మాసం.. విశేషం

ఆంగ్లమానం ప్రకారం ఆరవ మాసం జూన్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం (అధిక) జ్యేష్ఠ - జ్యేష్ఠ మాసాల కలయిక. అధిక జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు, నిజ జ్యేష్ట మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో ఉంటాయి. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసంగా చెబుతారు. కొన్ని విధాలైన వ్రత విధానాలకు జ్యేష్ఠం అనుకూలమైనది. జూన్‍ 1, సోమవారం నుంచి జూన్‍ 15, సోమవారం వరకు అధిక జ్యేష్ఠ

పిల్లల ఆటపాటలు

పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ , జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు.. హాయి హాయి ఆపదలు గాయి హాయిహాయనగాను ఆపదలు గడుచు చిన్న వారలగాచు శ్రీవేంకటేశు ।।హాయి।। రావె రావె పిట్ట రత్నాలపిట్ట కర్రదేవే పిట్ట కనకణ్ణి కొట్ట ।।హాయి।। వాసాల మీదది మీసాలపిల్లి అబ్బాయిచేతిది హంసల్లగిలక

ఉత్తరాయణం

ఉపయుక్తం పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది కానీ, తీరా వెళ్లాక అక్కడ వసతి ఎలా? ఎక్కడుండాలి? ఎక్కడ తినాలి? అనేవి పెద్ద సమస్యలు. ఊరు గాని ఊరు వెళ్తే అక్కడి విషయాలేమీ తెలియవు. అటువంటి పరిస్థితుల్లో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన సత్రం వారు దేశవ్యాప్తంగా దాదాపు పదహారు పుణ్యక్షేత్రాల్లో వసతి గదులు, భోజనశాలలతో కూడిన సత్రాలు నిర్వహిస్తున్నారని తెలిసి సంతోషం కలిగింది. నిజంగా దైవ దర్శనార్థం వెళ్లిన భక్తులకు

సంపాదకీయం ఎంత నిజమో కదా!

ఇద్దరు మిత్రులు ఒకరోజు అడవి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోకి ఒక సాధువు రొప్పుతూ వచ్చాడు. ‘ఎందుకలా భయపడుతున్నారు?’ అని ఆయనను అడిగారు వాళ్లిద్దరూ. ‘అదిగో.. అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది’ అన్నాడు సాధువు. ‘అంటే పులి ఉందా ఆ పొదలో’ అన్నారు వాళ్లిద్దరూ భయంగా. ‘లేదు. దానికంటే భయంకరమైనది. నేను మూలికల కోసం తవ్వుతుంటే బయటపడింద’న్నాడు సాధువు. ‘ఇంతకీ ఏమిటది?’ అని ఆదుర్దాగా అడిగారు ఇద్దరు మిత్రులు. ‘బంగారు నాణేల

కరివెన నిత్యాన్నదాన సత్రం షిర్డీ

సాయిబాబా షిర్డీలో జీవించినంత కాలం అన్నదానం చేస్తూనే ఉన్నారు. తానే స్వయంగా పెద్ద గుండిగల్లో అన్నం వండి అందరికీ వడ్డించే వారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని నువ్వు తిని, మరో నలుగురికి పెట్టడం కంటే పుణ్యం లేదని బాబా భక్తులకు బోధించే వారు. స్వయంగా వండి, దానిని గొప్ప ప్రేమతో, ఆదరంతో పెట్టాలని చెప్పే వారు. ఒంటరిగా కూర్చుని అన్నం తినరాదని, పక్కన మరో వ్యక్తిని, కనీసం పశుపక్ష్యాదులనైనా

Top