అన్ని తెలిసినవాడు…

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని అమావాస్య మరణం మనకు నిత్యం అనేక సందర్భాలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు

కనిపించే దైవం – కనిపించని దైవం

ముందుగా కనిపించే దైవాన్ని దర్శించి తరించి, ఆపై కనిపించని దైవం వైపు దృష్టి సారిద్దాం. కొందరు కళ్ళు తెరచి జగత్తును పరికిస్తూ, పరిశీలిస్తూ, పరిశో ధిస్తూ, జగన్మోహనుని తిలకించి, పులకించి జన్మ ధన్యం చేసుకుంటారు. మరికొందరు కళ్ళు మూసు కొని, అంతర్నేత్రంతో అంతర్యామిగా కనుగొని అనంత సుఖసాగరంలో మునిగిపోతారు. ఓ చిన్నపాప ముద్దులన్నీ మూటగట్టుకొని మనముందు నిల్చుంది. అందమైన జడతో, ముచ్చట గొలిపే

ప్రశ్నతోనే ఫలం…. ఫలితం

ఒక ఊరిలో శివదాసు అనే పూజారి ఉండేవాడు. తండ్రి నుంచి వారసత్వంగా మహదీశ్వరాలయంలో పూజాధికాలు నిర్వహిస్తుండే వాడు. కానీ, నిజానికి అతనికి ఏకోశానా భక్తి ఉండేది కాదు. భక్తులను తృణీకార భావంతో చూసేవాడు. పూజలు చేసే సమయంలో గోత్ర నామాలు సరిగా పలికే వాడు కాదు. పూజ కూడా తూతూ మంత్రంగా కొనసాగించే వాడు. భక్తులకు ఇదంతా తెలిసినా పూజారి అనే గౌరవంతో కిమ్మనే వారు కాదు. ఒకసారి

ముక్తి మౌక్తిక మార్గాలు

సాధనతో దొరికేదా సద్గతి ? ఉన్నది ఉన్నట్టుగా ఉండటమే ఉన్నతి! ముక్తికాంతతో ముచ్చటలాడాలని, మోక్ష మౌక్తికాన్ని ముద్దాలాటలని ఎంతోమంది ముముక్షు వులు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. మోక్షం నిజానికి మనం పొందవలసిన పదార్థం కాదు. ఇదివరకే మనం పొందిన పదార్థం. మనం పొందాలనుకునే మోక్షం, మనం ఇదివరకే పొందామని (మెడలోని దండలాగా) గ్రహించటానికి అవసరమైన జ్ఞానాన్ని పొందటం మనం చేయవలసిన పని. మనం ఎక్కడెక్కడో వెదికే హారం మన మెడలోనే వ్రేలాడుతూ ఉన్నదని చూపించే

ఈ మధుమాసం లో…

ఉగాది.. మన ఊహల గాది. మన కలల పునాది. మన అంతరాంతవేది. ఉగాది సర్వజన హృదయాహ్లాది. తెలుగు నాట ‘ఉగాది’. అస్సాలో ‘బిహూ’. కేరళలో ‘కొల్లవర్షం’. పంజాబ్‍లో ‘వైశాఖి’. మహారాష్ట్రలో ‘గుడిపడ్వా’. సిక్కింలో ‘నోసంగ్‍’. పేర్లూ, ఊళ్లూ వేర్లయినా ఉగాది అందించే సందేశం మాత్రం ఒక్కటే. భాషలూ, వేషాలు వేరైనా పవిత్ర భావన ఒక్కటే. ఇక, తెలుగునాట ఉగాది భావనలు, అదీ మన తెలుగు సాహిత్యంలో కొత్త చిరుగు తొడిగిన

Top