సత్వగుణమే సర్వశ్రేష్టం
త్రిగుణాలు ప్రకృతి నుంచి ఆవిర్భవించాయి. జీవుడిని బంధనాల నుంచి దైవం రక్షించాలంటే సత్వ గుణమునే పొందాలి. ఈ గుణం నిర్మలంగా ఉంటుంది. జీవితాలను వెలుగుబాటలో నడిపిస్తుంది. ప్రతి అణువూ ప్రశాంతంగా గోచరించేలా చేస్తుంది. ఏ ఉపద్రవాలు ఉండవు. జీవులందరు సత్వగుణావలంబులై ఆత్మస్థితిని పొందాలని గీత బోధిస్తుంది. ఈ గుణం కూడా మాయ చేత ఆవరింపబడి ఉన్నప్పటికీ అది శుద్ధమైనదే. నిర్మలంగా ఉంటుంది కానీ రజో, తమో గుణాల కంటే మిక్కిలి