వ్రతాలకు నెలవు సకల శుభాలకు శ్రవణ స్వాగతం

శావణ మాసపు శుభవేళ ప్రతి ఇల్లు ఒక కోవెలను తలపిస్తుంది. నెల రోజుల ఈ శుభ మాసం సర్వ శుభాలకు ‘నెల’వవుతుంది. ముప్పయికి ముప్పై రోజులూ శ్రావణ మాసంలో పవిత్రమైనవే. పూజలు, నోములు, పండుగలు, పర్వాలు.. అటు ఇళ్లలో ఇటు దేవాలయాల్లో పండుగ సందడి నెలకొంటుంది. ముత్తయిదువులదే ఈ నెలంతా సందడి. శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావాలసిన సావకాశం చిక్కుతుంది. పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువుల్లో, ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణం లోనే ఎక్కువగా చిక్కుతుందేమో. ఈ మాసంలో పనుపు రాసుకోవడం, పెసరపప్పు తినడం, పూలు, పత్రితో పూజించడం, పండ్లను, శనగలను, పంచి పెట్టడం వంటి ఆచారాలన్నీ వర్ష రుతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పని చేసేవే. ఇక, పూజలు, వ్రతాలు, పేరంటాలు, వాయనాలు.. వీటన్నింటి వల్లా సామాజిక బంధాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు

సాధారణంగా ఏ మాసంలోనైనా ఒక ప్రత్యేక తిథి వచ్చిందంటే చాలు ఆ నెలంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. అటు వంటిది ప్రతి రోజూ ఓ పండుగే, ప్రతి ఘడియా విశిష్టమైనదే అయిన శ్రావణ మాసం ఇంకెంత ప్రత్యేకమో కదా! ముత్తయిదువులు ఆచరించే నోములూ, వ్రతాల్లో ఎక్కువ భాగం ఈ మాసం లోనే ఉండటం వల్ల దీన్ని వ్రతాల మాసమనీ, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమనీ చెబుతారు. శ్రావణ మాసంలో ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే. ఈ నెలలోనే.. విష్ణుమూర్తి వరాహ రూపం ధరించాడు. హయగ్రీవుడిగా అవతరించాడు. ఇక, స్వయంగా ఆయన జన్మ నక్షత్ర (శ్రవణం) మాసమిది. మంగళగౌరీ పూజలూ, వరలక్ష్మీ వ్రతాలూ జరుపుకునేదీ ఈ మాసంలోనే. సూర్యభగవానుడికి అర్చించడానికి అనువైన సమయమూ ఇదేనంటారు. శ్రావణం అనగానే పట్టుచీరల రెపరెపలతో, పసుపు పాదాల గలగలలతో కళకళలాడే పడుచు ముత్తయిదువలే గుర్తుకొస్తారు. ఆషాఢంలో పండుగ, పబ్బాలు ఉండవు. దీంతో ఒక విధమైన నిర్లిప్తత ఆవరించి ఉంటుంది. అటువంటి వాతావరణమంతా శ్రావణ మాసంలో తొలగిపోతుంది. భాద్ర పదంలో వినాయక చవితినీ, ఆశ్వయుజంలో శరన్నవరాత్రులనూ నిష్టగా నిర్వహించుకోవడానికి అవసరమైన ఆధ్యాత్మిక సాధన శ్రావణంలోనే మొదలవుతుంది. చంద్రుడు పున్నమి రోజు శ్రవణా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి, ఈ మాసానికి శ్రావణమనే పేరు స్థిరపడింది.
లక్ష్మీప్రదమైన మాసం..
లక్ష్మీదేవి సర్వ సంపదలకూ అధిష్ఠాన దేవత. ఇంద్రియ నిగ్రహం, శాంతం, సౌశీలత్వం వంటి సుగుణాలకు ఆధారమైన సర్వ మంగళ రూపం లక్ష్మీదేవిది. లోభం, మోహం, రోషం, మదం, అహంకారం వంటి గుణాలేమీ లేని చల్లని తల్లి ఆమె. సర్వ స్వరూపాలు ఆమె రూపాలే. వైకుం ఠంలో మహాలక్ష్మీ, స్వర్గంలో స్వర్గలక్ష్మీ, రాజ్యంలో రాజ్యలక్ష్మీ, గృహాలలో గృహలక్ష్మీ అంటూ సర్వ ప్రాణులలో, ద్రవ్యాలలో ఉండే మనోహరమైన శోభ లక్ష్మీ రూపమే. లక్ష్మీదేవి అన్నిచోట్లా ఉండే దయారూపిణి. అలాంటి లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది.
సోమవారం, శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికర మైన రోజులు. ఈ రోజుల్లో పొద్దున, సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘ సుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలనూ ప్రసాదిస్తుంది. అలాగే, జ్యోతిష్య శాస్త్ర రీత్యా శ్రావణ మాసం ఆధ్యా త్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. దక్షిణాయనంలో ప్రారంభమయ్యే మొదటి మాసం శ్రావణం. శ్రావణ మాసపు తొలి రోజు కర్కాటక రాశితో ప్రారంభమవుతుంది. రాశ్యాధిపతి చంద్రుడు. ఆయన చాలా చల్లని పండు వెన్నెల మనసు కలిగిన వాడు. దీని వలన ఈ మాసంలో మానసిక ఉల్లాసం, ప్రశాంతత లభిస్తాయి. శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి శ్రావణ మాసపు తిథులు లక్ష్మీపూజకు శ్రేష్ఠమైనవి.
సర్వ మంగళ మాంగళ్యే..
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకీ శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే
(మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని విజయాలనూ సాధించి, శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్థాంగి అయిన ఓ పార్వతీ! ఓ దుర్గాదేవీ! ఓ నారాయణీ.. నీకు నమస్కరిస్తున్నాను).
వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతి కరమైన మాసం శ్రావణమే. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పూర్వీకుల ఉవాచ. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేయగల అవకాశం గల అత్యంత శుభప్రదమైన మాసం ఇదే.
శ్రావణ మాసాన్ని ‘నభో’ మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ మాసంలోని సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మన: కారకుడు. అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో రవి సంచరించు నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది. చంద్రుని చాయ నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించేందుకు, మంచి కలిగించేందుకు, ధర్మాచరణాలను పండుగగా ఆచరి

శ్రావణ వారాలు.. వరాలు

శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవి. ఆయా రోజుల్లో చేసే పూజలు, వ్రతాలు, నోముల వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయంటే..
శ్రావణ సోమవారాలు (ఆగస్టు 5,12,19,26):
తొలి సోమవారం: పంచమి తిథి. అధి దేవత నాగదేవత. ఫలం- వివాహం, వంశవృద్ధి.
రెండో సోమవారం: ద్వాదశి తిథి. అధి దేవత విష్ణువు. ఫలం- పుణ్యం. లక్ష్మీ కటాక్షం.
మూడో సోమవారం: తిథి చవితి. అధి దేవత పుష్పదంతుడు. కష్టాలు తొలగిపోతాయి. విఘ్నాలు కలగవు.
నాలుగో సోమవారం: దశమి తిథి. ఆయురారోగ్య వృద్ధి.
శ్రావణ మంగళవారాలు (ఆగస్టు 6,13,20,27):
తొలి మంగళవారం: తిథి షష్ఠి. అధి దేవత సుబ్రహ్మణ్యే శ్వరుడు. సంతానప్రాప్తి.
రెండో మంగళవారం: తిథి త్రయోదశి. ఆధి దేవత శనీశ్వరుడు. సకల పీడలు హరిస్తాయి.
మూడో మంగళవారం: తిథి పంచమి. ఆధి దేవత నాగదేవత. పుత్ర, పౌత్రాభివృద్ధి.
నాలుగో మంగళవారం: తిథి ద్వాదశి. అధి దేవత విష్ణువు. సకల సౌఖ్యాలు, లక్ష్మీప్రాప్తి.
శ్రావణ శుక్రవారాలు (ఆగస్టు 2,9,16,23,30):
తొలి శుక్రవారం: తిథి విదియ. అధి దేవత అశ్వినీ దేవతలు. ఫలం- ఆరోగ్య వృద్ధి.
రెండో శుక్రవారం: తిథి నవమి. అధి దేవత దుర్గాదేవి. ఫలం- సంపద ప్రాప్తి. ఈనాడే వరలక్ష్మీ వ్రతం.
మూడో శుక్రవారం: పాడ్యమి తిథి. అధి దేవత అగ్ని. ఫలం- సర్వకార్య సిద్ధి.
నాలుగో శుక్రవారం: తిథి సప్తమి. అధి దేవత సూర్య భగవానుడు. ఫలం- ఆయురారోగ్య వృద్ధి.
ఐదో శుక్రవారం: తిథి అమావాస్య. అధి దేవతలు పితృ దేవతలు. ఫలం- సంతాన సౌఖ్యం.
శ్రావణ శనివారాలు (ఆగస్టు 3,10,17,24,31):
తొలి శనివారం: తిథి తదియ. అధి దేవత గౌరీశంకరులు. ఫలం- దాంపత్య సౌభాగ్యం.
రెండో శనివారం: తిథి దశమి. అధి దేవత దుర్గాదేవి. దుర్గతులు నశిస్తాయి.
మూడో శనివారం: తిథి విదియ. అశ్వినీ దేవతలు అధి దేవతలు. ఆరోగ్య వృద్ధి కలుగుతుంది.
నాలుగో శనివారం: తిథి అష్టమి. అష్ట మాతృకలు అధి దేవతలు. అష్టఐశ్వర్యాలు కలుగుతాయి.
ఐదో శనివారం: తిథి పాడ్యమి. అధి దేవత అగ్నిదేవుడు. సర్వకార్యాలు నెరవేరుతాయి.

సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల, నీటిలో రసత్వం.. వీటితో పాటు కంటి చూపు, చెవి వినికిడి.. ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు. ఈ లక్షణాలను ఏ ఒక్కరూ కృత్రిమంగా సృష్టించలేరు. ఇవన్నీ ప్రాకృతిక శక్తులు. పరమేశ్వరుడి నుంచి వ్యక్తమయ్యే శక్తి విశేషాలే ఇవి అని భక్తులు విశ్వసిస్తారు. నిజానికి ఈ లక్షణ శక్తులే అసలైన ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్య రూపాలైన లక్షణ శక్తుల సమాహార స్వరూపమే ‘లక్ష్మీదేవి’.
సనాతన ధర్మంలోని ఈ లక్ష్మీ భావన- ప్రకృతి రూపంలో గోచరించే పరమాత్మ విభూతిగా ఆరాధన అందుకుంటోంది. విజ్ఞులు మరో కోణంలో దీనికి శాస్త్రపరంగా గల అర్థాన్ని వివరించారు.
జగతిలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు గల అన్నింటినీ లక్షిస్తూ (గమనిస్తూ), ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఇవ్వాలో నిర్ణయించి అనుగ్రహించే శక్తినే వారు ‘లక్ష్మి’గా నిర్వచించారు.
ఈ శక్తికే ‘శ్రీ’ (సిరి) అనే మరో పేరుంది. ఇదే నామాన్ని శాస్త్రాలు ఒక మహా మంత్రంగా భావిస్తున్నాయి. సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ ఆశ్రయం అత్యంత ప్రత్యేకం. ఇది సూర్యుడిని ఆశ్రయించిన కాంతి. చంద్రుని ఆశ్రయించిన చల్లని వెన్నెల వంటిది. భగవంతుడిని ఎన్నడూ ఎడబాయని ఆయన చిచ్ఛక్తి (చిత్‍, శక్తి)నే ‘శ్రీ’గా పరిగణిస్తారు. ఆ శక్తే మానవాళి పాలిట ఆశ్రయం.
మానవాళికి ఆధారమయ్యే శక్తి, పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తి.. ‘శ్రీ’. ‘రక్షణ శక్తి’యే ఈ శ్రీ. ఈ శబ్దానికి నిఘంటుపరంగా
శోభ, కాంతి, కళ, జ్ఞానం, విద్య అనే అర్థాలున్నాయి. ఈ అర్థాలన్నింటి ఏక రూపమే శ్రీలక్ష్మి. ప్రతి వారు భక్తిపూర్వకంగా కోరుకునేది ఈ లక్ష్మినే. ‘వరం’ అనే మాటకు ‘కోరుకునేది’ అని అర్థం. అందుకే ఈ తల్లిని ‘వరలక్ష్మి’గా పిలుస్తారు.
భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు’ (శుక్ర)వారం నాడు ప్రతి మాసం లోనూ లక్ష్మీ ఆరాధనను శాస్త్రం నిర్దే శించింది. మాసాల్లో ‘ఆర్థ్రత’కు ప్రధానమైన వర్ష రుతువు మొదటి మాసమే శ్రావణం. అందులో వృద్ధి చెందే చంద్రకళకు నెలవైన శుక్ల పక్షం, శుక్రవారం అత్యంత ప్రధాన మైనవని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ‘ఆర్ధ్రాం పుష్కరిణీం..’ అని శ్రీసూక్తం వర్ణించిన శక్తి- శాంతికి, పంటకు, ఐశ్వర్యానికి సంకేతం. శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైనది.
స్త్రీలో లక్ష్మీకళ ఉందని ‘దేవీ భాగవతం’ వంటి పురాణ వాంగ్మయం చెబుతోంది. అందుకే స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మం అని మన రుషులు ఉద్గాటించారు. స్త్రీ మూర్తులు లక్ష్మీకళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే- శ్రావణ శుద్ధ శుక్రవారం.
సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ, సంపదల సాకారమే మహాలక్ష్మి. దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావన కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.
వరలక్షీ వ్రత కథలో సిద్ధి పొందిన కథానాయిక చారుమతి. మంచి మతి (బుద్ధి) మాత్రమే దేవీకృపకు పాత్రమవుతుందని మానవాళికి ఆ పాత్ర సంకేతమిస్తుంది. సపందలను అడిగే ముందు ‘చారు’ (చక్కని) మతి కలిగి ఉండాలన్నదే అంతరార్థం. ఆ సందేశం అర్థమైతే వ్యక్తికి, సమాజానికి సౌభాగ్యప్రదం.
(ఆగస్టు 9: శ్రావణ శుద్ధ నవమి: వరలక్ష్మీ వ్రతం)

లక్ష్మీ నివాసం
నాలుగు రకాల పురుషార్థాలను భక్తులకు అందించేందుకు అమ్మ వారు ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రంలో పౌర్ణమి వేళ నాలుగు చేతులతో అవతరించారు. అందుకే అమ్మ వారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఏటా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారాన్ని విశేషమైన పండుగగా చేసుకుంటారు. ముఖ్యంగా మహిళా లోకంలో శ్రావణ శుక్రవారానికి విశేష ప్రాధాన్యం ఉంది. సిరులిచ్చే శ్రీలక్ష్మీ అనుగ్రహం పొందడానికి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు ఉపకరించవచ్చు. వాటికి ఆ తల్లి ఆనందించనూ వచ్చు. అయితే, భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని ఆమె చెప్పినట్టు మహా భారతంలోని శాంతిపర్వంలో ఉంది. లక్ష్మీదేవి తానెక్కడెక్కడ ఉంటానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్టు అందులో ఉంది. ఆమె మాటలను తిక్కన ఒక సీస పద్యంలో అత్యద్భుతంగా వర్ణించారు. అవే లక్ష్మీ స్థానాలుగా ప్రసిద్ధి పొందాయి.
గురుభక్తి నిరతులు, సురపితృపూజన
పరులును, సత్యసంభాషణులును,
దానశీలురు, పరధర్మం.
రాజ్ముఖచిత్తులు, బ్రాహ్మణప్రి
యులు, దివానిద్రావియుక్తులు, వృద్ధదు
ర్బలదీన యోషిత్క•పారతులును
శౌచులు, నతిథిభోజనశిష్టభోజులు
నేను మెచ్చు జనంబు, లిట్లుగాక
ఎక్కడ గురుభక్తి కలవారు ఉంటారో అక్కడ,
ఎక్కడ తల్లిదండ్రులను పూజించే వారు ఉంటారో అక్కడ,
ఎక్కడ దానగుణం కలిగిన వారుంటారో అక్కడ,
ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారుంటారో అక్కడ,
ఎక్కడ బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ,
ఎక్కడ పగటి పూట నిద్రించని వారుంటారో అక్కడ,
ఎక్కడ వృద్ధుల, దీనుల ఆదరణ ఉంటుందో అక్కడ,
ఎక్కడ శుచీ, శుభ్రత ఉంటాయో అక్కడ,
ఎక్కడ అతిథి, అభ్యాగతుల సేవ జరుగుతుందో అక్కడ తానుంటానని, అలా ఉండే వారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి మాట.
అలాగే తన అనుగ్రహం ఎవరు పొందలేరో కూడా ఆమె చెప్పింది.
ధర్మమెడలి, కామంబు క్రోధంబు జాల
గలిగిగర్వులై బలియు భైక్షంబునిడక
పరుష వాక్కుల గ్రూరంపు జరితములను
మిగిలి వర్తించు వారు నా మెచ్చుగారు
ధర్మాలను పాటించని వారు, కామ క్రోధాలు ఎక్కువగా ఉన్న వారు
గర్వం ఉన్న వారు, పేదలకు భిక్ష, పూజా సామగ్రి ఇవ్వని వారు
కఠినమైన మాటలు ఆడేవారు, కూ•చడం నియమమైంది. మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనసును తిప్పుకుని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుంచి తప్పించుకొనేందుకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
శ్రావణంలో శివారాధనకూ విశిష్ట స్థానం..
శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే తొలి మాసం. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణ మాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈమాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమ వారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామి వారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్టయితే సకల పాపాలు నశిస్తాయని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని (ఉపవాస దీక్ష) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండ గలిగిన వారు పూర్తిగా ఉప వాసం ఉండి దీక్షను పూర్తి చేయాలి. అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలోని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని అంటున్నారు పండితులు. అందుకే శ్రావణ మాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.
ఆయనలో దయ కలిగించేది ఆమే..
భగవంతుడు అనేకసార్లు అనేక రూపాల్లో ఈ లోకంలో అవతరించాడు. ఒక్కోసారి మానవుడిగా మాత్రమే వచ్చాడు. ఒక్కోసారి మానవుడి రూపంలో వచ్చినా మానవుడి శక్తికి అందని విధంగా ప్రవర్తించాడు. వామన అవతారంలో మనిషిగా వచ్చిన ఆయన.. మూడు అడుగులు ఇవ్వండంటూ ముల్లోకాలనూ కొలిచాడు. పరశురాముడిగా అవతరించి, గండ్ర గొడ్డలి చేతబట్టి భూమి చుట్టూ ఇరవై ఒక్కసార్లు చుట్టి దుష్ట పాలకులను ఏరిపారేశాడు. కృష్ణావతారమూ మానవుని రూపమే. రాముడూ మానవ రూపమే. తాను ఏ అవతారం ధరించినా మొదట ఆయనలో కలగాల్సినవి ఏవి?. అంటే భగవంతునికి జాలి, దయ, కృప కలగాలి. మనల్ని బాగు చేయాలంటే ఆయన హృదయంలో కలగాల్సింది కారుణ్యం. మన దుఃఖాన్ని చూసి ఆయనలో ఒక దయ కలగాలి. మన దుఃఖాన్ని తొలగించాలనే కోరిక కలగాలి. అయితే ఆయనలో దయ, కారుణ్యాది గుణాలను బయటకు తెచ్చేది మాత్రం ‘అమ్మ’ వారే. ఆ అమ్మ ఆయన వద్ద నిరంతరం ఉంటుంది. ఆ అమ్మకు అనేక రకాల పేర్లు ఉన్నట్టు మనం గ్రంథాలలో చూస్తున్నాం. ఆమెకు లక్ష్మి అని పేరు. శ్రీ అని పేరు. ఇందిర అని పేరు. లోకమాత, రమా, మంగళదేవత ఇలా ఎన్నెన్నో పేర్లు. అయితే ప్రసిద్ధమైన పేర్లు- లక్ష్మి, శ్రీ. ఇవి వేదం చెప్పిన పేర్లు, ఆమె చేసే ఉపకారాలను బట్టి ఎన్నెన్నో పేర్లను చెప్పినా- ‘హ్రీశ్చతే లక్ష్మీచ పత్‍-న్యౌ’ లేక ‘శ్రీ భవతు’ అంటూ వేదం చెబుతోంది. అందుకే భగవంతుడిని గుర్తించేటపుడు ఆయనలోని దయాది గుణాలను పైకి తెచ్చే నామంతో గుర్తించాలి. అందుకే ఆయనను శ్రీపతి లేక శ్రియపతి అని పిలుస్తుంటారు. లేదా లక్ష్మీనాథా అని పిలుస్తుంటారు. ఆయనకంటూ నారాయణ, విష్ణు అనే ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ప్రచురంగా కనిపించే నామం శ్రీపతి అనో లేక లక్ష్మీనాథా అనో. ఇవి ఆవిడ (లక్ష్మి) సంబంధంగా వచ్చిన నామాలు. అంటే ఆమె ఆయనలో పెంచిన దయ ద్వారా మనల్ని గుర్తిస్తాడని ఈ నామాలు పలకడం వెనుక గల ఉద్దేశం.
ఆమె పాదాలు ఆయన వక్షస్థలంపై..
లక్ష్మీదేవి పాద చిహ్నాలు భగవంతుని వక్షస్థలంపై ఉంటాయి. ఆమె భగవంతుని వక్షస్థలంపై ఉండి ఏం చేస్తుంది అని చెప్పే నామమే- ‘శ్రీ’. మనల్ని కాపాడేట్టు చేస్తుంది ఆమె. మామూలుగా పిల్లల విషయంలో తండ్రి హితాన్ని చూస్తాడు. తల్లి ప్రియాన్ని చూస్తుంది. హిత దృష్టితో తండ్రి దండిస్తాడు. అదే తల్లి ప్రియంతో మనకు ఏదో ఒక మంచి మాట చెబుతూ మనల్ని బుజ్జగించి ఓదార్చి క్రమంగా బాగుపడేట్టు చేస్తుంది. మొదట మనకు ఏది కావాలో తల్లి అడుగుతుంది. మనం కోరింది తగినదో కాదో చెబుతుంది. ఆపై తండ్రి వల్ల మనం కోరినదేదో చెప్పి మనకు కావాల్సినవి అందేలా చేస్తుంది. పిల్లల బాగుకు కోపం అవసరం. ప్రేమ కూడా అవసరం. ఈ రెండూ ఒకరే చూపిస్తే పిల్లలు నమ్మరు.
ందుకే ఒకరు కోపం చూపిస్తారు. ఒకరు ప్రేమను చూపిస్తారు. ఇది సాధారణంగా ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రవృత్తి. ఇలాగే జగత్‍ రక్షణ విషయంలో మన క్లేశాలను తొలగించడానికి మొదట అమ్మ ఉండాలి. అనేది మొదటి క్రియ. మన మాటలు వినడం రెండో క్రియ. విన్న మాటలను స్వామికి వినిపించి, మనపై మంచి భావాలు కలిగేటట్టు అమ్మ స్వామికి వినిపించడం అనేది మూడో క్రియ. ఇలా చెయ్యడం వల్ల ఆయన మనల్ని అనుగ్రహించేట్టు మన పాపాల వల్ల మనపై ఆయనలో ఏర్పడ్డ కోపాన్ని తొలగింగుట. మనకు ఆయనపై ఉన్న ద్వేషాన్ని తొలగించుట. ఇవన్నీ అమ్మ చేసే పనులు.
‘శ్రావయతి శ్రుణోతి ఇతి శ్రీ’.
అంటే- ఆమె మన మొరలను వింటుంది. ఆపై భగవంతుడిని వినేట్టు చేస్తుంది. కనుక ఆమె పేరు ‘శ్రీ’.మనం ఆశ్రయించాలని అనుకుంటే ఆశ్రయించేట్లు చేసేది కనుక ఆమె శ్రీ. మనల్ని కాపాడాలని స్వామిని ఆశ్రయించేది కనుక ఆమె శ్రీ. ‘శ్రీ’తో కూడుకున్నాడు కనుక ఆయన తప్పనిసరి రక్షణ చేసి తీరుతాడు కనుక ఆయన పేరు శ్రీపతి లేక శ్రీమన్నారాయణ.
శ్రావణ మాసం అని ఎందుకు పేరు?
మన మొరలను ఆలకించేందుకు (శ్రవణం- వినడం) ఆ తల్లి (లక్ష్మీ)ని సిద్ధపరిచే మాసం కనుకనే ఈ మాసానికి శ్రావణ మాసమనే పేరు వచ్చింది. మన మొరలను ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణం. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. చాతుర్మాస్య వ్రత క్రమం తెలుసుకుంటే ఇదంతా అర్థమవుతుంది. ఆషాఢ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాల కడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపచేసి జగత్‍ రక్షణ ఎలా చేయాలో ఆలోచించుకోవడానికి కావాల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయల్దేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఈ కాలంలో ఆరాధిస్తుంటారు. శ్రావణ మాసమంతా అమ్మ ఆరాధనకు వీలైన సమయం. పక్కన స్వామి లేనపుడు మన బాధలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత మాసం భాద్రపదం. మనకు భద్రములను కలిగించే మాసమిది. ఆ తరువాత మాసం ఆశ్వయుజ మాసం. అప్పుడు స్వామిని అమ్మను ఇరువురినీ కలిపి పూజ చేయడానికి పూర్వ రంగం. అందుకే దసరా పండుగ నాడు స్వామి అశ్వ వాహనంపై బయల్దేరి వస్తాడు. దానికి ముందు అమ్మ అనేక రూపాల్లో ఆరాధనలను అందుకుని శమీ వృక్షం కింద ఉంటుంది. శమీ అంటే క్షమింప చేసేది అని అర్థం. అందుకే స్వామి, మనం ఇరువురం శమీ వద్దకు వెళ్తాం. స్వామిని మనల్ని ఒకచోట జత పరుస్తుంది అమ్మ. భగవంతుని రక్షణ తప్పక లభిస్తుంది అనే ఆనందంతోటే మనం ఆశ్వయుజ మాసం చివరిలో దీపాలను వెలిగిస్తాం. వచ్చే కార్తీక మాసంలో స్వామి లేచి వస్తాడు. ఈ క్రమాన్ని గమనించి మన పూర్వులు శ్రావణ మాసంలో అమ్మను ఆరాధించే పద్ధతిని ఏర్పరిచారు. అందుకే లక్ష్మీప్రదమైన శ్రావణ మాసంలో అమ్మను గురించి తెలుసుకోవడం మన కర్తవ్యం.
శ్రావణ నోములు.. ఆరోగ్య రహస్యాలు
శ్రావణ మాసంలోనే పెక్కు వ్రతాల నిర్వ హణను ఆచారంగా పెట్టడానికి ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. పూర్వం శ్రావణ మాసంలో భర్తలు పొలం పనుల్లో నిమగ్న మయ్యే వారు. అలాంటప్పుడు తీరుబడిగా ఇంటిపట్టున ఉండే భార్యలకు తగినంత కాలక్షేపం కోసం వ్రతాలు చేసుకునే ఆచారం మొదలైంది. ఈ వ్రతాల్లో ఆచరించే కట్టుబాట్లు, నియమాలు చక్కని వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.
నైవేద్యంగా సమర్పించి, ఆరగించే చలిమిడి చలువ చేస్తుంది. చలిమిడి గర్భధారణ అవ రోధాలను తొలగిస్తుంది.
వరలక్ష్మీ వ్రతం రోజు వాయనంగా ఇచ్చే మొలకెత్తిన శనగలు పోషక నిలయాలు. వీటిలోని మాంసకృతులు తక్షణ శక్తినిస్తాయి.
వర్షాకాలంలో పాదాలు ఎక్కువ సేపు తడిగా ఉండటం వల్ల ఇన్‍ఫెక్షన్లు కలుగుతుంటాయి. ఇలా ఇన్‍ఫెక్షన్లకు గురి కాకుండా ఉండటం కోసమే కాళ్లకు పసుపు పూసుకోవడాన్ని ఈ వ్రతాల్లో భాగం చేశారు.
ఆవు నెయ్యితో వెలిగించే దీపాల ద్వారా విడుదలయ్యే ధూపం వాయు కాలుష్యాన్ని హరిస్తుంది.
వ్రతాలు.. సామాజిక అంశాలు
మనం జరుపుకునే ప్రతి పూజ, వ్రతం, నోముకూ ఒక సామాజిక, వైజ్ఞానిక కారణం ఉంటుంది. అలాగే, మంగళగౌరి, వరలక్ష్మీ వ్రతా లకూ అటువంటి కారణాలే ఉన్నాయి.
పూర్వం బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి అమ్మాయిలకు పూజా విధానంపై అవగాహన అంతగా ఉండేది కాదు. పెళ్లి కూతురుకు వీటి మీద పట్టు ఏర్పర్చడం కోసం నోములు, వ్రతాలు చేయించడం వెనక ఉన్న ప్రథమోద్దేశం. ముత్తయి దువులకు వాయనాలు ఇవ్వడం, వారి కాళ్లకు పసుపు రాయడం వంటి పనుల ద్వారా సఖ్యత పెంపొందించడం, స్నేహ సంబంధాలు ఏర్పర్చు కోవడం, ఎదుటి వారిని గౌరవించడం వంటి అలవాట్లను అలవరుచుకుంటారనే వ్రతాల్లో వీటికి ప్రాధాన్యం ఇచ్చారు. అత్తా కోడళ్ల మధ్య సఖ్యత పెంచడానికి కూడా ఈ వ్రతాలు దోహదం చేస్తాయి. కొడుకు అభివృద్ధి కోసం, కోడలి కడుపు పండటం కోసం అత్తగారే దగ్గరుండి మరీ కోడలి చేత నిష్టగా వ్రతాలు చేయిస్తుంది. మంగళగౌరీ వ్రతంలో మొదటి వాయనం తల్లికే ఇవ్వాలనే నియమం ఉంది. పెళ్లి తరువాత కూడా నవ వధువు తల్లికి ప్రాధాన్యం తక్కువ కాకూడదనే ఇలాంటి ఆచారం వెనక ఉన్న ఉద్దేశం.

Review వ్రతాలకు నెలవు సకల శుభాలకు శ్రవణ స్వాగతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top