ప్రకృతి ప్రజ్ఞ

మట్టి కున్న ‘బుర్ర’ మన మట్టి బుర్రలకు తెలిసేనా మట్టిలోని ‘మహిమ’ మన మందబుద్ధికి అందే మనం మరమనుషులమై పోయాం. కృత్రిమమైన తెలివితేటలు మితిమీరి, సహజ లక్షణాలు చచ్చిపోయాయి. ఇక ప్రకృతి మేధా శక్తిని ఎక్కడ గుర్తిస్తాం? సృష్టిచాతుర్యంపై దృష్టి పెడితే చాలు, తన్మయత్వం చెందుతాం. పసిపాప అవసరాలకు కావలసిన పదార్థా లన్నీ తల్లిపాలలో సమకూర్చబడినాయి. బిడ్డ పెరిగిన పిదప తల్లిపాలు సహజంగా ఆగి పోతాయి. ఇదీ శరీరం యొక్క నేర్పరితనం!! మన

దేవుడికి ఓ లెక్క ఉంది

ఒక గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన హూణ భాషలో పట్టభద్రుడు. అంతేకాక గణితంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. అతనిది బట్టతల. ఒకరోజు ఆ ఉపాధ్యాయుడు ఊరికి దూరంగా ఉన్న మరో గ్రామానికి కాలినడకన బయల్దేరాడు. అది మిట్ట మధ్యాహ్న సమయం. ఎండ మలమల మాడ్చివేస్తోంది. చేతిలో గొడుగు లేదు. పైగా బట్టతల. ఎండ నుంచి ఎక్కడైనా తలదాచుకుందామంటే దారిలో ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో

నిన్ను నువు ఉద్దరించుకో

రమణ మహర్షి దగ్గరికి ఓసారి పాశ్చాత్యుడు వెళ్ళి సలహా అడిగాడట - ‘స్వామీ! నాకు ఈ ప్రపంచానికి సేవచేయాలని ఉంది. ఎలా చేయమంటారు? అని అందుకు మహర్షి చెప్పారట - నాయనా ముందు నీకు నువ్వు సేవ చేసుకో. ప్రపంచానికి సేవ చేసినట్లే అని ఈ సరళమైన సలహాలో చాలా అంతరార్థం ఉంది. కాఠిన్యమూ ఉంది. మనిషి తనను తాను ఉద్ధరించు కోవడమంటే ఎలా ? సాటి

అమెరికాలోను హవా నడుస్తున్న ఆటగాధరా శివ

‘ఆటగదరా శివ’... తెలుగులో ఓ కొత్త హీరోతో రూపుదిద్దుకున్న సినిమా ఇది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తెలుగునాటే కాదు, అమెరికాలోనూ విజయ వంతంగా నడుస్తుంది. పైగా ఈ సినిమా పాటలను పవర్‍స్టార్‍ పవన్‍ కల్యాణ్‍ విడుదల చేయడం... ఈ సినిమా హీరో ఉదయ్‍శంకర్‍ తండ్రి గాజుల శ్రీరాం తన ఆధ్యాత్మిక గురువు గారని చెప్పడంతో ఈ సినిమా హీరో మామూలోడు కాదని అందరికీ అర్థమైపోయింది. పవన్‍కల్యాణ్‍ ఇలా ప్రకటించిన కొద్దిసేపటికే

వెన్నెల వెలుగుల రక్షాబంధన్

శ్రావణ శుద్ధ పూర్ణిమ (ఆగస్టు 26, ఆదివారం) చాలా విశేష పర్వాల కలయిక. ఈనాడు జంధ్యాల పున్నమి, రాఖీ పున్నమి, నార్లీ పున్నమి, హయగ్రీవ జయంతి అనే పర్వాలు నిర్వహిస్తారు. శ్రావణ పూర్ణిమే నార్లీ పూర్ణిమ. ఈ పర్వానికి పౌరాణిక సంబంధం ఉన్నట్టు కనిపించదు. ఈనాడు గుజరాతీ బ్రాహ్మలు తమ పోషకుల్ని దర్శించి వారి ముంజేతికి రాఖీ కడతారు. రాఖీ అంటే తోరము. అందుచేత ఈ పర్వానికి రాఖీ పూర్ణిమ

Top