రాములోరు గెలిచారు!
రాముడు పుట్టి పెరిగిన నేల.. రాముడేలిన భూమి.. కొన్ని కారణాలతో వివాదాస్పదమైంది. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపమైన రాముడు చివరకు తన భూమి యాజమాన్య హక్కుల కోసం న్యాయబద్ధమైన పోరాటం జరపాల్సి వచ్చింది. ఆ వివాదాస్పద భూమిపై ఆయన పేరుపైనే వ్యాజ్యం దాఖలైంది. సుదీర్ఘ కాలం న్యాయ విచారణ కొనసాగింది. చివరకు ధర్మం గెలిచింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రాముడిదేనంటూ భారత అత్యున్నత న్యాయస్థానం ‘పట్టా’భిషేకం చేసింది. జాతి యావత్తూ ఉత్కంఠతతో




