అక్షరానికో లేక
‘ప్రియమైన అక్షరానికి.. చిన్నప్పుడెప్పుడో అమ్మఒడిలో ఆటలాడుకున్నప్పుడో, నాన్న చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటున్నప్పుడో సరిగ్గా గుర్తు లేదు కానీ, తొలిచూపు లోనే భలే నచ్చేశావ్. చిక్కటి చీకటిలో వెన్నముద్దలు ఆరేసి నట్టు, నల్లటి పలకపై తెల్లగా మెరిసిపోతూ విచిత్రంగా కనిపిం చావ్. అప్పుడే తొలిసారి నీ మాయలో పడిపోయి ఉంటా. ‘అ’ అమ్మ, ‘ఆ’ ఆవు అంటూ మొదలైన నీతో పరిచయం




