం)లా మెత్తగా తగులుతుంది. సమీపంలోనే మహేంద్రతనయ నది ప్రభావమో.. ఏమో.. లింగం ఎప్పుడూ తేమగా, తడిగా ఉంటుంది. ఇక్కడ ఆవు గుండెకాయను పోలిన రాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. అర్జునుడు ఖడ్గమృగం వేటకు వెళ్లి గోవును చంపాడట. గోహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ




