ఆధ్యాత్మిక వికాసం

అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే, మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న. తల్లి తన మాటలతో బిడ్డలకు ధైర్యం చెబితే నాన్న తన చేతలతో మనలో ధైర్యం నింపుతాడు. మన తొలి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే. మనల్ని తీర్చిదిద్ది, మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు మనల్ని వేలుపట్టి నడిపించి, విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయడానికి అమ్మతో కలిసి నిరంతరం

ఆరోగ్య భాగ్యం సూప్‍.. ఎందుకు తాగాలి?

వానొచ్చినా.. చలిపెట్టినా.. జలుబు చేసినా.. జ్వరం వచ్చినా.. నోరు బాగోకున్నా.. పొట్ట మందంగా ఉన్నా.. వేడి వేడి సూప్‍ తాగుతుంటారు కొందరు. హోటల్‍కు వెళ్తే డిన్నర్‍ లేదా లంచ్‍కు ముందు కచ్చితంగా సూప్‍ తాగేవాళ్లు మరికొందరు.. ఒకప్పుడు సంపన్న వర్గాల్లో మాత్రమే ఉండే సూప్‍ తాగడం అనే ఈ అలవాటు నేడు ఆధునిక జీవనశైలి పుణ్యమా అని అందరికీ ఒంటబట్టింది. ఫలితంగా ‘సూప్‍’ చాలా ఫేమస్‍ అయిపోయింది. అసలీ సూప్‍

‘ఆహా’రం

రొయ్యల ఇగురు అందరూ చేసుకునేదే.. అదే రొయ్యలని మామిడితో కలిపి వండండి.. పుల్లగా, కారంగా ఉండే ఆ రుచికి మరో మరో ముద్ద ఎక్కువ లాగిస్తారు. కొబ్బరితో కలిపి చూడండి.. అన్నం కూడా లేకుండా అచ్చంగా కూరే తినేస్తారు. అసలు రొయ్యలతో ఒకటా రెండా..బోలెడు ప్రయోగాలు చేయొచ్చు. వాటిలో కొన్ని.. రొయ్యల ఫ్రైడ్‍రైస్‍ కావాల్సినవి: రొయ్యలు: 200 గ్రా., నూనె: రెండున్నర చెంచాలు, సోయాసాస్‍: చెంచాన్నర, మిరియాల పొడి: చెంచా, గుడ్లు: రెండు, ఉప్పు:

శ్రీరామ్‍ గారి లేఖలు

రజనీ ముఖంబున రాగంబు మెఱసెఁ గలువ పుట్టింటిలోఁ గలకల విరిసె దివ్య సౌధంబులో దీపాలు వెలిఁగె గర్భాలయంబులో గంటలు మ్రోఁగెఁ బ్రాక్సతీమణి పట్టె బంగారు గొడుగు విశ్వ సుందరి వీచె విరి చామరంబు భపద ఖండానంద భవనాంగణమునఁ బడిగాపు పడియుండె బ్రకృతి గణంబు - శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, ఏకాంత సేవ ఏమ్మా! ఎలా ఉన్నావు? ఫోన్‍లో నీ గొంతు విన్నపుడు, నీ పాట విన్నంతటి ఆనందం కలిగింది. చెల్లాయి వసంత ఎలా ఉంది? ‘విశాల’కు రాస్తున్న ఉత్తరం త్వరలో చేరుతుంది. అనుకోని కారణాల వల్ల ఆమెకు

కవర్‍ స్టోరీ

తీర్చిదిద్దినట్టుండే శరీర సౌష్టవం.. మంచి ఆరోగ్యం.. సంపూర్ణ ఆయుష్షు.. మది నిండా ఆనందం.. గుండె నిండా ధైర్యం.. ఇవన్నీ ఒక్కచోటే దొరికే జాగా.. యోగా! ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ.. యోగ. దేహాన్ని దేవాలయంగా, జీవుడిని దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా మలుచుకోవడానికి ‘యోగ మార్గ’మే శరణ్యం. యుగాలు మారినా.. తరాలు కదిలినా.. ఆర్టిఫిషియన్‍ ఇంటెలిజెన్స్లు, అల్గరిథమ్‍లు వచ్చినా.. అనాది కాలం నుంచి ఆధునిక

Top